Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ వ్యక్తులు మాట్లాడేటప్పుడు అడ్డుకోవద్దు, ఎందుకో తెలుసా..?
చాణక్యుడు తన రచనల్లో కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు అడ్డుకోవద్దని, మధ్యలోకి వెళ్లొద్దని, సంభాషణకు భంగం కలిగించవద్దని సూచించారు.
చాణక్యుడు క్రీ.పూ 3వ శతాబ్దంలో భారతదేశంలో నివసించిన గొప్ప తత్వవేత్త, ఉపాధ్యాయుడు, ఆర్థికవేత్త, న్యాయవాది, రాజు సలహాదారు. చాణక్యుడు గొప్ప జ్ఞాని. ఆయన రాసిన అర్థశాస్త్రం, చాణక్య నీతి పుస్తకాలు ఇప్పటికీ, ఎప్పటికీ పాటించాల్సిన నియమాలను, సూత్రాలను వివరించారు. చాణక్యుడిని కౌటిల్యుడని, విష్ణుగుప్తుడని పిలుస్తారు. మొదటి మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుడు అధికారంలోకి రావడంలో చాణక్యుడిది కీలక పాత్ర. మౌర్య సామ్రాజ్య స్థాపనలో చాణక్యుడి వ్యూహాలు అపూర్వమైనవి.

చాణక్యుడి ఎన్నో అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికీ అనుసరణీయమే. ఆయన తన రచనల్లో కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు అడ్డుకోవద్దని, మధ్యలోకి వెళ్లొద్దని, సంభాషణకు భంగం కలిగించవద్దని సూచించారు.
చాణక్య నీతి ప్రకారం ఎవరు చెబితే అడ్డుకోవద్దో, ఎవరు మాట్లాడితే వింటూ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలివైన వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు అడ్డుకోవద్దు:
ఇద్దరు తెలివైన వ్యక్తులు మాట్లాడుకునే సమయంలో వారి చర్చను, సంభాషణను శ్రద్ధగా వినాలి. వారి మాటల నుండి జ్ఞానాన్ని పొందాలి. వారు మాట్లాడేటప్పుడు విని కొత్త విషయాలు నేర్చుకోవాలి. అంతేకానీ వారి సంభాషణను అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. వారు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, కొత్త విషయాల గురించి ఎలా వివరిస్తున్నారు, చర్చలో గెలవడానికి ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారో గమనించాలని చాణక్యుడు వివరించాడు.

దంపతులు మాట్లాడుకుంటుంటే అడ్డుకోవద్దు:
భార్యభర్తలు మాట్లాడుకుంటుంటే ఎవరూ భంగం కలిగించవద్దని చాణక్యుడు సూచించారు. దంపతుల మధ్య చర్చ జరుగుతుంటే ఎప్పుడూ మధ్యలోకి వెళ్లకూడదని చెప్పారు. సామరస్యపూర్వకమైన చర్చ అయినా, మామూలు మాటలైనా, వాదోపవాదాలైనా భార్యభర్తల మధ్యలోకి వెళ్లొద్దు. ఎటువంటి సమయంలోనూ దంపతులను డిస్టర్బ్ చేయవద్దు.
దంపతుల మధ్య వాదన జరుగుతున్నప్పుడు మధ్యలోకి వెళ్తే పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. వారి మధ్య అపార్థాలు కూడా పెరుగుతాయి. అందువల్ల దంపతులు మాట్లాడుకునేటప్పుడు వారి మధ్యలోకి వెళ్లొద్దు.

యజమాని పనివాడితో మాట్లాడుతున్నప్పుడు అడ్డుకోవద్దు:
యజమాని తన పనివాడితో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ అడ్డుకోవద్దని చాణక్యుడి సూచన. పనివాడితో కోపంగా మాట్లాడుతున్నప్పుడు మధ్యలోకి వెళ్తే యజమాని కోపానికి మనం గురయ్యే ప్రమాదం ఉంటుంది. యజమాని పనివాడికి మధ్య ఉన్న సంబంధానికి కూడా ఆటంకం కలిగించినట్లు అవుతుంది. అందుకే యజమాని పనివాళ్లతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలోకి వెళ్లొద్దని చాణక్య నీతిలో చెప్పబడింది.

ధ్యానం చేస్తున్నప్పుడు..
ఎవరైనా ధ్యానం చేస్తున్నప్పుడు వారి డిస్టర్బ్ చేయొద్దు. ఒకరు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు వారికి వీలైనంత ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అది కుదరకపోతే కనీసం వారిని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి.



Click it and Unblock the Notifications