Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
గణేష్ చతుర్థి స్పెషల్: గణపతి స్థాపన విధి
గణేష్ చతుర్థి మొత్తం వేడుకలలో అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ పండుగను భారతదేశంలో చాలా ప్రదేశాల్లో; మహారాష్ట్ర, కర్నాటక వంటి ప్రాంతాలలోచాలా గొప్పగా జరుపుకుంటారు. ఈ గణేష్ చతుర్థిని, ప్రధాన పండగలలో ఒకటిగా చాలా ఆచార పద్ధతిలో మరియు గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు.
సాధారణంగా చాలామంది చవితి రోజున మాత్రమే గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువొస్తారు. కానీ నిజానికి భాద్రపద మాసంలో మొదటి రోజు లేదా ప్రథమరోజున పండుగ ప్రారంభమవుతుంది. గణపతి విగ్రహం, ఈ రోజున ఉత్సాహంతో ఇంటికి తీసుకుని రావాలి మరియు తదుపరి విగ్రహాన్ని అనువైన స్థలం వద్ద 9 రోజులు ఉంచి పూజించాలి. ఇంట్లో సరైన స్థలం వద్ద విగ్రహాన్ని ఉంచటాన్ని స్థాపనచేయటం అంటారు మరియు స్థాపన ప్రక్రియ సమయంలో పాటించవలసిన కొన్ని ఆచారాలు లేదా విధులు ఉన్నాయి. ఈ విధంగా జరిపే గణపతి పూజ పదవ రోజున పూర్తి అవుతుంది. దీనినే అనంత చతుర్దశి అని పిలుస్తారు.
గణపతి స్థాపన కోసం చేసే ఆచారాలు, విధులు అనుసరించడానికి అంత కష్టమేమి కాదు. మీరు కేవలం మీరు ఇంటి వద్ద గణేష్ చతుర్థి పూజ మొదలు ముందు కొన్ని వొస్తువులతో సిద్ధంగా ఉండాలి. ఇంట్లో గణపతి స్థాపన విధి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇంట్లో గణేష్ చతుర్థి పూజ చేయడానికి పదహారు దశలున్నాయి. మీరు మొదటి రోజున లేదా చవితిరోజున కాని పూజ చేస్తున్నప్పుడు ఈ క్రింద ఇచ్చిన ఆచారాలు పాటించవలసి ఉంటుంది.

విగ్రహం లేదా మూర్తి స్థాపన
గణేషుడు శుక్లచవితి నాడు మధ్యాహ్నం ఒంటిగంటకు జన్మించాడని చెబుతారు. అందువలన మూర్తి లేదా విగ్రహస్థాపన మధ్యాహ్నం 12.30 గం. నుండి 1 గం.మధ్యన జరుపుతారు. మీరు రోజులో అనేకసార్లు చూడటానికి వీలుగా విగ్రహం ఉంచాలి. విగ్రహం ఉంచే స్థలాన్ని శుభ్రం చేయండి మరియు ఒక శుభ్రమైన వస్త్రం (ప్రధానంగా ఎరుపు వస్త్రం) తో ఆ స్థలం మీద ఉంచండి. వస్త్రం మీద బియ్యం పోసి, వాటిని వెడల్పుగా చేసి, ఆ బియ్యం మీద గణేశ విగ్రహం ఉంచండి.

దీప ప్రజ్వలన & సంకల్పం
దీపం (దీపం ప్రజ్వలన) మరియు ప్రతిజ్ఞ (సంకల్పం) చెప్పుకొని విగ్రహం ముందు దీపాలను వెలిగించండి. విగ్రహం ముందు దీపం వెలిగించటం మరియు సంకల్పం చెప్పుకోవటం వంటి విధులను పూర్తి చేసుకుని, తరువాత విశ్వాసం మరియు భక్తితో గణపతిదేవుడిని పూజించండి.

ఆవాహన
ఆవాహన అంటే ప్రార్ధనల ద్వారా దేవుడిని వేడుకొనటం మరియు ఆయనను ఇంటికి రమ్మని ఆహ్వానించడం. ఈ విధంగా మీరు క్రొత్త గణేశవిగ్రహం తెచ్చినప్పుడు మాత్రమే చేయాలి. మీరు విగ్రహాన్ని అప్పటికే ఇంట్లో స్థాపన చేసిఉంటే ఈ విధిని చేయనక్కరలేదు.

ప్రతిష్థాపన
ప్రతిష్థాపన అంటే విగ్రహాన్ని సరిఅయిన స్థలంలో ఉంచటం మరియు దేవుడిని విగ్రహంలో నివసించాలని ఆహ్వానించడం.. ఈ విధంగా కొత్తగా తెచ్చిన విగ్రహాలకు మాత్రమే జరుపుతారు. ఈ మంత్రాన్ని స్మరించండి, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా!

ఆసనం సమర్పణ
అంటే ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడికి ఆసనం సమర్పించటం.

అర్ఘ్య సమర్పణ
అర్ఘ్య సమర్పణ అంటే వినాయకుడికి సువాసనాభరితమైన మరియు శుభ్రమైన నీటిని సమర్పించటం.

ఆచమనం
అంటే పూజకు ముందు పూర్తి ప్రక్షాళన సంప్రదాయం. మీరు మంత్రాలు చదివే ముందు నోరు శుభ్రపరుచుకోవటానికి మీ నోటిలోకి కొద్దిగా నీటిని తీసుకోవాలి.

స్నానం
పంచామృతం, పాలు, నెయ్యి, పెరుగు, తేనె, బెల్లం, సువాసనభరితమైన నీరు మరియు చివరలో శుభ్రమైన నీరు కలిపి తీసుకుని అప్పుడు మీరు విగ్రహానికి స్నానం చేయించటం.

వస్త్రం సమర్పణ
అంటే వినాయకుడికి వస్త్రం సమర్పించటం.

యజ్ఞోపవీతం సమర్పణ
అంటే మిమ్మలిని మీరు చేసిన పాపాలతో సహా దేవుడికి సమర్పించుకోవటం.

గంధం సమర్పణ
అంటే గణేశుడికి సుగంధం సమర్పించటం.

అక్షతలు సమర్పించటం
అంటే మీరు శ్రేయస్సు కోసం దేవుడికి అక్షతలు (పసుపు కలిపిన బియ్యం) సమర్పించటం.

పుష్ప మాల సమర్పించటం
దేవుడికి పూలదండలు సమర్పించాలి. దేవుడికి ఇష్టమైన మందారపుష్పాలు, నత్తగుల్ల పుష్పం మొదలైనవాటితో పూజించాలి.

ధూపం సమర్పించటం
గణేషుడికి ధూపం వెలిగించాలి.

నైవేద్య నివేదనం
ఈ దశలో మీరు వినాయకుడికి ఇష్టమైన వంటకాలను నివేదించాలి.

తాంబూలం సమర్పయామి
ఈ దశలో దేవుడికి తమలపాకులలో కొబ్బరికాయ, చిల్లరడబ్బులు ఉంచి సమర్పించాలి.

నీరాజనం / హారతి
చివరిగా, దేవుడికి హారతి ఇవ్వటంతో పూజ పూర్తి అవుతుంది.



Click it and Unblock the Notifications