Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మహాభారతంలో హనుమంతుడి పాత్ర
మీరు శీర్షిక పేరు చదివిన తరువాత షాక్ అయ్యారా? కావొద్దు.దైవం అయిన హనుమంతుడు మహాభారతంలో కూడా ప్రత్యక్షమవుతాడు.
రామాయణంలో హనుమంతుడిది చాలా ముఖ్యమైన పాత్ర అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ మనలో కొద్దిమందికి మాత్రమే తెలుసు హనుమంతుడు రెండుసార్లు, మహాభారతంలో కూడా కనిపిస్తాడని. లార్డ్ హనుమాన్ చిరంజీవులలో 'ఒకరిగా అందరికి తెలిసిన విషయమే. చిరంజీవులు అంటే మరణం లేనివారు,అమరులు.. హనుమాన్, చిరంజీవులలో ఒకరిగా మరణం లేకుండా జీవించే వరం పొందిఉన్నాడు.
కాబట్టి, మనకు లార్డ్ హనుమాన్ మహాభారతంలో కూడా కనిపిస్తాడు. హనుమంతుడిని భీముడికి సోదరుడిగా చెపుతారు. ఇద్దరూ వాయుదేవుని కుమారులే..మహాభారతంలో హనుమంతుడు మొదటిసారి పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు భీముడిని కలుస్తాడు మరియు రెండవసారి లార్డ్ హనుమాన్ కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడి రథాన్ని రక్షిస్తూ, రథం మీద ఉన్న జెండాలో ఉంటాడు.

మహాభారతంలో హనుమంతుడి పాత్ర గురించి మొత్తం కథ తెలుసుకోవాలనుందా? అయితే చదవండి.
మొదటిసారి హనుమంతుడు పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు భీముడిని కలుస్తాడు. వనవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది భీముడిని సౌగంధిక పువ్వులు కావాలని కోరుతుంది. భీముడు పువ్వుల కోసం బయలుదేరాడు. అతను వెళుతున్న మార్గంలో ఒక పెద్ద కోతి విశ్రాంతి తీసుకుంటూ అడ్డంగా పడుకుని ఉన్నది. భీముడు ముందుకు వెళ్ళటానికి కోతిని అడ్డు తొలగమని మరియు మార్గం సుగమం చేయమని కోరాడు. కానీ ఆ కోతి, తానూ చాలా ముసలివాడినని, తోకను కూడా తొలగించలేని శక్తిహీనుడినని, అందువలన భీముడినే అడ్డు తొలగించుకొని వెళ్ళమని ప్రాధేయపడింది. అందువలన భీముడు ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా కోతి తోకను పక్కకు పెట్టి వెళ్ళాలి.
భీముడు కోతిపట్ల చులకనగా చూశాడు మరియు తన గదతో తోకను పక్కకు పెట్టటానికి ప్రయత్నించాడు. కానీ తోకను ఒక అంగుళం కూడా కదిలించలేకపోయాడు. భీముడు చాలా ప్రయత్నించిన తరువాత, ఈ కోతి సాధారణమైనది కాదని తెలుసుకున్నాడు. అందువలన భీముడు శరణు కోరాడు మరియు క్షమాపణ అడిగాడు. అప్పుడు హనుమంతుడు, తన అసలు రూపంలోవచ్చి భీముడిని ఆశీర్వదించాడు.
అర్జునుడి రథం; మహాభారతంలో, మరొక సంఘటనలో హనుమాన్ రామేశ్వరం వొడ్డ ఒక సాధారణ కోతి రూపంలో అర్జునుడిని కలుసుకున్నాడు. లంకకు వెళ్ళటానికి రాముడు నిర్మించిన వంతెన చూసి అర్జునుదు ఈ వంతెనను నిర్మించడానికి కోతుల సహాయం తీసుకున్నాడు. ఎందుకు! అని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు అదే తను అయితే ఒక్కడే ఈ వంతెనను బాణాలతో నిర్మించి ఉండేవాడినని అనుకున్నాడు. హనుమాన్, కోతి రూపంలో ఆర్జునుడిని "నీవు బాణాలతో నిర్మించిన వంతెన అయితే సంత్రిప్తికరంగా ఉండేది కాదు మరియు అది ఒక వ్యక్తి యొక్క బరువును మోసిఉండేది కాదు" అని విమర్శించాడు. అర్జునుడు దీనిని ఒక సవాలుగా తీసుకున్నాడు. అర్జునుడు, తాను నిర్మించిన వంతెన సంత్రిప్తికరంగా లేడంటే, అప్పుడు తాను అగ్నిలో దూకుతానని అన్నాడు.
కాబట్టి, అర్జునుడు తన బాణాలతో ఒక వంతెన నిర్మించారు. హనుమాన్ దానిపై కాలు మోపగానే ఆ వంతెన కూలిపోయింది. అర్జునుడు నిశ్చేష్టుడ య్యాడు మరియు తన జీవితం అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు.మరియు ఆ వంతెనను తన దివ్య స్పర్శతో పునర్నిర్మించాడు. అప్పుడు దానిపై పాదం మోపమని హనుమంతుడిని కోరాడు. ఈసారి వంతెన కూలిపోలేదు. అందువలన, హనుమాన్ అతని అసలు రూపంలో ప్రత్యక్షమయి జరగబోయే యుద్ధంలో అర్జునుడికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. అందుకే కురుక్షేత్ర యుద్ధం సంభవించినప్పుడు హనుమంతుడు అర్జునుని రథజెండాపై యుద్ధప్రారంభం నుండి ముగిసేవరకు ఉన్నాడు.
కురుక్షేత్రయుద్ధం చివరి రోజున, కృష్ణుడు, ఆర్జునుడిని మొదటగా రథాన్ని దిగమని కోరాడు. అర్జునుడు క్రిందికి దిగిన తరువాత, శ్రీ కృష్ణుడు యుద్ధం అంతం వరకు హనుమంతుడు అక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించాడు మరియు రథం వదిలి వెళ్ళాడు. హనుమంతుడు వెళ్లిన వెంటనే రథం అగ్నికి ఆహుతి అయింది. ఇదంతా వీక్షించిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు "ఇప్పటివరకు హనుమంతుడు రక్షించటం వలన ఈ దివ్యమైన ఆయుధాలు ఏమి చేయలేకపోయాయి. లేనట్లయితే ఎప్పుడో రథం కాలిపోయి ఉండేది" అని అర్జునుడికి వివరించాడు.
అందువలన, లార్డ్ హనుమాన్, రామాయణంలో మాత్రమే కాదు కానీ మహాభారతంలో కూడా ఒక కీలకమైన పాత్ర వహించాడని మనకు తెలుస్తున్నది.



Click it and Unblock the Notifications