Just In
- 5 hrs ago
Today Rasi Palalu 01February 2023: ఈ రోజు ఫిబ్రవరి 1, ఏకాదశి, బుధవారం ద్వాదశ రాశులకు ఎలా ఉందో ఇక్కడ చూడండి
- 11 hrs ago
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- 13 hrs ago
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- 14 hrs ago
హస్త ప్రయోగం కోసం పండ్లు, కూరగాయలు వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే
Indian Festivals Calendar 2023: ఈ ఏడాది ముఖ్య పండుగలు, వ్రతాలు, సెలవుల తేదీలివే...
Indian Festival calender 2023: మరికొన్ని రోజుల్లో 2023 ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఆత్రుతగా ఉన్నాం. వీటి సంగతి పక్కనబెడితే.. భారతదేశం విభిన్న మతాలు కలిగిన దేశం.
ఈ దేశంలోని హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైన్లు, సిక్కులు ఇతర వ్యక్తులు అనేక పండుగలు, వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇదే సమయంలో చాలా మంది తమకు ఎప్పుడు సెలవులొస్తాయా? తాము ఎప్పుడెప్పుడు ఫ్యామిలీతో కలిసి ఆనందంగా గడుపుదామా అని ప్లాన్ చేస్తుంటారు. ఈ సందర్భంగా 2023 సంవత్సరంలో ఏయే నెలలో ఏయే పండుగలొచ్చాయి.. ఏయే రోజుల్లో వ్రతాలు జరుపుకుంటారు.. ఎప్పుడెప్పుడు సెలవులొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జనవరి
* 2వ తేదీ ముక్కోటి ఏకాదశి జరుపుకుంటారు.
* జనవరి 10వ తేదీ సంకష్టహర చతుర్థి
* జనవరి 14వ తేదీ భోగీ
* జనవరి 15వ తేదీ సంక్రాంతి
* జనవరి 16వ తేదీ కనుమ
* జనవరి 26న వసంత పంచమి

ఫిబ్రవరి
* ఫిబ్రవరి 2వ తేదీన మంగళవారం నాడు ప్రదోష వ్రతం జరుపుకుంటారు.
* ఫిబ్రవరి 9న సంకష్టహర చతుర్థి
* ఫిబ్రవరి 16వ తేదీన గురు రవిదాస జయంతి జరుపుకుంటారు.
* ఫిబ్రవరి 18న మహాశివరాత్రి
ఫిబ్రవరి 21న యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
* ఫిబ్రవరి 26న మహర్షి దయానంద సరస్వతి జయంతి జరుపుకుంటారు.
* ఫిబ్రవరి 28న యాదగిరిగుట్ట నరసింహ తిరుకళ్యాణం

మార్చి
* మార్చి 3న తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభం
* మార్చి 4న రామక్రిష్ణ జయంతి
* మార్చి 7న హోలీ దహనం
* మార్చి 8వ తేదీన హోలీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం
* మార్చి 21వ తేదీన శివాజీ జయంతిని జరుపుకుంటారు.
* మార్చి 22వ తేదీన ఉగాది
* మార్చి 30న శ్రీరామ నవమి

ఏప్రిల్
* ఏప్రిల్ 6వ తేదీ హునుమాన్ జయంతి
* ఏప్రిల్ 9న సంకటహర చతుర్థి
* ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడే
* ఏప్రిల్ 22న అక్షయ తృతీయ

మే
* మే 1న మే డే(అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం)
* మే 7న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
* మే 8న సంకటహర చతుర్థి
* 30వ తేదీన గాయత్రీ జయంతి

జూన్
* జూన్ 4వ తేదీన ఏరువాక పౌర్ణమి
* జూన్ 7న సంకటహర చతుర్థి
* జూన్ 8న మృగశిర కార్తె
* జూన్ 20న జగన్నాథ రథ యాత్ర
* జూన్ 23న ఆరుద్ర కార్తె
* జూన్ 25న బోనాలు ప్రారంభం

జులై
* జులై 3వ తేదీన గురు పౌర్ణమి
* జులై 6న సంకటహర చతుర్థి
* జులై 28న మొహర్రం
* జులై 2, 9, 16, 17వ తేదీల్లో బోనాలు జరుపుకుంటారు.

ఆగష్టు
* ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం
* ఆగష్టు 21వ తేదీన నాగ పంచమి
* ఆగష్టు 26న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవ ప్రారంభం
* 29వ తేదీన ఓనం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి
* ఆగష్టు 30న రక్షా బంధన్/ రాఖీ పౌర్ణమి
* ఆగష్టు 31న శ్రావణ పౌర్ణమి

సెప్టెంబర్
* సెప్టెంబర్ 2వ తేదీన సంకటహర చతుర్థి
* సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం
* సెప్టెంబర్ 7వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి
* సెప్టెంబర్ 14వ తేదీన పొలాల అమావాస్య
* సెప్టెంబర్ 19వ తేదీన వినాయక చవితి
* సెప్టెంబర్ 28వ తేదీన గణేష్ నిమజ్జనం

అక్టోబర్
* అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి, సంకటహర చతుర్థి
* అక్టోబర్ 14వ తేదీ మహాలయ అమావాస్య, బతుకమ్మ ప్రారంభం
* అక్టోబర్ 15వ తేదీన నవరాత్రి ప్రారంభం
* అక్టోబర్ 21న దుర్గాపూజ
* అక్టోబర్ 22న దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ
* అక్టోబర్ 23న మహర్నవమి
* అక్టోబర్ 24వ తేదీన దసరా

నవంబర్
* నవంబర్ 1వ తేదీన కార్వా చౌత్, కన్నడ రాజ్యోత్సవం
* నవంబర్ 8వ తేదీన గురునానక్ జయంతి
* నవంబర్ 10వ తేదీన ధంతేరాస్/ ధనత్రయోదశి
* నవంబర్ 12వ తేదీన దీపావళి
* నవంబర్ 14వ తేదీన గోవర్ధన పూజా
* నవంబర్ 15వ తేదీన భాయ్ దూజ్
* నవంబర్ 16వ తేదీన నాగుల చవితి
* నవంబర్ 19వ తేదీన ఛత్ పూజా

డిసెంబర్
* డిసెంబర్ 1వ తేదీన అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం
* డిసెంబర్ 23వ తేదీన ముక్కోటి ఏకాదశి
* డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్