Latest Updates
-
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా?
బుకర్స్ ప్రైజ్ గెలుచుకున్న 10 మంది భారతీయ నవలాకారులు !!
సాహితీ రంగంలో ఆస్కార్ గా చెప్పదగ్గ మాన్ బుకర్ ప్రైజ్ రావాలని కామన్వెల్త్ దేశాలకు చెందిన ఏ నవలాకారుడైనా కోరుకుంటాడు. మే 22 నాడు మాన్ బుకర్ అంతర్జాతీయ బహుమతిని ప్రకటించిన సందర్భంగా, బుకర్స్ ప్రైజ్ గెల్చుకున్న లేక గెలవడానికి ఎంచుకోబడ్డ 10 మంది భారతీయ నవలాకారుల గురించి మీకు అందిస్తున్నాం.1)

ఈ సుప్రసిద్ధ నవలాకారుడు భారత భూభాగం వాడు కాకున్నా భారత సంతతి వాడు కావడం వల్ల ఈ జాబితా లోకి వస్తాడు. 1971 లో బుకర్ ప్రైజ్ కోసం షార్ట్ లిస్టు చేయబడి, ‘ఇన్ ఎ ఫ్రీ స్టేట్' అనే పుస్తకానికి బుకర్స్ ప్రైజ్ గెలుచుకున మొదటి భారతీయుడు అతడు. 1919 లో ‘అ బెండ్ ఇన్ ద రివర్' అనే పుస్తకం కోసం మరోసారి షార్ట్ లిస్టు చేయబడ్డాడు. మాడ్రన్ లైబ్రరీ వారు వెలువరించిన 20 వ శతాబ్దపు అత్యుత్తమ ఇంగ్లీష్ నవలల్లో ఈ నవల 83 వ స్థానంలో వుంది.

బుకర్స్ కోసం అనితా దేశాయి ఒక సారి రెండు సార్లు కాదు, మూడు సార్లు షార్ట్ లిస్టు చేయబడింది. మొదటి సారి 1980 లో దేశ విభాజనానంతర కథతో రాసిన ‘క్లియర్ లైట్ ఆఫ్ ద డే' పుస్తకానికి ఎంపికయింది. 1984 లో ‘ఇన్ కస్టడీ' అనే పుస్తకం కోసం ఎంపికయింది, తరువాత 1993 లో ఈ పుస్తకాన్ని సినిమాగా తీసారు. చివరిగా 1999 లో ఉభయ సంస్కృతుల కథాంశం తో రాసిన ‘ఫాస్టింగ్, ఫీస్టింగ్' అనే పుస్తకానికి బుకర్స్ కు ఎంపికయింది. సాహిత్య అకాడెమీ విజేత అయిన అనితా దేశాయి చివరి నవల 2011 లో రాసిన ‘ద ఆర్టిస్ట్ ఆఫ్ డిస-అపియరెన్స్'.

వివాదాస్పద వాస్తవిక మంత్రగాడు సల్మాన్ రష్డీ బుకర్స్ కు నాలుగు నాలుగు సార్లు ఏమ్పికవడమే కాక, బుకర్ అఫ్ బుకర్స్ తో పాటు బెస్ట్ అఫ్ ద బుకర్ ప్రైజులు కూడా గెల్చుకున్నాడు. ఇవి అతనికి మొదటి బుకర్ ప్రైజ్ తెచ్చి పెట్టిన 1981 నాటి రచన ‘ద మిడ్-నైట్స్ చిల్డ్రన్' కే అందాయి. షేమ్ (1983), ద సాతానిక్ వెర్సెస్ (1988), ద మూర్స్ లాస్ట్ సై (1995) లాంటి ఇతర నవలలు అతన్ని ఫైనలిస్ట్ ల జాబితాలోకి చేర్చాయి.

ఇండో-కెనడియన్ నవలాకారుడు రోహింటన్ మిస్త్రీ ఇప్పటికి మూడే నవలలు రాసాడు, మూడు సార్లూ బుకర్స్ ప్రైజ్ కోసం షార్ట్ లిస్టు చేయబడ్డాడు. 1991 లో రాసిన ‘సచ్ ఎ లాంగ్ జర్నీ' - దాని మీద బాల్ థాకరే ఫిర్యాదు చేయడంతో ముంబై విశ్వవిద్యాలయం సిలబస్ నుంచి తీసి వేయడంతో వార్తల్లోకి వచ్చింది. రెండో పుస్తకం ‘ఎ ఫైన్ బాలన్స్' (1996) నాటకంగా మార్చారు. మిస్త్రీ రాసిన మూడోది, చివరిది అయిన నవల 2002 నాటి ‘ఫామిలీ మాటర్స్'.

1997 లో ఈ రాజకీయ కార్యకర్త రాసిన మొదటి నవల ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్' కు బుకర్ ప్రైజ్ వచ్చింది. ప్రవాసీయుడు కాని భారతీయ రచయిత/త్రి రాసిన పుస్తకాల్లో అన్నిటికన్నా ఎక్కువగా అమ్ముడైన పుస్తకం ఇది. అప్పటి నుంచి ఆవిడ చాలా పుస్తకాలు రాసింది - అయితే వాటి కన్నా ఆవిడ రాజకీయ సిద్ధాంతాలకు ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంది. బుకర్ కాకుండా ఆవిడా ఇంకా కొన్ని అవార్డులు పొందింది, వాటిలో 2006 లో వచ్చిన సాహిత్య అకాడెమి అవార్డు ముఖ్యమైనది.

తల్లి చేయలేనిది కూతురు చేసింది. కిరణ్ దేశాయి కూతురు అనితా దేశాయి 2006 లో రాసిన రెండోది, చివరిది అయిన ‘ద ఇంహేరిటేన్స్ ఆఫ్ లాస్' అనే పుస్తకానికి బుకర్స్ ప్రైజ్ వచ్చింది. ఆవిడ రాసిన మొదటి పుస్తక౦ ‘హుల్లబాలూ ఇన్ తే గువా ఆర్చర్డ్' సల్మాన్ రష్డీ లాంటి రచయితల ప్రశంసలు అందుకుంది. 2010 లో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన ఒర్హాన్ పముక్ తను, దేశాయి ఒక బంధం లో ఉన్నామని చెప్పాడు - ఇది సాహితీ రంగానికి పెద్ద వార్త.

2007 లో ఈ బ్రిటిష్-ఇండియన్ నవలాకారుడు భోపాల్ గ్యాస్ ఉదంతం పై రాసిన ‘ఆనిమల్స్ పీపుల్' అనే పుస్తకం వల్ల ఫైనలిస్ట్ ల జాబితాలోకి వచ్చాడు. ఈ దుర్ఘటన బాధితులకు న్యాయం చేయాలని వాదించే ఈ రచయిత దాని గురించి ఒక ప్రచార కార్యక్రమం చేశాడు, చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ఎన్నో వ్యాసాలు రాసాడు. మొదటి 10 బ్రిటిష్ కాపీ రైటర్ల జాబితాలో వుండే అరుదైన ఖ్యాతి కల ఈ రచయిత కాల్పనికేతర సాహిత్యం రాయడంతో పాటు సంస్కృత పుస్తకాలను ఆంగ్లం లోకి అనువదిస్తాడు కూడా

2008 లో వరసగా మూడో సారి భారతీయ నవలాకారులు బుకర్స్ ప్రైజ్ కు నామినేట్ అయ్యారు - చెన్నై కు చెందిన అరవింద్ అడిగ ఈ సారి తన మొదటి నవల ‘ద వైట్ టైగర్' పుస్తకానికి బుకర్స్ గెలుచుకున్నాడు. ప్రపంచీకరణ నేపథ్యంలో భారత దేశంలోని వర్గ పోరాటాన్ని హాస్య దృక్కోణంలో చిత్రించిన ఈ నవల ఈ అవార్డు గెలుచుకున్న రెండో పిన్న వయస్కుడిగా అడిగ ను నిలిపింది. మొదటి నవలకే బుకర్స్ ప్రైజ్ గెలుచుకున్న వారి లో అతడు నాలుగో వాడు.

అదే ఏడాది, తన ఆరో నవల ‘సీ ఆఫ్ పాపీస్' కోసం బెంగాలీ రచయితా అమితావ్ ఘోష్ కూడా షార్ట్ లిస్టు చేయబడ్డాడు, అలా ఇద్దరు భారతీయులు ఒకే ఏడాది బుకర్స్ కు నామినేట్ కావడం కూడా అదే మొదటి సారూ. ఈ పుస్తకం 1830 ల లోని ఓపియం యుద్దాల పై అతని ఇబిస్ త్రయం పుస్తకాలలో ఇది మొదటిది. అతని ఇటీవలి నవల ‘రివరరివర్ ఆఫ్ స్మోక్' (2011) రెండో పుస్తకం కాగా, మూడోది ఇంకా ప్రచురితం కావాలి. 2007 లో అతనికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది.

2012 లో మాన్ బుకర్ ప్రైజ్ కోసం తాజాగా షార్ట్ లిస్టు అయిన భారతీయుడు - నవలాకారుడు, కవి, సంగీత కారుడు యిండ్ జీత్ తయిల్. అతని మొదటి ఏకైక కాల్పనిక సాహిత్యం ‘నార్కపోలిస్' కు నామినేట్ అయ్యాడు. 1970 ల లోని బాంబే ను చిత్రించిన ఈ పుస్తకం నల్లమందు మత్తులోకి, బయటకు ఒక వ్యక్తీ చేసిన ప్రయాణాన్ని కళ్ళకు కడుతుంది. రాయడానికి అయిదేళ్ళు పట్టిన ఈ నవల ఒక మత్తు మందు బానిస గా అతని స్వీయ అనుభవాల సంకలనం.

మన జాతీయ సాహిత్య ప్రజ్ఞావంతులను స్మరించుకునేటప్పుడు, వారిలో 2013 బుకర్ ప్రైజ్ కోసం నామినేట్ అయిన యు. ఆర్. అనంత మూర్తి ఒకరు. ఈ కన్నడ రచయితకు శుభాకాంక్షలు. సాహితీ ప్రియులకు మంచి పుస్తక విందు కలగాలని ఆకాంక్ష!



Click it and Unblock the Notifications











