Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
గుడ్డే కాదు గుడ్డు పెంకు కూడా ఉపయోగకరమే..!
గుడ్లు తినడం అంటే మనందరికీ చాలా ఇష్టం. ప్రతి ఇంట్లో గుడ్లను నివ్వఉంచుకోవడాన్ని గమనించే ఉంటారు. అయితే మనం సాధారణంగా గుడ్డును ఉపయోగించేటప్పుడు గుడ్డు పగలగొట్టి లోపలి మిశ్రమాన్ని మాత్రం తీసుకొని ఎగ్ ఎగ్ షెల్(డొల్ల)ను పడేస్తుంటాం. సరే, ఎగ్ ఎగ్ షెల్ (డొల్ల)కూడా ఉపయోగపడుతుందనే విషయం మీకు తెలిసుండకపోవచ్చు. ఉదాహరణకు: ఎగ్ షెల్ ను కిచెన్ క్యాబినెట్ (వంటగది)లో ఉంచడం వల్ల చీమలు మరియు బొద్దింకలు వంటవి వంటగదిలోనికి చేరవు. ఎగ్ షెల్ నుండి వచ్చే వాసన బొద్దికలను వంటగదిలోనికి చేరనివ్వకుండా సహాయపడుతాయి.
కాబట్టి, నెక్ట్స్ టైమ్ మీరు ఆమ్లెట్ తయారు చేసుకొన్నప్పుడు ఎగ్ షెల్స్ ను విసేరయకుండా, ఇలా ఉపయోగించుకోవచ్చు. ఎగ్ షెల్స్ ను బ్యూటీ ప్రొడక్ట్ గాను లేదా గార్డెన్ కు ఉపయోగించుకోవచ్చు . ఇటువంటివే మరికొన్ని అద్భుతమైన ఉపయోగాలున్నాయి..వాటిని ఒక సారి పరిశీలించండి...

1. మట్టిని సారవంతం చేయడానికి: ఎగ్ షెల్స్ ఉపయోగించడం వల్ల ఒక మంచి ఉపయోగం, ఎగ్ షెల్స్ గార్డెన్ మట్టిలో వేయడం వల్ల మట్టి మరింత సారవంతంగా మారుతుంది. ఎగ్ షెల్స్ ను క్రష్(పొడిపొడిగా చేసి)మట్టిలో స్ప్రెడ్ చేయాలి. ఎగ్ షెల్స్ లో ఉన్న క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల సమృద్ధిగా కంపోస్ట్ నేలగా మారుతుంది.
2. విత్తనాలు మెలకెత్తడానికి : ఎగ్ షెల్స్ లో చిన్న చిన్న మొక్కలను మొలకెత్తించడానికి గుడ్డు యొక్క పెంకు బాగా సహాయపడుతుంది. విత్తనాలు మొలకెత్తడానికి ఎగ్ షెల్ కు చిన్న సన్నటి రంధ్రాన్ని పెట్టాలి.
3. మూసుకుపోయిన డ్రైన్: ఘనమైన వ్యర్థ పదార్థాలతోటి డ్రైనేజ్ మూసుకుపోయినప్పుడు, ఎగ్ షెల్స్ ను పొడి పొడి చేసి రాత్రి సమయంలో డ్రైయిన్ లో పోయాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. ఇది మరింత మెరుగ్గా పనిచేయాలనుకుంటే కొద్దిగా వెనిగర్ ను డ్రాప్ చేయండి.
4. పెట్ ఫుడ్: ఎగ్ షెల్స్ లో క్యాల్షియం, ఐరన్, మరియు మినిరల్స్ సమృద్ధిగా ఉంటాయి. మీ కుక్కలకు కొన్ని న్యూట్రీషియన్ ఫుడ్ ను అందించాల్సి ఉంటుంది. కాబట్టి ఎగ్ షెల్స్ ను చాలా నునుపు పౌడర్ చేసి వాటికిచ్చే ఆహారంతో పాటు ఇవ్వాలి.
5. సేంద్రియ పురుగు మందు: ఎగ్ షెల్స్ ను బాగా మెత్తగా పొడి చేసి వెజిటేబుల్స్ మరియు పండ్లు చుట్టూ చల్లాలి. స్లగ్స్, పురుగులు, ఈగలు ఉన్న వార్డ్స్ లో కూడా చల్లాలి. ఇందులో సేంద్రియ లక్షణాలు కలిగి ఉండటం వల్ల మొక్కలకు హానీ కలిగించదు.
6. క్లీనింగ్: ఎగ్ షెల్స్ ను పొడి చేసి వెనిగర్ తో మిక్స్ చేసి, వంటగదిలోని మరకలు పడ్డ సామాన్లను శుభ్రం చేయవచ్చు. ఇవి మరకలు పడ్డ పాత్రలకు స్ర్కబ్ లా బాగా పనిచేస్తుంది.
7. స్కిన్ కేర్: మెరిసే చర్మం పొందాలన్నా మరియు వృద్ధాప్యంతో పోరాడాలన్నా ఎగ్ వైట్ లో ఎగ్ షెల్ పౌడర్ ను మిక్స్ చేసి, దీన్ని ఫేస్ ప్యాక్ లా ముఖానికి అప్లై చేయాలి. ఇది తడి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మెరిసేటి సపెల్ చర్మాన్ని పొందవచ్చు.
8. స్వీటెన్ కాఫీ: గ్రౌండెడ్ కాఫీ చిరు చేదు కలిగి ఉంటుంది. మీరు స్వీట్ కాఫీ పొందాలంటే ఎగ్ షెల్స్ ను మెత్తని పేస్ట్ లా తయారు చేసి కాఫీ పౌడర్ లో మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల కాఫీ రుచి కానీ లేదా కాఫీ సువానకానీ ఎంత మాత్రం తగ్గదు. ముందు కంటే కొంచెం బెటర్ గా చేదు తక్కువగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
