Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
టైల్ పై సిలిండర్ త్రుప్పుమరకలను పోగొట్టే సులభ చిట్కాలు
మీరు ఉండే ఇంట్లో టైల్స్ సెరామిక్ టైల్స్ అయితే, అప్పుడు మీ వంటగదిలో ఎదుర్కొనే సమస్య ఒకటి ఇది . వంటగదిలోని సెరామిక్ టైల్స్ మీద
గ్యాస్ సిలిండర్ త్రుప్పు మరకలు చాలా మెండిగా ఏర్పడుతాయి. ఈ మరకలను తొలగించడానికి చాలా కష్టపడుతుంటారు మహిళలు. అందువల్ల కొన్ని హోం రెమడీస్ తో ఈ మొండిగా తయారైన త్రుప్పు మరకాలను తొలగించడానికి ఉపయోగించి మీ వంటగదిలోని టైల్స్ ను మెరిసేలా ఉంచుకోండి.
ఫ్లోర్ టైల్స్ మీద ఏర్పడిన రస్ట్ (త్రుప్పు)మరకలను వదిలించుకోవడానికి వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ మార్కెట్లో లభించే రసాయనిక కెమికల్స్ తో తయారుచేసిన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల త్రుప్పు మరకలు వదలకు, మరిన్ని మరకలు ఏర్పడటానికి దారితీస్తుంది . కొంత మంది ఇటువంటి ఉత్పత్తులను ఉపయోగించి విసిగి వేసారిపోయి, కొన్ని సందర్భాలు షార్ప్ గా ఉండే చాకుతో గోకి లేదా మెటల్ స్ర్కబ్బర్ తో రుద్ది మరీ శుభ్రం చేస్తుంటారు. అయితే ఇది అంత మంచి ఉపాయం కాదు, ఇది టైల్స్ ను మరింత డ్యామేజ్ చేస్తాయి.
అందువల్ల బోల్డ్ స్కై మీకోసం కొన్ని సులభ చిట్కాలను ఈ క్రింది విధంగా అందిస్తోంది.

నిమ్మరసం:
ఇంట్లో ఎటువంటి మొండిమరకలైనా సరే నిమ్మరసం ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. వంటగదిలో సిలిండర్ పెట్టిన చోటో త్రుప్పు మరకలను తొలగించడానికి కొద్దిగా నిమ్మరసం చిలకరించి పది నిముషాలు అలాగే ఉంచి తర్వాత టూత్ బ్రష్ ఉపయోగించి 10 నిముషాల తర్వాత శుభ్రం చేస్తే చాలా స్మూత్ గా త్రుప్పు మరకలు మాయం అవుతాయి.

టమోటో:
టమోటోలో ఉండి సిట్రిక్ యాసిడ్, సిలిండర్ రస్ట్(త్రుప్పు)మరకలు వదిలించడంలో చాలా బాగా సహాయపడుతుంది. త్రుప్పు మరకలున్న ప్రదేశంలో కొద్దిగా టమోటో ముక్కతో బాగా రుద్దాలి. అలాగే కొద్దిగా ఉప్పజోడించి రుద్ద కొద్ది సేపు అలాగే ఉంచి తర్వాత టూత్ బ్రష్ తో రుద్ద కడిగేస్తే మరకలు చక్కగా వదిలిపోతుంది.

బ్లీచ్:
క్లీనింగ్ పదార్థాల్లో బ్లీచ్ ఒక వండర్ ఫుల్ క్లీనింగ్ ఏజెంట్ . సిలిండర్ త్రుప్పు మరకలను వదిలించడానికి కొద్దిగా బ్లీచ్ ను చలికరించి15నిముషాల తర్వాత నీరు చిలకరించి బ్రష్ తో బాగా రుద్ది కడగడం వల్ల క్లీన్ గా మరియు మెరిసేటి వంటగది టైల్స్ ను మీరు గమనించవచ్చు.

టూత్ పేస్ట్:
అవును, టూత్ పేస్ట్ కూడా మరకలు వదిలించడానికి అద్భుతంగా సహాపడుతుంది. సిలిండర్ మరకలు పడ్డ ప్రదేశంలో కొద్దిగా టూత్ పేస్ట్ ను రాసి కొద్దిసేపు అలాగే ఉంచాలి. తర్వాత బ్రష్ తో రుద్ది కొద్దిగా నీళ్ళు వేసి బ్రష్ తో రుద్ది, తర్వాత సోప్ తో కడిగేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వెనిగర్:
మరో బెస్ట్ హోం రెమెడీ వెనిగర్. సిలిండర్ త్రుప్పు మరకలను తొలగించడానికి టైల్స్ మీద కొద్దిగా వెనిగర్ చిలకరించి తర్వాత బ్రష్ తో రుద్ది కగడం వల్ల టైల్స్ మీద త్రుప్పు మరకలు వదలడంతో పాటు టైల్స్ క్లీన్ చేస్తుంది.

కిరోసిన్:
ప్లోర్ టైల్ మీద ఏర్పడిన రస్ట్ స్టైన్స్ వదలించడానికి కెరోసిన్ ఒక బెస్ట్ హోం రెమెడీ.ఇది వెనిగర్ చాలా ఎఫెక్టివ్ గా పరిచేస్తుంది. సిలిండర్ త్రుప్పు పడ్డ మరకల మీద కొద్దిగా కిరోసిన్ చిలకరించి 10 నిముషాల తర్వాత శుబ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
