Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నయనానందం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం!
చైత్రశుద్ధ నవమినాటి కోలాహలం అంతాఇంతా కాదు. ఎక్కడా చూసినా సీతారాముల కల్యాణోత్సవాలు, శ్రీరాముని పట్ట్భాషేక మహోత్సవాలు కనిపిస్తాయి. శ్రీరాముని గుణనామాల కీర్తనలే . భద్రాచలంలో జరిగే వైభవోపేతమైన శ్రీ సీతా రాముల కళ్యాణం చూసిన వారి జన్మ ధన్యం. ఈ వేడుక చూడ గలగడం పూర్వ జన్మ సుకృతం. పగడాల పందిరిలో ముత్యాల తలంబ్రాలతో అంగరంగ వైభవంగా జరిగే ఆ కళ్యాణ వేడుకను చూసి తీరవలసిందే తప్ప చెప్పనలవి కాదు.
వివాహం: శ్రీ రాముడు జనకుడు ఏర్పాటు చేసిన స్వయంవరములో పాల్గొని శివధనస్సు విరిచినాడు. అప్పుడు సీత వరమాల శ్రీరాముని మేడలో వేసినది. జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని సంప్రదించి దశరథమహారాజుకు శ్రీ రాముడు, సీతాదేవి వివాహం విషయం దూతల ద్వారా అయోధ్యకు వర్తమానం పంపించాడు. దూతలు మూడురోజుల ప్రయాణం చేసి అయోధ్యకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న దశరథుడు సంతోషించాడు. వశిష్ట వామదేవాదులతో చర్చించి మరునాడే మిథిలానగరానికి వెళ్ళాలని దశరథుడు నిర్ణయించుకున్నాడు. ఆరోజున చతురంగబలాలతో దశరథుడు కౌసల్యాదేవి వశిష్ట వామదేవాదులతో మిథిలానగరానికి వెళ్ళారు. జనకుడు దశరథుడికి స్వాగతం పలికాడు. సీతా దేవి వివాహానికి సన్నాహాలు ప్రారంభించాడు. సీతా రాముల కళ్యాణం కమనీయంగా జరిపారు. అది శ్రీరాముడు జన్మించిన రోజు, రామునికి వివాహము అయినరోజు మరియు, అయోధ్యలో శ్రీరామునికి రాజ్య పఠాభిషేకము జరిగిన రోజు నవమి. అందుకే ఈ నవమిని శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాము.

ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.
ఉత్సవంలో విశేషాలు
1. ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
2. బెల్లం, మరియు మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.
3. ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.
ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు.
దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరాముని తో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.
భద్రాచలంలో రామదాసుచే కట్టబడిన రామలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు.



Click it and Unblock the Notifications