Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
షెల్ఫ్ లేదా సూట్ కేసులో దుస్తులు కనబడకుండా స్టోర్ చేయడం ఎలా
హాస్టల్ లో వుంటే తాజా గాలి పీల్చుకోవచ్చు. కనీ ఇంట్లో లాంటి సౌకర్యాలు అక్కడ దొరకవు. ఉదాహరణకి, మీ హాస్టల్ లోనో తాత్కాలిక వసతిలోనో మీరు ఎదుర్కొనే మొదటి సమస్య అలమార లేనప్పుడు బట్టలు జాగ్రత్త పెట్టుకోవడం.
మీరు బట్టలు దాచుకోవడానికి రెండు దార్లు ఉన్నాయి – న్యూస్ పేపర్ వేసిన షెల్ఫ్ లేదా ఒక సూట్ కేస్. ఈ రెండిటిలో మీ బట్టలు అంత తాజాగా వుండవు. పైగా, వాటిని ఇస్త్రీ చేసి దాచడం కూడా కష్టమే అనిపిస్తుంది.
బట్టలు దాచడానికి అలమార లేనప్పుడు, సూట్ కేస్ తీసుకోండి. షెల్ఫ్ లు వాడడం కన్నా సూట్ కేస్ లో బట్టలు దాచుకోవడంలో సమస్యలు తక్కువ. మీ ఇస్త్రీ బట్టలు కూడా అలానే చాలాసేపు ఉంటాయి.

అలమార లేనప్పుడు బట్టలు దాచుకోవడానికి కొన్ని చిట్కాలు ఇవిగో :
షెల్ఫ్ లో బట్టలు దాచడం :
షెల్ఫ్ లో వేసిన న్యూస్ పేపర్ ను అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి. పేపర్ మార్చకపోతే ఆ ఇంకు కార్తుంది, దాంతో మీ బట్టలకు మరకలు అవుతాయి.
చాలా అడ్వర్టైజ్ మెంట్లు వున్న పేపర్ వాడకండి. ఆ ప్రకటనలకు వుండే రంగులు కాలక్రమంలో మీ బట్టలకు అంటుకుంటాయి.
షెల్ఫ్ లో ముందుగా ముదురు రంగు బట్టలు వుంచండి, దాని పైన తేలికపాటి రంగులు వుండే బట్టలు పెట్టండి. అలమార లేకుండా బట్టలు దాచుకునేటప్పుడు వాడవలసిన చిట్కాలలో ఇది ఒకటి.
ప్రతి బట్టల దొంతరకు మధ్య కొంత ఖాళీ వదలండి. దీని వల్ల తేమ చేరకుండా వుంటుంది.
పురుగులు అలమారలలోనే పెరుగుతాయి. పేపర్ మీద బతికే పురుగులు, కీటకాల పట్ల జాగ్రత్త వహించండి. అవి త్వరలోనే మీ బట్టలను కూడా తినివేస్తాయి. అలమార లేనప్పుడు బట్టలు జాగ్రత్త పెట్టుకోవడంలో తీసుకోవలసిన జాగ్రత్త దాంట్లో కలరా ఉండలు వేసి ఉంచడమే.
పేపర్ బదులు మీరు ప్లాస్టిక్ షీట్లు కూడా వాడవచ్చు. అయితే వాటి రంగు బట్టలకు అంటకుండా ఉండాలంటే వాటిని తరచుగా మారుస్తూ వుండాలి.
బట్టలను సూట్ కేస్ లో దాచడం :
అలమార లేనప్పుడు బట్టలు దాచే మరో విధానం సూట్ కేస్ వాడడం. షెల్ఫ్ లో బట్టలు దాచడం తో పోలిస్తే అది మీ బట్టలను మురికి దూరంగా ఉంచుతుంది.
మీ బట్టలను మెత్తటి గుడ్డ క్రింద దాచి వుంచి అప్పుడు సూట్ కేస్ లో పెట్టండి. దీంతో మీ బట్టలు మృదువుగాను, తాజాగాను వుంటాయి.
రకరకాల దుస్తులు ఒకే సూట్ కేస్ లో పెట్టకండి. మీకు రెండో సూట్ కేస్ లేకపోతె, వేర్వేరు రకాల దుస్తులను వేర్వేరు ప్లాస్టిక్ బాగ్ లలో వుంచి అప్పుడు సూట్ కేస్ లో పెట్టండి.
సూట్ కేస్ లో బట్టలు దాచడంలో మరో విధానం ఏమిటంటే వాటిని ఒక దాని పై ఒకటి వదులుగా వుంచడం. అదిమి పెట్టి ఉంచితే గాలి బారక బట్టల మధ్యలో తేమ చేరుతుంది.
అలమార లేనప్పుడు బట్టలు దాచుకునే విధానాలు ఇవి. మీకు అలమార లేక పొతే, మీ బట్టలు దాచుకోవడానికి ఈ రెండు మార్గాలు ఎంచుకోండి.



Click it and Unblock the Notifications