దుస్తుల మీద రక్తపు మరకలను వదిలించే సులభ చిట్కాలు...!

బట్టలపై మొండి మరకలను వదలగొట్టడానికి మార్కెట్ లో రకరకాల స్టైయిన్ రిమూవర్ లిక్విడ్స్ ను కొనుగోలు చేస్తుంటారు. అయితే అవి ఖర్చుతో కూడినవి అయినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది.

బట్టల పై పడే మరకలను తొలగించడానికి ఎన్నో చిట్కాలు ఉపయోగిస్తుంటాం. ఒక్కోసారి కొన్ని మొండి మరకలు అంత త్వరగా వదలవు. సిరా, రక్తం, కాఫీ, గ్రీజు మరియు రస్ట్ మరకలు మొండి మరకలు. వీటిని తొలగించేటప్పుడు ఈ కింది చిట్కాలను పాటీంచి చూడండి. అయితే ఒక మరకపై పనిచేసిన చిట్కా మరొక రకమైన మరకపై పనిచేయకపోవచ్చు.

ముఖ్యంగా స్త్రీల విషయంలో రుతుక్రమంలో రక్తపు మరకలు కొత్త బట్టలు, లేదా ఇష్టమైన బట్టల మీద పడితా చాలా బాధపడుతుంటారు. ఇంక వాటిని ఉపయోగించడానికి వీలు పడదని డిసైడ్ అయిపోతారు. రక్తపు మరకలు పసుపు పచ్చవర్ణంలోనికి తిరిగి మెండి మరకగా ఏర్పడుతుంది. ఈ మరకను వదలగొట్టాలంటే సాద్యపడదు. అటువంటప్పుడు మేము కొన్ని సులభ చిట్కాలను అందిస్తున్నాం. రక్తపు మరక ఏర్పడ్డ వెంటనే వీటిని ఉపయోగించినట్లైతే రక్తపు మరకలు త్వరగా వదిలించుకోవచ్చు. రక్తపు మరకలు తడి ఆరిపోతే వదిలించుకోవడం చాలా కష్టం. మరి ఆ చిట్కాలేంటో ఒకసారి చూద్దాం..

ఉప్పు: దుస్తుల మీద రక్తపు మరకలు ఏర్పడ్డ వెంటనే ఆ దుస్తులను ఉప్పు వేసిన నీటిలో నానబెట్టుకోవాలి. ఉప్పు రక్తపు మరకను లైట్ గా మార్చి సులభంగా మరక వదిలేలా చేస్తుంది.

To Remove Blood Stains From Clothes

హైడ్రోజెన్ పెరాక్సైడ్: నాన్ టాక్సిక్ కెమికల్స్ లో నానబెట్టాలి లేదా హైడ్రోజెన్ పెరాక్సైడ్ రెండు మూడు చుక్కలు నీటిలో వేసి మరకలున్న దుస్తులను అందులో నానబెట్టి తర్వాత శుభ్రం చేస్తే మరకలు వదిలిపోతాయి.

డిటర్జెంట్ బార్: డిటర్జెంట్ సోపులను ఉపయోగించడం వల్ల కూడా రక్తపు మరకలు సులభంగా పోగొట్టవచ్చు. మరకలు వదిలించడంలో డిటర్జెంట్ పౌడర్లు పనిచేయకపోతే డిటర్జెంట్ సోపులను ఉపయోగించి, వేడినీళ్ళ సహాయంతో అతి సులభంగా తొలగించవచ్చు.

చల్లటి నీళ్ళు: రక్తపు మరకలు అప్పుడే పడిఉంటే, వెంటనే చల్లటి నీళ్ళలో ఆ దుస్తులను నానబెట్టి తర్వాత మరకల మీద ఉప్పు వేసి బాగా రుద్ది శుభ్రం చేయడం వల్ల మరక వదిలిపోవడమే కాకుండా దుస్తులయొక్క రంగు మారదు.

రక్తం మరకలు: ముందుగా రక్తం మరక పడిన బట్టను వెంటనే చల్లటి నీటిలో నానబెట్టాలి.ఆ పైన వైట్ వెనిగర్ తో శుభ్రపరచి శుభ్రమైన మరొక బట్టతో మరక ఉన్న బట్టను రుద్దకుండా అదిమి పట్టాలి. పూర్తిగా రక్తం మరకు ఇంకిపోయే వరకు అదిమిపట్టుకుని ఆపైన వెనిగర్ వాసన పోయే దాకా నీళ్లల్లో జాడించాలి.

బేకింగ్ సోడా: చాలా వరకూ దుస్తులను శుభ్రపరచడానికి బేకింగ్ సోడాను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఫాబ్రిక్ క్లోత్స్ ను ఉతికేటప్పుడు బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల దుస్తుల మీద మెండిమరకలు వదలడంతో పాటు, కలర్ మారకుండా సహాయపడుతుంది.

నిమ్మ: ఇది మరొక క్లీనింగ్ ఏజెంట్. దీన్ని నేచురల్ బ్లీచ్ గా ఉపయోగిస్తారు. రక్తపు మరకలున్న చోట ఉప్పు మరియు నిమ్మతొక్కతో రుద్దడం వల్ల మరకలు సులభంగా తొలగిపోతాయి.

Story first published: Monday, April 8, 2013, 17:18 [IST]
Desktop Bottom Promotion