భారత్ గురించి ఎవ్వరికీ తెలియని 10 నిజాలు ఇవే

భారతదేశం అంటే కేవలం 28 రాష్ట్రాలు 140 కోట్ల జనాభా మాత్రమే కాదు. భారత్ అంటే కొన్ని వేల ఏళ్ల చరిత్ర,అత్యంత పురాతన నాగరికత,శాంతికి నిలయం,గొప్ప సంస్కృతి, గొప్ప వారసత్వం,వేద జ్ణానం,వేల ఏళ్ల క్రితమే సైన్స్ లో అద్భుతమైన పురోగతికి నిలమైన గడ్డ.

భారత్ గొప్పతనం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..మన దేశాన్నే విదేశాల నుంచి వచ్చి ఎందరో ఆక్రమించుకున్నారు కానీ ప్రపంచంలో ఏ దేశాన్ని ఆక్రమించుకోవాలని చరిత్రలో భారత్ ప్రయత్నించిన దాఖలాలు లేవు. అంతేకాదండోయ్ ఇజ్రాయెల్ నుంచి వచ్చినా,ఇరాన్ నుంచి వచ్చినా ఇలా ప్రపంచంలో ఏ దేశాలవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొని వస్తే ఆదరించిన గొప్ప చరిత్ర మన సొంతం.

10 things you didnt know about bharat

అయితే మన దేశం గురించి ఇప్పటివరకు మీకు తెలియని 10 విషయాలు ఇవే

భాషలు

మనదేశంలో కొన్నివందల భాషలు ఉన్నప్పటికీ గుర్తింపు పొందిన బాషలు కేవలం 22 మాత్రమే. అధికారిక భాషలు హిందీ,ఇంగ్లీష్. మనదేశంలో ఎక్కువగా మాట్లాడే ఇతర భాషలు తమిళం,ఉర్దూ, కాశ్మీరీ,బెంగాలీ, సంతాలి. సంస్కృతాన్ని మరచిపోకూడదు. ఇది ప్రపంచంలోనే పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. చాలా ప్రాచీన హిందూ గ్రంథాలకు ఉపయోగించే భాష. దురదృష్టవశాత్తు ఇది హిందూ దేవాలయాలలోనే తప్ప బయట మాట్లాడటం చాలా తక్కువ. అన్ని భాషల తల్లి అని ప్రేమగా పిలవబడే సంస్కృతం దేవతల భాషగా చెప్పబడుతుంది.

షాంపు అందించింది మనమే

భారతదేశం ప్రపంచానికి షాంపూని అందించింది. చాలా కాలం క్రితం ఒక భారతీయ గ్రామంలోని ఒక సమూహం ఎండిన భారతీయ ఉసిరిని ఇతర మూలికలతో కలిపి ఉంచారు. ఫలితం ఏంటంటే జుట్టు కడగడానికి సమర్థవంతమైన పేస్ట్ లా అది మారింది. ఈ రెసిపీ నేటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉపయోగించబడుతుంది. షాంపూ అనే పదం చంపో అనే హిందీ పదం నుండి వచ్చింది.

ప్రపంచంలోనే పురాతన నగరం
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరానికి నిలయం. వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరం. ఈ పవిత్ర నగరం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. శివుడు,పార్వతి దేవతలకు ఈ నగరం నిలయంగా నమ్ముతారు. వారణాసిని బనారస్, కాశీ అని కూడా పిలుస్తారు. మోక్షాన్ని సాధించడానికి చాలామంది తమ చివరి రోజులను ఇక్కడ గడుపుతారు. ఇప్పటికీ చాలామంది హిందువులు చావు చివరి దశలో ఉన్న వాళ్లు వారణాశికి యాత్రగా వెళ్లి అక్కడే తమ చివరి రోజులు గడిపి తుదిశ్వాస విడుస్తారు. వారణాశిలో తమ చివరి రోజులను గడపాలని కోరుకునే వారిని స్వాగతించే స్వచ్ఛంద సేవా సంస్థ డెత్ హోటల్ కూడా ఉంది.

పోస్టాఫీసులు
ప్రపంచంలో అత్యధిక పోస్టాఫీసులను కలిగి ఉన్న దేశం మాత్రమే కాదు. ప్రపంచంలోనే తేలియాడే పోస్టాఫీసు కూడా మనదేశంలోనే ఉంది. కశ్మీర్ రాజధాని నగరమైన శ్రీనగర్‌ లో దాల్ సరస్సు అంచులలోని హౌస్‌బోట్ లో పోస్టాఫీసు ఉంటుంది. దాల్ సరస్సు చుట్టూ ఉన్న మంచుతో కప్పబడిన పర్వతాలతో సహా ప్రకృతి దృశ్యాలు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఈ ప్రాంతానికి ఆకర్షిస్తాయి.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం
గుజరాత్ లోని ఏక్తానగర్ లో నర్మదా నడి ఒడ్డున ఉక్కు మనిషిగా పేరుపొందిన భారత మొదటి ఉప ప్రధాని,హోంమంత్రి సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేయబడింది. దీనిని స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తులో ఉంది.

పాము- నిచ్చెన ఆట
చిన్నపిల్లలే కాదు ఇప్పటికీ యువత,పెద్దలు అందరూ ఇష్టపడే ఆటలలో పాము నిచ్చెన ఆట మొదటి ప్లేస్ లో ఉంటుంది. నిజానికి ఈ గేమ్ భారత్ కి చెందినది. 800 సంవత్సరాల క్రితం జ్ఞానదేవ్ అనే సన్యాసిచే ఈ గేమ్ సృష్టించబడింది. ఈ గేమ్ ప్రయోజనం ఏంటంటే.. పిల్లలకు మంచి చెడులను బోధించడం. పాములు మన పతనానికి దారితీసే దుర్గుణాలు లేదా అనైతిక కార్యకలాపాలను సూచిస్తాయి. నిచ్చెనలు సద్గుణాలు లేదా పైకి లేచే అవకాశాలను సూచిస్తాయి. శతాబ్దాల నాటి ఈ ఆటకు అసలు పేరు మోక్షపత్.

ఎలుకల దేవాలయం
ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఎలుకలను ప్రయోగశాలలో ప్రయోగాల కోసం వాడుతుంటారు. అయితే రాజస్తాన్ లో ఎలుకల కోసం పూర్తిగా అంకితం చేయబడిన ఓ దేవాలయం ఉంది. రాజస్తాన్ లో కర్ణి మాత ఆలయం 25,000 ఎలుకలకు నిలయం అయిన హిందూ దేవాలయం. ఇక్కడ దేవాలయంలో తిరిగే ఎలుకలన్నీ గౌరవించబడతాయి. ఇక్కడుండే కొన్ని తెల్లని ఎలుకలు ముఖ్యంగా పవిత్రమైనవి. ఎలుకల లాలాజలంలో వైద్యం చేసే గుణాలు ఉన్నాయని నమ్మి ప్రజలు వాటి ఆహారం, పానీయాలను కూడా పంచుకుంటారు.

అత్యంత ఒంటరి వ్యక్తులు మన దగ్గరే

ప్రపంచంలో అత్యంత ఒంటరి వ్యక్తులు భారతదేశంలోనే నివసిస్తున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే నార్త్ సెంటినెల్ ద్వీపం ప్రపంచంలోనే అత్యంత తాకబడని ప్రదేశంగా చెబుతారు. ఈ ద్వీపవాసులు చాలా ఒంటరిగా ఉన్నారు. ఈ ద్వీపానికి దాదాపు 9 కిలోమీటర్ల కంటే దగ్గరగా వెళ్లడంపై భారతదేశం నిషేధం విధించింది. దీంతో అక్కడి బయటివ్యక్తులు ఎవరూ వెళ్లలేరు. అసాధారణంగా సెంటినెలీస్ 1991లో మానవ శాస్త్రవేత్త మధుమాల చటోపాధ్యాయను స్వాగతించారు. కానీ కొన్నేళ్ల క్రితం ఓ అమెరికా పర్యాటకుడు నిబంధనలు ఉల్లంఘించి అక్కడికి వెళ్లగా సెంటినెలీస్ అతడిని బాణాలతో కొట్టి చంపేశారు.

మూఢ నమ్మకాలు
భారతీయులకు చాలా మూఢ నమ్మకాలు ఉన్నాయి. కొంతమంది హిందువుల ప్రకారం శనివారం గోర్లు, జుట్టును కత్తిరించడం దురదృష్టాన్ని తెస్తుంది.

శని గ్రహానికి కోపం తెప్పించేలా చేయడం వల్ల దురదృష్టం వస్తుందని నమ్ముతారు.

మీ మంచం కింద ఉల్లిపాయలు కత్తులు ఉంచడం ద్వారా చెడు కలలను నివారించవచ్చు.

సూర్యాస్తమయం తర్వాత చీపురుతో ఇళ్లు ఊడ్చుకోరు. అలా చేస్తే మీరు త్వరలోనే దురదృష్టానికి గురవుతారని అర్థం. ఇది చేస్తే లక్ష్మీదేవిని ఇంటి నుండి తరిమికొట్టడానికి మీరు ప్రయత్నిస్తున్నారని అర్థం.

చెస్‌ కు నిలయం
పాము నిచ్చెన గేమ్ చెస్ యొక్క ప్రారంభ రూపం. ఇది కూడా భారతదేశంలో కూడా సృష్టించబడిందని భావిస్తున్నారు. ఇది 7వ శతాబ్దపు AD నాటిది. ఇక్కడి నుంచి ఇరాన్ కు ఈ గేమ్ విస్తరించంది. అది అరబ్ ప్రపంచంలో వ్యాపించి దక్షిణ ఐరోపాకు చేరుకుంది. అప్పుడు ఈ గ్రిప్పింగ్ గేమ్ గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది. అయితే మన భారతీయులకు మాత్రం ఇది ఎప్పుడో తెలుసు.

Story first published: Thursday, November 21, 2024, 13:03 [IST]
Desktop Bottom Promotion