Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
పది నిముషాల్లో మీ ఇంటిని చక్కబెట్టే సింపుల్ టిప్స్
సాధారణంగా మహిళలు ఇంటిని చక్కబెట్టడంలో సిద్దహస్తులనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ఇల్లు శుభ్రంగా, అందంగా అలంకరించడం ద్వారా చూడటానికి అందంతో పాటు, ఇంటిల్లిపాదికి ఆరోగ్యం కూడా. ఇల్లు చక్కబెట్టడానికి, ఇంట్లో ప్రతి వస్తువునూ నీట్ గా సర్దకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. అయితే గృహిని ఉద్యోగస్తురాలైతే, చాలా త్వరగా క్లీన్ చేయాలి మరియు ఎఫెక్టివ్ గా క్లీన్ చేయాలనుకుంటుంది. చిందరవందరగా ఉన్న ఇంటిని చక్కబరచుకోవడానికి వారి చాలా కష్టంగా సమయాన్ని కేటాయిస్తారు. అటువంటి వారికోసం కొన్ని సింపుల్ చిట్కాలో ఇక్కడ అందిస్తున్నాం.
ప్రతి రోజూ ఉదయం ఇంటిని శుభ్రం చేయడా చాలా ముఖ్యం. ఉదయం మీ ఇంటిని శుభ్రం చేయకపోతే, సాయంత్రం మీరు తిరిగి మీ ఇల్లు చేరుకొన్నప్పుడు చిందరవందరగా ఉంటే, మీరు పనితో అలిసి వచ్చినప్పుడు, ఇంటి పనిచేయడానికి కొంచెం కష్టం మరియు బద్దకంగా ఉంటుంది. అందువల్ల మీరు ఈ సింపుల్ చిట్కాలను ఉపయోగించి చిందరవందరగా ఉన్న మీ ఇల్లును, ఆఫీసుకు బయలుదేరే ముందుగానే ఇంటిని చక్కబరి వెళ్ళండి. ఇలా చేయడం వల్ల మీకు సాయంత్రం వేళ పని తక్కువుతుంది. మరియు ఇల్లు అందంగా ఉంటుంది.

వార్డ్ రోబ్ లోని దుస్తులను ఎలా పడితే అలా తీయకండి: ఉదయం మీరు అర్జెంట్ గా ఉన్నప్పుడు, వార్డ్ రోబ్ లోని దుస్తులను ఎలా పడితే అలా లాగేస్తుంటాము. ఇది వార్డ్ రోబ్ లోని మిగిలిన దుస్తులన్నీకూడా గందరగోలంగా, చిందరవందరగా కలిసిపోవడాన్ని చూడాల్సి వస్తుంది. దాంతో సరైన సమయానికి సరైన దుస్తులు, కాంబినేషన్ దుస్తులు దొరకక మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి, ఆఫీసుకు వెళ్ళడానికి ముందే ఇటువంటి చక్కబరుచుకోవాలి.
ల్యాండ్రీ బ్యాగ్ లో దుస్తులు వేయాలి: మీ రాత్రి ధరించిన దుస్తులు, ఫ్లోర్ మీద లేదా బెడ్ మీద వదిలేకుండా ల్యాండ్రీ బ్యాగ్ లో వేయాలి.
బాత్ రూమ్ ను డ్రై చేయాలి: స్నానం చేసిన తర్వాత మాప్ తో మీ బాత్రూమ్ ను తుడిచి డ్రై చేయాలి. ఇలా చేయడానికి కేవలం రెండు నిముషాలు పడుతుంది. కానీ అలా చేయడం వల్ల మీ బాత్రూమ్ క్లీన్ గా మరియు పొడిగా ఉంటుంది. మీరు బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మీ టేబుల్ ను వెట్ టిష్యూతో శుభ్రం చేయండి.
పేపర్స్ : మ్యాగజైన్ మరియు న్యూస్ పేపర్స్ వంటివి సెంటర్ పేపర్లు ఎలా పడితే అలా వేయడం వల్ల అది చిందరవందరగా కనబడుతుంది. కానీ. వాటిని తిరిగి క్రమంగా జోడించి పెట్టడం వల్ల చూడటానికి నీట్ గా ఉంటుంది.
బెడ్: మీ ఇల్లు అందంగా కనబడాలంటే, నిద్రలేచిన వెంటనే బ్లాంకెట్స్ ను నీట్ గా మడిచి ఒక పక్కకు పెట్టుకోవాలి. అలాగే దిండులను నీట్ గా అమర్చాలి. బెడ్ షీట్స్ ను నీట్ గా పరవాలి. అలా చేయడం వల్ల మీ పడక గది నీట్ గా మరియు క్లీన్ గా కనబడుతుంది.



Click it and Unblock the Notifications
