For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇల్లు శుభ్రపరచాల్సిన విధి విధానాలు.

|

మన పూర్వీకులు జ్యోతిషశాస్త్రంలో మంచితనాన్ని విశ్వసించేవారు. మానవజాతి ప్రగతి సాధిస్తున్న క్రమంలో, మన జీవనాన్ని మరింత వైజ్ఞానిక దృక్పథంలో సాగించేందుకుదుకు ప్రయత్నాలు సాగించాము. క్రమంగా, మేము జ్యోతిషశాస్త్ర శాస్త్రాన్ని విస్మరిస్తూ, మన మనస్సు చెప్పిందే చేయడం మొదలుపెట్టాము. జ్యోతిషశాస్త్రం కూడా శాస్త్రీయ సూత్రాలపై ఆధారపడి ఉందనే విషయాన్ని మరచాము. జ్యోతిషశాస్త్రంలో వివరింపబడిన చాలా విషయాలు కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచాయి మరియు నిజమైనవిగా నిరూపింపబడ్డాయి. అటువంటి పరిజ్ఞానాన్ని తిరస్కరించినట్లయితే, అది మనలోని అవివేకాన్ని ఎట్టి చూపించుకోవడమే తప్ప మరేమీ కాదు.

నేటి తరానికి చెందిన చాలామందికి, గృహ పారిశుభ్ర విషయంలో, జ్యోతిషశాస్త్ర పాత్ర గురించి అవగాహన లేదు. వారు ఇంటిని శుభ్రపరచడం అంటే, కేవలం ఇంటి అంతర్గత పరిసరాల నుండి మలినాలను తొలగించి, విసిరేసే సాధారణ ప్రక్రియగా భావిస్తున్నారు. ఏదేమైనా, ఈ పనిలో కూడా దానికి మించిన విషయం ఉందని మరియు దీనికి సంపదల దేవత అయినా లక్ష్మీ దేవికి సంబంధం ఉందని వారు ఎరగరు.

ఇల్లు శుభ్రపరిచే విషయానికి సంబంధించి అన్ని జ్యోతిషశాస్త్ర నియమాలు మరియు నిబంధనలు, సంపదతో అనుబంధం కలిగి ఉన్నాయి. ఈ వ్యాసం ద్వారా, జ్యోతిషశాస్త్ర పరంగా ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు ఆ నియమాలకు కట్టుబడి ఉండటానికి ఏమి చేయాలో కూడా తెలుసుకుందాం.

• సంపద స్థాయి- లక్ష్మీ కటాక్షం:

భారతీయ సంస్కృతిలో, లక్ష్మీదేవిని సంపదలకు అధిదేవతగా కొలుస్తారన్న వాస్తవం, మనకు తెలియనిది కాదు. సంపద అనేది మన ఇంటిలోని శ్రేయస్సుకు మొట్టమొదటి సంకేతం. చాలామంది ప్రజలు తమ ఇంటిలోని ధనం యొక్క పెరుగుదల మరియు తరుగుదలను లక్ష్మి దేవి రాక మరియు పోకగా సంబోధిస్తారు.

కనుక, జ్యోతిషశాస్త్ర అనుసారం, గృహసంబంధంగా లక్ష్మి దేవిని ఆకర్షించడానికి ఏమి చేయాలని చెప్తే, అదే విధంగా చేసేలా శ్రద్ధ తీసుకోవాలి. మన ఇల్లు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంటేనే, లక్ష్మి మన ఇంట్లో కొలువు ఉంటుంది కనుక ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

• ఇల్లు ఊడ్చే సమయం:

నిజానికి, ప్రతి ఇంట్లో శుభ్రపరచడం అనే ప్రక్రియ అత్యంత ముఖ్యమైనది. అనేక అనారోగ్యాలను కలిగించే చెత్త, ధూళి, క్రిములు మరియు మలినాలను ఇంటి నుండి బయటకు తీసిపారేయాలి. వేగవంతమైన మార్గం. అయితే, మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు చీపురు పట్టుకోని ఇంటిని ఊడవరాదు.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, ఈ పనిని సూర్యోదయం తర్వాత మాత్రమే జరపాలి. అదేవిధంగా, సూర్యుడు అస్తమించాక కూడా ఇల్లు తుడవరాదు. దీనికి సంబంధించిన శాస్త్రీయ వివరణ ఏమిటంటే, ఒక వ్యక్తి ఇంటిని తుడిచేటప్పుడు, ఎటువంటి ధూళి ఇంట్లో మిగిలిపోకుండా చాలా జాగ్రత్త వహించాలి.

అదేవిధంగా, ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అనుకోకుండా ఏ అవసరమైన వస్తువు కూడా బయటకు ఊడ్చబడకూడదు. పైన తెలిపిన విషయాలు ఏమీ జరగకుండా ఉండాలంటే, సరైన వెలుతురు అందుబాటులో ఉండాలి. అదే పనిని కృత్రిమ వెలుగులో సమర్ధవంతంగా నిర్వహించలేరు కనుక, చీకటి పడ్డాక ఇల్లు తుడవరాదు.

• మీరు తొందరగా శుభ్రం చేయాల్సిన పరిస్థితి కలిగితే:

కొన్ని పరిస్థితులలో, పొద్దు పోయాక నేలపై ఆకస్మికంగా ఏదైనా ఒలిగిపోతే, తక్షణమే శుభ్రపరచవలసిన అవసరం రావచ్చు. పిల్లలు మరియు పసిబిడ్డలు ఉన్న ఇళ్లలో ఇది సర్వసాధారణం. అలాంటి సందర్భాలలో, మీరు నిజంగా తుడవవలసి వస్తే, గుడ్డను ఉపయోగించి శుభ్రం చేయాలి.

ఇటువంటి సమయంలో ఊడ్చిన చెత్తను, ఇంటి బయట పారేయకూడదు. అలా చేయడం వల్ల లక్ష్మీ దేవత యొక్క కోపానికి కారకులవుతారు. మీ కుటుంబంలోని సర్వ సంపదలు తొలగిపోతాయని చెబుతారు. మీరు ఆచరించాల్సిందేమిటంటే, ఇంట్లో ఎదో ఒక మూలన ఆ చెత్తను నిల్వ చేసి, మరుసటి రోజు ఉదయం దానిని పారవేయాలి.

అలాగే, ఇక్కడ మీరు అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చేయాలి. అంతేకానీ, ప్రతి రోజు సాయంత్రం గుడ్డతో ఈ విధంగా చేయరాదు. ఇలా చేయడం వలన మీ ఇంటి పరిశుభ్రత మెరుగుపడదు. మొత్తం చెత్తంతా ఇంటినుండి బయటకు పోదు.

ఇప్పుడు మీరు మీ ఇంటిని శుభ్రపరచడానికి తప్పనిసరిగా అనుసరించాల్సిన వివిధ పరిశుభ్రత చర్యలు మరియు సమయాలను గురించి పూర్తిగా తెలుసుకున్నారు కనుక, మీ కుటుంబ సభ్యుల గురించి మెరుగైన శ్రద్ధ తీసుకోగలరని మేము ఆశిస్తున్నాము.

నిజానికి, మన దైనందిన జీవితాలలో జ్యోతిషశాస్త్ర బోధలను భాగంగా మార్చుకోవడం ద్వారా, మన ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సుతో కూడిన నూతన శకానికి స్వాగతం పాలకడమే కాక, మన తరువాతి తరాలకు కూడా నైతికతను పరిచయం చేసిన వాళ్ళమవుతాము.


English summary

Astro Tips For House Cleaning

All the astrological rules and regulations that are there with respect to the cleaning of the house have the concept of welcoming Goddess Lakshmi to our house and keeping her there at its core. There are certain astrological concepts of good housekeeping and what you need to do in order to ensure that you adhere to the same.
Story first published: Wednesday, August 29, 2018, 7:00 [IST]