For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే సులభ చిట్కాలు..

|

నిన్నకాక మొన్నే తీసుకొచ్చా..అప్పుడే బియ్యం పురుగులు పట్టాయి అంటూ ఛీ..ఛీ ' అని విసుక్కునేవారు చాలా మందే ఉన్నారు. పురుగు పట్టిన బియ్యం వాడాలంటే అస్సలు మన్సస్సు ఒప్పుకోదు. అంతే కాదు వాటిని శుభ్రం చేయడం కూడా తల ప్రాణం తొక్కస్తుంది .

బ్రౌన్ రైస్ కంటే వైట్ రైస్ లో ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువ!

విలేజుల్లో ఉన్నవారైతే చేటతో చెరిగి లేదా ఎండలో పెట్టి బియ్యాన్ని శుభ్రం చేసుకుంటారు. మరి వ్రుత్తి ఉద్యోగాలతో విధుల్లో బిజీగా ఉండే పట్టణవాసులకు అంత తీరిక ఉండదు. కాబట్టి బియ్యం పురుగు పట్టకుండా ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం...

బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గడం కాయం...!

వేపాకులతో:

వేపాకులతో:

బియ్యం నిల్వ చేయడానికి ఎక్కువ మంది వేపాకులనే వాడుతుంటారు. ఎందుకంటే వేపాకులో ఉండే క్రిమి సంహారక లక్షణం వల్ల బియ్యంలో పురుగులు పడకుండా ఉంటాయి. అందుకోసం ముందుగా కొన్ని వేపాకులను తీసుకొని బాగా ఎండబెట్టుకొని మొత్తని పొడిగా చేసుకోవాలి. దీన్ని లైనింగ్ క్లాత్ వంటి కాటన్ వస్త్రంలో చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం మధ్యలో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల బియ్యంలో తెల్లపురుగులతో పాటు, ముక్క పురుగులు కూడా చేరకుండా ఉంటాయి.

ఇంగువ:

ఇంగువ:

వంటకాల్లో విరివిగా ఉపయోగించే ఇంగువ కూడా బియ్యంలో పురుగులు చేరకుండా కాపాడుతుంది. దీనికి కారణం ఇంగువ వెదజల్లే ఘాటైన వాసనే. దీన్ని కొద్దిగా తీసుకొని బియ్యంలో కలిపితే సరిపోతుంది. దీని నుంచి వెలువడే ఘాటైన వాసన వల్ల బియ్యంలో పురుగులతో పాటు, తేమ వల్ల పెరిగే బ్యాక్టీరియాను సైతం సంహరిస్తుంది. ఇవే కాదు..బిర్యానీ ఆకులను ఉపయోగించినా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.

కర్పూరంతో:

కర్పూరంతో:

కర్పూరం వాడితే పరుగులు పడవా అన్న సందేహం కలగవచ్చు? కర్పూరం వెదజల్లే ఘాటైన సువాసన వల్ల బియ్యంలో పురుగులు పడవు. ఈ ఫలితాన్ని పొందడానికి పది కర్పూరం బిళ్లలను తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని కాస్త మందంగా ఉండే కాటన్ వస్త్రంలో చుట్టి, బియ్యం డబ్బాలో పెడితే సరిపోతుంది.

బోరిక్ పౌడర్ తో:

బోరిక్ పౌడర్ తో:

బియ్యంలో పురుగులు పడటానికి తేమ కూడా ఒక కారణమే. సాధారణంగా రెండు, మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి తెచ్చి ఇళ్లల్లో నిల్వచేసుకుంటుంటాము. ఈ క్రమంలో కొన్ని సార్లు బియ్యంలో తేమ చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా పురుగులు పట్టవచ్చు. అందుకే బియ్యంలో తడిచేరకుండా చూసుకోవాలి. దీనికోసం బియ్యంలో కొద్దిగా బోరిక్ పౌడర్ ని మిక్స్ చేయాలి. ఇది బియ్యంలోని తేమను పీల్చుకుని, పురుగులు పడకుండా ఉంటుంది.

వెల్లుల్లి రెబ్బలు :

వెల్లుల్లి రెబ్బలు :

బియ్యంలో పురుగులు పడకుండా ఉండాలంటే కొన్ని వెల్లుల్లి రెబ్బలను పొట్టు తియ్యకుండా బియ్యండబ్బాలో వేయాలి. లేదా వెల్లుల్లి రెబ్బలను పల్చటి కాటన్ వస్త్రంలో మూటకట్టి బియ్యం డబ్బాలో ఉంచాలి.

లవంగాలు లేదా పొడి :

లవంగాలు లేదా పొడి :

మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. బియ్యం పురుగుపట్టకుండా ఉండాలంటే లవంగాలను లేదా లవంగాల పొడిని పల్చటి కాటన్ వస్త్రంలో మూట కట్టి, బియ్యం మద్యలో వేయాలి.

కాకరకాయ:

కాకరకాయ:

నిలువ చేసిన బియ్యంలో పురుగులు చేరకుండా ఉండాలంటే ఎండిన కాకరకాయ ముక్కలను పలచని వస్త్రంలో కట్టి ఆ డబ్బాలో వేస్తే సరి.

 క్యాస్ట్రోఆయిల్ (ఆముదం):

క్యాస్ట్రోఆయిల్ (ఆముదం):

బియ్యాన్ని శుభ్రంచేసి కొద్దిగా ఆముదం పట్టించి ఉంచితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పురుగు పట్టవు.

ఉప్పు:

ఉప్పు:

బియ్యంలో రాళ్ల ఉప్పు కలిపి పెడితే పురుగు పట్టదు.

డెసికాంట్ ప్యాకెట్లతో:

డెసికాంట్ ప్యాకెట్లతో:

ఇన్సులేటెడ్ వస్తువులు..సూట్ కేస్ లు, కొన్ని రకాల మెడిసిన్ ప్యాకెట్లతో సిలికా జెల్ తో నిండిన చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి . వీటినే డెసికాంట్ ప్యాకెట్లు అంటారు. ఇవి తేమను బాగా పీల్చుకుంటాయి. వీటిని బియ్యం నిల్వచేసిన డబ్బాలో పెడితే తేమను పీల్చేసుకుంటాయి. ఫలితంగా బియ్యం పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు.

English summary

10 Ways To Protect Rice From Insect Attack

10 Ways To Protect Rice From Insect AttackRice is one of the most preferred foodstuffs in every household. Thus, it becomes a responsibility to protect this desired foodstuff from harmful invaders.
Desktop Bottom Promotion