వాక్యూం క్లీనర్ వాడుకలో ఉండే సౌకర్యాలు మరియు అసౌకర్యాలు..!

మొట్ట మొదటిగా వాడుకలోకి వచ్చిన వాక్యుం క్లీనర్లు భారిగా ఉండేవి. వాటిని ఉపయోగించేందుకు అసౌకర్యంగా ఉండేది. ఆ వాక్యూం క్లీనర్లను వాడేందుకు ఇద్దరు వ్యక్తులు అవసరమయ్యేవారు. అయితే, ఇప్పుడు లభిస్తున్న ఆధునిక వాక్యూం క్లీనర్లలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆధునిక వాక్యూం క్లీనర్లలో ఉండే టేలీస్కోపింగ్ అటాచ్ మెంట్స్ మరియు హెపా (HEPA) ఫిల్టర్లు వంటివి గాలిలోని అలర్జీని కలిగించే పదార్ధాలని తొలగిస్తాయి. వాక్యూం క్లీనర్ని ఎంచుకునే ముందు ఎన్నో విషయాలు పరిగణలోనికి తీసుకొనవలసివస్తుంది. మీ ఇంటిలోని ఫ్లోర్, ఇంటిలోకి దుమ్ము వ్యాప్తి చెందే అవకాశాలు, మీ బడ్జెట్ వంటివి ముఖ్యమైనవి అంశాలుగా వాక్యూం క్లీనర్లని ఎంపిక చేసుకొనే ప్రక్రియలో చెప్పుకోవచ్చు.

వాక్యూం క్లీనర్లలోని వివిధ రకాలు:

కేనిస్టర్ వాక్యూం క్లీనర్:
ఎక్కువకాలం మన్నే వాక్యూం క్లీనర్లుగా బాగా దుమ్ముని పిల్చుకునే కేనిస్టర్ వాక్యూం క్లీనర్లని పరిగణించవచ్చు. వీటిలో ఉండే సౌలభ్యం, వినియోగదారుడు కి అవసరమైన విధంగా ఒదిగిపోవడం. వీటికి ఉండే పొడవైన లోహపు గొట్టాల వల్ల ఎంతో ఉపయోగం. కుర్చీలు, బల్లలు, మెట్లు మరియు కర్టెన్ ల పై ఉండే దుమ్ము, తివాచీలపై ఉండే దుమ్ము ని ఇవి ఏంతో సులభంగా తొలగించగలవు. సోఫాల కింద, మంచాల కింద కుడా శుభ్రం చెయ్యగలవు. కేని స్టర్ వాక్యూం క్లీనర్లలో బీటర్ బార్ ని అపివేసుకునే సౌలభ్యం కూడా కలదు. సాధారణంగా, తివాచీలు, కార్పెట్లు వంటివి క్లీన్ చేసేటప్పుడు వాటి పైన ఉండే దుమ్ముని తొలగించడానికి బీటర్ బార్ ని ఆన్ చేసి ఉంచుతారు. బీటర్ బార్ లో ఉండే బ్రష్ లు చెక్క నేలని లేదా గట్టిగా ఉండే ఉపరితలాలను శుభ్రపరిచేటప్పుడు గీతలు కలిగించే అవకాశాలు ఉంటాయి. అందుకనే బీటర్ బార్ ని ఆఫ్ చేసే సౌలభ్యం కూడా ఈ వాక్యూం క్లీనర్లలో కలవు. సాధారణంగా లభించే వాక్యూం క్లీనర్ల కంటే వీటిని ఉపయోగించడం కొంచెం కష్టం. ఈ వాక్యూం క్లీనర్లలో ఉండే వాక్యూం బాగ్స్ చిన్నవిగా ఉండడం వల్ల తరచూ కొత్త వాక్యూం బాగ్స్ తో భర్తీ చెయ్యవలసివస్తుంది.

అప్ రైట్ వాక్యూం క్లీనర్:
అప్ రైట్ వాక్యూం క్లీనర్లు తక్కువ బరువు కలిగినవి 100 డాలర్ల లో పు లభిస్తే, భారి పనులకి ఉపయోగించే యంత్రాలు $1,000 డాలర్ల పై గా నే ధర పలుకుతాయి. అప్ రైట్ వాక్యూం క్లీనర్లని వాడడం సులభం. కార్పెట్లని కూడా శుభ్రపరుస్తాయి. కుర్చీలు, బల్లలు, ఇంటిలో ఉండే సామాన్లతో పాటు, మెట్లు వంటి వాటిని వాక్యూం క్లీనర్ కి వీటితో లభించే పరికరాలను అటాచ్ చెయ్యడం ద్వారా శుభ్రపరచవచ్చు. వాక్యూం బాగ్స్ ని ఉపయోగించకుండానే ఇవి వాడుకోవచ్చు. అప్ రైట్ మోడల్స్ లో ఉండే సైక్లోన్ వాక్యూం సిస్టం వాల్ల వాక్యూం బాగ్స్ ని వాడే అవసరం లేకుండా చేస్తుంది. అయినా శుభ్రం చేసే ప్రతీ సారి దుమ్ముని కల్లెక్ట్ చేసే కప్పుని ఖాళీగా ఉంచాలి. శుభ్రం చేసే సామర్ధ్యం వాక్యూం క్లీనర్ బట్టి అప్ రైట్ మోడల్స్ లో మారుతూ ఉంటాయి. వీటిలో ఉండే అసౌకర్యాలు ఏంటంటే గట్టిగా ఉండే నేలని శుభ్రం చేసేందుకు అదనపు ఏర్పాట్లు ఉండవు. అటాచ్ మెంట్లకి ఉండే గొట్టాలు కొంచెం చిన్నవి గా ఉంటాయి.

Vacuum Cleaners

రోబోటిక్ వాక్యూం క్లీనర్లు:
త్వరగా క్లీన్ చేసే అవసరం ఉన్న చోట రోబోటిక్ వాక్యూం క్లీనర్లు చాలా చక్కగా ఉపయోగపడతాయి. నేలమీద వాటిని సెట్ చేసి, బటన్ నొక్కండి. మిగతా పని వాక్యూం క్లీనర్ చూసుకుంటుంది. $1,000 డాలర్ల లోపు లభించే వాక్యూం క్లీనర్ల మోడల్స్ లో (జనవరి 2011 వరకు) ఎటు పడితే అటు తిరిగే బ్రష్ ఉంది. శుభ్రం చేసాక దుమ్ము, ధూళి, చెత్త మొదలైన వాటిని సేకరించి వాక్యూం క్లీనర్లో ఉండే ఒక కప్ లో కి పంపిస్తాయి. దుమ్ముని పీల్చడం ద్వారా కార్పెట్లని ఈ రకపు వాక్యూం క్లీనర్లు శుభ్రం చెయ్యవు కనుక కార్పెట్ వంటివి అత్యంత శుభ్రంగా ఉండడం కోసం మీరు అప్పుడప్పుడు కేనిస్టర్ లేదా అప్రైట్ మోడల్స్ వాక్యూం క్లీనర్లని వాడడం ద్వారా ఈ అసౌకర్యాన్ని అధిగమించవచ్చు.

వెట్/డ్రై వాక్యూం క్లీనర్లు:
ఇవి ఎక్కువగా షాపులలో వాడుతారు. భారీ వ్యర్ధ పదార్ధాలు, తడి చిందిన చోట శుభ్రం చేసేటప్పుడు ఈ వెట్/డ్రై వాక్యూం క్లీనర్లు ఉపయోగపడతాయి. ఇటువంటి చోట సాధారణ వాక్యూం క్లీనర్లువాడితే పాడైపోతాయి. వెట్/ డ్రై వాక్యూం క్లీనర్లకి బాగ్స్ ఉండవు. పెద్ద డబ్బా ఉంటుంది. దిని పై బాగంలో ఉండే ఒక పరికరం సులభంగా మార్గం లో ఉండే చెత్త, రంపపు పొట్టు, గోడలని క్లీన్ చెయ్యడం, కారుని శుభ్రం చెయ్యడం వంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది.వెట్/డ్రై వాక్యూం క్లీనర్లకి వాక్యూం బాగ్స్, సీల్ లేకపోవడం వాల్ల ఇవి దుమ్ముగా ఉంటాయి. ఇవి పరిమాణంలో పెద్దగా ఉండడం వల్ల ఇండోర్ యూస్ కి లేదా అంతర్గత వాడుకకి వాడడానికి అనుకూలంగా ఉండవు. గారేజ్ లో లేదా షాపులలో వీటి ని వాడుకునేందుకు సౌకర్యంగా ఉంటుంది.

Story first published: Monday, January 7, 2013, 12:18 [IST]
Desktop Bottom Promotion