For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటగదిలోని ఈ వస్తువులు రోజూ శుభ్రపరచడం చాలా అవసరం..

|

ఇంటి చుట్టుపక్కల పరిసరాలు మరియు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మన ఆరోగ్యానికి చాలా అవసరం.వాటి ఊపిరితలాలు ఎంత కలుషితంగా ఉంటాయో మనకు తెలీదు.

మనలో చాలా మంది ఇల్లు శుభ్రంగా ఉంచుకొని క్రిములకి దూరంగా ఉండేలాగా జాగ్రత్త పడతారు, ఎందుకంటే శుభ్రత ఒక ఆహ్లాదకరమైన పర్యావరణం మరియు జీవనం లొ ముఖ్యమైన భాగం కాబట్టి.

కొన్ని శుభ్రపరిచే ఉత్ప్పత్తుల సహాయంతో,ఇంట్లో ఉండే దుమ్ము, బ్యాక్టీరియా మరియు మరింత కలుషితం కలిగించే క్రిములను తొలగించవచ్చు. కానీ చాలా సార్లు మనం ఎక్కడ దుమ్ము మత్రమే కాకుండా దాన్ని హానికరమైన ప్రదేశం గా మార్చే ప్రమదకరమైన క్రిములు దాక్కొని ఉంటాయో ఆ కొన్ని ప్రదేశాలని మర్చిపోతాం.

<strong>నూనె మరకలు తొలగించడానికి సులభ క్లీనింగ్ చిట్కాలు</strong>నూనె మరకలు తొలగించడానికి సులభ క్లీనింగ్ చిట్కాలు

ముందు అవి హానిచేయనివి గా ఉన్నప్పటికీ , రోజులు గడిచినకొద్దీ మెల్లగా కలుషితం అయి ఆరోగ్యానికి ప్రమాదకరమవుతాయి.

అందుకే అవి ఏంటో, ఎలా కనిపెట్టి శుభ్రపరచాలో తెలుసుకోవడం అత్యంత అవసరం.

ఈ కింద చూసి తెల్సుకోండి..

1) స్పాంజీలు మరియు లూఫాలు

1) స్పాంజీలు మరియు లూఫాలు

మీరు సరిగ్గా జాగ్రత్త తీసుకోపొతే,మీరు రోజూ గిన్నెలు తోమడానికి వాడే స్పాంజీలు, షవర్ లో వాడే లూఫాలు తొందరగా కలుషితం అవ్వడానికి అవకాశం ఉంది.అవి తేమ, మృత చర్మ కణాలు మరియు మిగిలిన ఆహారాన్ని అంటుకోని ఉండుట వలన వివిధ క్రిములకి నెలవై , మీ ఆరోగ్యాన్ని ప్రమదం లో పెడతాయి.

వాటిని ఎలా శుభ్రపరచాలి?

ముందుగా వాటిని నీళ్ళు మరియు తెల్ల వెనిగర్ ఉన్న గిన్నెలో ముంచాలి.

తరవాత, దాన్ని మైక్రోవేవ్ లో ఎక్కువ ఉష్నొగ్రతలో వేడి చేయాలి.

స్పాంజులను మైక్రోవేవ్ లో లోహ భాగాలతో పెట్టకూడదు అనుకోండి.

2) తూములు:

2) తూములు:

సబ్బు నీళ్ళు వెళ్తాయి అనే విషయం పక్కన పెట్టినా, తూములలో కలుషితాలు తీసేయడానికి ప్రత్యేకమైన క్రిమిసంహారాలను వాడి ప్రత్యేకంగా శుభ్రపరుచుకోవాలి.

ఒక్కసారి మీ తూముని సరిగ్గా చూస్తే , దాని పై ఉన్న చిన్న చిన్న అచ్చులు మరియు నిమ్మకాయ మరకలు సూక్ష్మజీవులు పెరుగుదలని మరింత ప్రేరేపిస్తాయి.

వాటిని ఎలా శుభ్రపరచాలి?

ముందుగా హైడ్రోజెన్ పెరాక్సైడ్ ని పిచికారీ సీసాలో వేసి దాన్ని తూము మీద పిచికారీ చేయాలి.

ఒక పది నిమిషాలు అలా ఉంచి స్పాంజి మరియు నీళ్ళతో కడిగేయాలి .

ఇలా రోజూ చేయాలి.

3) కట్టింగ్ బోర్డులు :

3) కట్టింగ్ బోర్డులు :

కట్టింగ్ బోర్డుల మీద ఇంట్లో ఉన్న వేరే అన్ని ప్రదేశాల కంటే ఎక్కువ మరకలు మరియు సూక్ష్మజీవులు ఉంటాయి.

ఎందుకంటే అది నీళ్ళని మరియు ఆహార పధార్థాలని పీల్చుకోవడం వలన సూక్ష్మజీవుల పెరుగుదల కి దారి తీస్తుంది.

వాటిని ఎలా శుభ్రపరచాలి?

ముందర కట్టింగ్ బోర్డ్ యొక్క ఊపిరితలాన్ని తగినంత నిమ్మకాయ రసం తో రుద్దాలి.

తరువాత, ఒక 5 నిమిషాలు వదిలేయాలి.

తరువాత, కొంచెం ఉప్పుతో రుద్దాలి.

రెండు పధార్థాల లో ఉండే బ్యాక్టీరియా వ్యతిరేక గుణాలు క్రిములని చంపడానికి సహాయపడతాయి.

4)మేకప్ బ్రష్లు మరియు స్పాంజెస్

4)మేకప్ బ్రష్లు మరియు స్పాంజెస్

చూడటానికి కష్టంగా ఉన్నా, మేకప్ బ్రష్లు మరియు స్పాంజిలకి చాలా క్రిములు అంటుకోని ఉంటాయి.

చర్మానికి వాడే క్రీం యొక్క కలుషితాలు, మేకప్ యొక్క చిన్న చిన్న ముక్కలు మరియు దుమ్ము కలిసి సూక్ష్మజీవుల పెరుగుదలకి మంచి వాతావరణాన్ని తయారుచేస్తాయి.

వాటిని ఎలా శుభ్రపరచాలి?

ముందుగా, ఒక కప్పు వేడి నీళ్ళల్లో కొంచెం ద్రవ రూపం లో ఉన్న సబ్బు ని వేయాలి.

తరువాత, బ్రష్లుని మరియు స్పాంజిలని అందులో 30 నిమిషాల దాకా ఉంచాలి.

ఆ తరువాత, వాడే ముందు కడిగి ఎండపెట్టుకోవాలి.

5) బాత్రూం టైల్స్

5) బాత్రూం టైల్స్

మాయని మచ్చలు మరియు అచ్చుల నుంచి వచ్చే చెడు వాసన నుంచి రోజూ బాత్రుం టైల్స్ ని శుభ్రపరుచుకోవడం మంచి పద్దతి.

సరిగ్గా చెప్పాలంటే, ప్రతీ రోజూ స్నానం చేశాక సబ్బు నీళ్ళు టైల్స్ లో ఇంకి ఎండిపోయెలోపు శుభ్రం చేసుకోవాలి.

వాటిని ఎలా శుభ్రపరచాలి?

నీళ్ళు మరియు తెల్ల వెనిగర్ సమ పాళ్ళ లో ఒక పిచికారీ సీసాలో వేసి టైల్స్ పైన పిచికారీ చేయాలి.

తరువాత, ఒక పది నిమిషాలు ఉంచి ఒక గుడ్డ తో తుడిచేయాలి.

<strong>శీతాకాలంలో మీ ఇంటిని శుభ్రపరిచే చిట్కాలు</strong>శీతాకాలంలో మీ ఇంటిని శుభ్రపరిచే చిట్కాలు

6)వంటగది తువ్వాలు

6)వంటగది తువ్వాలు

ఇవి జారిబడే తిండి వస్తువులు మరియు క్రిములని సులభంగా అంటుకుంటాయి.మీరు ఊహించిన విధంగానే వంటగది తువ్వాలు ఇంట్లో ఉన్న అన్ని వస్తువ్వుల్లో రోజూ శుభ్రపరచాల్సిన అతి మురికైన వస్తువు.

ఈ పని చేయకపోతే, భరించలేని వాసనే కాదు రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉంది.

వాటిని ఎలా శుభ్రపరచాలి?

ముందుగా, ఒక లీటర్ వేడి నీళ్ళలో ఒక కప్పు నిమ్మరసం కలపాలి.

తరువాత, ఈ తువ్వాలుని 30 నిమిషాలు నానబెట్టాలి.

ఆ తరువాత, బాగా కడిగి ఎండలో ఎండబెట్టాలి.

7) తాళంచేతులు

7) తాళంచేతులు

అదనంగా,జనాలు శుభ్రపరచడం మర్చిపోయేది ముఖ్యంగా తాళంచేతులు ఎందుకంటే వాటిమీద హానికారక క్రిములు ఉండవని భావిస్తారు కాబట్టి.

తాళంచేతులు చాలా చోట్ల పెడతాము, చాలా మంది చేతులు పడతాయి మరియు ఏ కారణం అయితే ఏం చాలా సార్లు కింద పడతాయి.

వాటిని ఎలా శుభ్రపరచాలి?

వాటిని కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ తో రుద్దాలి

లేకపోతే , వాటిని నీళ్ళు మరియు క్రిములని చంపే సబ్బు తో కడగాలి.

ఇప్పుడు మీకు ఈ క్రిములు ఉండే అంశాలు తెలిసాయి కాబట్టి, రోజూ శుభ్రపరచడానికి ప్రయత్నించండి మరియు మీ కుటుంబాన్ని, ఇంటిని, ఆరోగ్యంగా ఉంచుకోండి.

English summary

7 Household Items You Should Disinfect Every Day

Household Items You Should Disinfect Every Day. Keeping everyday things around your home clean and disinfected is important for keeping yourself healthy. You never know how contaminated those surfaces can be! Most of us are concerned about keeping our home clean and disinfected. After all, cleanliness is an important part of a comfortable, healthy environment.
Desktop Bottom Promotion