భారత్ లో ఏఏ సిటీ -ఏఏ ఆహారానికి ఫేమస్ చూడండి

భారత దేశం అనూహ్యంగా ఒక పెద్ద దేశం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో మన దేశం రెండవది. ప్రపంచం అంతటా ఆహారపు అభిరుచులు, అలవాట్లు ఎలా వున్నా, భారతదేశానికి వచ్చేసరికి ప్రాంతాల వారీగా ఆహారపు అలవాట్లు చిరకాలంగా విభజించడం అన్నది ఆనవాయితీగా మారింది. స్థూలంగా దక్షిణ, ఉత్తర ప్రాంతాలుగా పేర్కొనాల్సి వస్తుంది. తిరిగి ఉత్తర దేశపు అహారపు అలవాట్లు పంజాబీ, గుజరాతీ, రాజస్థానీగా, దక్షిణ ప్రాంత అలవాట్లను కేరళ,తమిళ,ఆంధ్రగా ముద్రపడ్డాయి. ఇవి కాక, హైదరాబాదీ బిరియానీ, బెంగాల్ స్వీట్లు ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఇలా ఏ ప్రాంతపు ప్రత్యేకతలు, ఆహారపు అలవాట్లు ఆయా ప్రాంతవాసుల జీవితాలతో వందలాది ఏళ్లుగా మమేకంపై వుండిపోయాయి. అయితే మారుతున్న కాలంలో ప్రజలు ఒక ప్రాంతం అని కాకుండా ఇటువారు అటు, అటువారు ఇటు అన్నట్లుగా దేశం నలుమూలలా చెదిరి, వ్యాపించడంతో ఒకప్పుడు ప్రాంతాల వారీగా వున్న ఆహారపు అలవాట్లు దేశవ్యాప్తమయ్యాయి. అలాగే భారతీయలు పెద్ద సంఖ్యలో విదేశాలకు తరలివెళ్లడంతో అదే ఆహారపదార్ధాలు విశ్వవాప్తమయ్యాయి. విదేశీయులు, భారతీయ ఆహారపు అలవాట్లతో అట్టే పరిచయం లేనివారు ఇప్పుడు మన వంటకాలను రుచి చూసి వహ్వా అంటున్నారు. ఈ కారణంగా విదేశాలకు ఆహార పదార్ధాల ఎగుమతులు బాగా పెరిగాయి.

చిత్రమేమిటంటే ఇక్కడున్న మనవారు పరాయ రుచుల కోసం ఉవ్విళ్లూరుతుంటే, విదేశాల్లో స్థిరపడ్డ మనవారు ఎంతో ఖర్చు చేసి ఇక్కడి నుంచి మన తీపి, కారం వంటకాలు అక్కడకు తెప్పించుకుంటున్నారు. అది వేరేసంగతి. ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ పల్లెలకు, పట్టణాలకు తేడా లేకుండా, ఎగువ దిగువ తరగతి బేధాల్లేకుండా పాకిన ఆహారపు అలవాట్ల సంగతి మాత్రమే. ఇవి కాక జిల్లా కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో భిన్న రుచులను అమాంతం అక్కున చేర్చుకుని ఆదరించే సంస్కతి బాగా పెరిగింది. పొరుగింటి పుల్లకూర అని అనకూడదు కానీ, ఇప్పుడు బయట వంటకాలు తినడం పట్ల మక్కువ పెంచుకున్న జనం, ఆ బయటి వంటకాలు కూడా అచ్చంగా ‘బయటివే' అయి వుండాలని కోరుకుంటున్నారు. పండుగ నాడూ పాత తిండేనా అన్నట్లుగా, హోటళ్లకు వెళ్తే కాంటినెంటల్, తండూరి, చైనీస్ వంటకాలను రుచి చూడడం అన్నది అభిరుచిగా మారింది. జనం మెచ్చింది తాము చేయడమా..తాము చేసింది జనం తినడమా అన్న మీమాంస లేకుండా రెస్టారెంట్లు జనం కోరినవే వండి వార్చడం కాకుండా, కొత్త కొత్త రకాలు తెస్తూ, జనాల అభిరుచులకు మరింత మెరుగులు దిద్దుతున్నారు. సాధారణంగా కొన్నింటికి కొన్ని ప్రాంతాలు లేదా కొన్ని సంస్థలు పేరు తెచ్చుకోవడం అన్నది సహజం. మన దేశంలో వివిధ ప్రాంతాల నుండి వివిధ వంటలు బాగా పేరుతెచ్చుకొన్నాయి.

భారతదేశంలో ఫుడ్ ను భట్టే మీరు పలానా రాష్ట్రం వారా అని అడిగించుకొనే నగరాలు కూడా ఉన్నాయి. నార్త్ ఇండియన్ సిటీస్ లో చాట్స్, చోలే భతురే, దాల్స్ మరియు పరోటాలకు పెట్టింది పేరు. మరి మన సౌంత్ ఇండియా ఏం తీసిపోలేదు. సౌంత్ ఇండియా సిటీల్లో ప్రతి నగరంలో ప్రతి వంట చాలా ప్రత్యేక శైలిలో ప్రసిద్ది చెందాయి. ఉదా, దోసె, ఇడ్లీ, సాంబార్ మొదలగు ఆహారాలు ప్రసిద్ధి చెందాయి. ఉదాహరణకు: పంజాబ్ మరియు రాజస్థాన్ ఇరుగుపొరుగు రాష్ట్రాలైన కూడా వారి వంటలు పూర్తి భిన్నంగా ఉంటాయి.

మన భారత దేశంలోప్రత్యేక ఆహారాలకు బాగా ప్రసిద్ది చెందిన నగరాలు గురించి బోల్డ్ స్కై ఒక చక్కటి సమాచారం మీకు అందిస్తోంది. ఈ ప్రొఫైల్లో మన భారత దేశంలోని పెద్ద మరియు చిన్న నగరాలను కూడా పరిగణలోనికి తీసుకోనబడింది. వీటిలో కొన్ని ఆహారాలు స్ట్రీట్ ఫుడ్స్ కాగా మిగిలినవి చాలా రుచికరమైనవై ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు రుచి చూడటానికి ఇష్టమైన వంటలు. మరి వీటిల్లో మీరేదైనా తినాలంటే వీకెండ్స్ లో ఫుడ్ వెకెషన్స్ ప్లాన్ చేసుకోవాల్సిందే..

తమ ఆహారాలకు ప్రసిద్ది చెందిన 20 భారతీయ నగరాలను ఒక సారి పరిశీలించండి..

ముంబాయ్: వడ పావ్ మరియు ఇరాని ఛాయ్

ముంబాయ్: వడ పావ్ మరియు ఇరాని ఛాయ్

భారత దేశంలో అతి పెద్ద మెట్రోపాలిటన్ సిటీ ముంబాయ్. ఇక్కడా ప్రజలకు వడా పావ్ అంటే అమితమైన ప్రేమ. ఇది సాధారణంగా పొటాటో కట్ లెట్ ను బ్రెడ్(బన్స్) లేదా పావ్ లోపల స్టఫ్ చేసి ఉంటారు. ఇక స్వీట్ ఇరానికి ఛాయ్ నగరంలో అనేక ఇరానీ (పెర్షియన్)కేఫ్స్ చాలా ప్రసిద్ది చెందాయి.

ఢిల్లీ: తందూరి చికెన్, చోలే భతుర మరియు ఛాట్స్:

ఢిల్లీ: తందూరి చికెన్, చోలే భతుర మరియు ఛాట్స్:

మన దేశ రాజధాని, ఫుడ్ లవర్స్ కు స్వర్గంగా వెలసింది. ఢిల్లీ సిటి అవుట్ సైడ్ నివసించే వారు చాలా వరకూ స్ట్రీట్ చాట్స్ మరియు రొమాంటి చోలే భతుర స్టాల్స్ బాగా ఉన్నాయి. తందూరి చికెన్ కు ఉత్తమ స్థలాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఇక్కడ తందూరి చికెన్ స్పైసీగా వెరైటీ గ్రిల్డ్ చికెన్ చాలా ప్రసిద్ది.

కలకత్తా: రసగుల్లా మరియు వివిధ రకాల ఇతర స్వీట్స్:

కలకత్తా: రసగుల్లా మరియు వివిధ రకాల ఇతర స్వీట్స్:

కోలకత్తా సంగీతం మరియు స్వీట్లకు చాల ప్రసిద్ది చెందిన నగరం. పురాణకాలం నుండి రసగుల్లాను కనుగొనబడింది. ఈ నగరం లో రోల్స్, ఇతర స్ట్రీట్ ఫుడ్స్, చౌమిన్స్ అనేకం నోరూరిస్తూ కనిపిస్తుంటాయి.

చెన్నై: ఇడ్లీ దోస

చెన్నై: ఇడ్లీ దోస

సౌంత్ ఇండియన్ కల్చర్ కు చెన్నై సెంటర్ . చెన్నైకు వెళితే ఈ ఇడ్లీ సాంబార్ ను రుచి చూడకుండా ఉండలేరు. అంతే కాదు మళ్ళీ మళ్లీ తినాలిపించే ఇడ్లీ, వడ, సాంబార్, క్రిస్పీ దోసె చాలా ప్రసిద్ది చెందినవి చెన్నైలో.

బెంగళూర్: బిసిబెలే బాత్ మరియు కీమా కోఫ్తా కర్రీ

బెంగళూర్: బిసిబెలే బాత్ మరియు కీమా కోఫ్తా కర్రీ

బెంగళూర్ వాతావరణం మీకు స్వర్గంలా అనిపిస్తుంది. ఎందుకంటే అంతటి కూల్ క్లైమెట్ లో వేడి వేడిగా రుచికరమైన, నోట్లో పెట్టుకొంటే సున్నితంగా గొంతులోకి దిగబడే బిసిబేలే బాత్ వేడి వేడిగా తినాల్సిందే. అలాగే కీమా కోఫ్తా కర్రీస్ కు ఇది చాలా ప్రసిద్ది చెందిన నగరం.

కొచ్చీ: కేరళ పరోటా మరియు చేపల ఫ్రై

కొచ్చీ: కేరళ పరోటా మరియు చేపల ఫ్రై

కేరళీయుల వంటకాలకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. కొచ్చీలో కేరళ పరోటా -చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా ప్రసిద్దిచెందిన వంటకం. తీర ప్రాంతమైన కేరళలో చేపలతో వండే వెరైటీ వంటకాలకు చాలా ప్రసిద్ది చెందినది. అక్కడే చేసే ఫిష్ వెరైటీలు ప్రపంచంలో మరెక్కడా దొరకవు.

లక్కో: Galouti Kebab

లక్కో: Galouti Kebab

నాటి లక్నో,అవధ్ సామ్రాజ్యపు నోరూరించే కబాబ్ రుచులను మారియట్ హోటల్ నగరవాసులకు పరిచయం చేస్తోంది. దంతాలు ఉపయోగించకుండా చిగుళ్ళుతో తినడానికి ఒక కబాబ్ కావాలంటే లక్నోకు వెళ్ళాల్సిందే. అంత సున్నితంగా సుతి మెత్తగా గలౌటీ కబాబ్స్ కు తయారు చేస్తారు.

హైదరబాద్: బిర్యానీ

హైదరబాద్: బిర్యానీ

హైదరాబాద్ లో ఫేమస్ ఏంటి అనగానే ఠక్కున చెప్పేవాటిలో హైదరాబాద్ బిర్యానీ ఫస్ట్ ఉంటుంది. ఇక్కడ నవాబ్ ల కాలం నాటి ముఘులాయ్ మరియు ఆంధ్రా కుషన్లు చాలా ఫేమస్. ఈ సిటీలో హైదరబాద్ దమ్ బిర్యానీగా హైదరాబాద్ బాగా ప్రసిద్ది చెందినది.

బనారస్: పాన్ మరియు రబ్రి

బనారస్: పాన్ మరియు రబ్రి

మీరు బనారసి పాన్ అనే వినే ఉంటారు. బనారస్ సిటీ మొత్తం మాగై పాన్ కు చాలా ప్రసిద్ది చెందినది.

శ్రీనగర్: గస్టభ

శ్రీనగర్: గస్టభ

భూమి మీద స్వర్గాన్ని అందించే స్వభావం కంటే ఎక్కువ. కాశ్మీరీ వంటకాలు ప్రత్యేకమైన రుచులతో ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఎక్కువగా మీట్ బాల్ కర్రీ ఫేమస్. ఇది స్వీట్ కశ్మీరీ పులావ్ తో బాగా ప్రసిద్ది చెందినది.

మైసూర్: మైసూర్ పాక్ మరియు మసాలా దోసె

మైసూర్: మైసూర్ పాక్ మరియు మసాలా దోసె

మైసూర్ అనగానే చటుక్కున టిప్పు సుల్తాన్ గుర్తుకు వస్తుంది. మైసూర్ ప్యాలెస్ గుర్తుకొస్తుంది. వీటితో పాటు మైసూర్ పాక్ మరియు మసాలా దోసె కూడా చాలా ప్రసిద్ది చెందినవి.

జైపూర్: దాల్ బాతి చుర్మా:

జైపూర్: దాల్ బాతి చుర్మా:

రాయల్ స్టేట్ గా పిలువబడే రాజస్తాన్, అనేక చారిత్రక సంఘటనలతో ఉంది. కానీ అక్కడ వండే ఆహారాలకు సంబంధించినంతవరకూ, దాల్ బాతి చుర్మా చాలా రుచికరంగా ఉంటుంది.

ఆగ్రా: పేత

ఆగ్రా: పేత

ప్రపంచం మొత్తం ప్రసిద్ధిగాంచిన సిటి ఆగ్రా. ఎందుకంటే అక్కడా తాజ్ మహాల్ ఉంది కాబట్టి. ఈ సిటీలో మొఘల్ సంస్కృతిలో ఒక ఆసక్తికరమైన నీడ ఉంది. కాచీన పాలతో తయారు చేసే పేతకు చాలా ప్రసిద్ది.

అమ్రిత్ సర్: మఖ్ ది రోటీ మరియు సర్ సాన్ ద సాజ్

అమ్రిత్ సర్: మఖ్ ది రోటీ మరియు సర్ సాన్ ద సాజ్

పంజాబీయులకు మఖ్ ది రోటీ(కార్న్ ఫ్లోర్ బ్రెడ్ ) చాలా ఫేమస్. అలాగే సర్ సాన్ ద సాజ్(మస్టర్డ్ గ్రీన్స్ కర్రీ)కూడా ప్రత్యేకమైన వంటగా ప్రసిద్ది చెందినది.

భువనేశ్వర్: దాల్మా

భువనేశ్వర్: దాల్మా

ఒడిస్సా వారి సుప్రసిద్ద వంటకం ఇది. దీన్ని వివిధ రకాల మాంసంతో పప్పుతో తయారు చేస్తారు.

గోవా: ప్రాన్ గస్సీ

గోవా: ప్రాన్ గస్సీ

గోవా తాగడానికి, తినడానికి, పార్టీలకు చాలా ప్రసిద్ది చెందిన నగరం. ఈ బీచ్ సిటీలో సీ ఫుడ్స్ కు చాలా ఫేమస్. ఇక్కడ డిఫరెంట్ క్రాబ్స్, ప్రాన్స్ ఇతర వంటకాలు చూడవచ్చు . కానీ అక్కడికి వెళ్ళిన వారు మాత్రం గోవాన్ ప్రాన్ కర్రీని రుచి చూడకుండా మాత్రం ఉండలేరు. దీన్ని గస్సీ అంటారు. అంతటి ఫేస్ వంటకం ఇది.

ఛండీఘర్: దాల్ మఖానీ

ఛండీఘర్: దాల్ మఖానీ

భారత దేశంలో పంజాబీ వంటకాలను అందించే అరుదైన ప్రదేశం ఛండీఘర్. ఇక్కడ రుచికరమైన ధాల్ మఖానీ చాలా ఫేమస్.

పాట్నా: లిట్టీ చొక్కా

పాట్నా: లిట్టీ చొక్కా

బీహార్ స్ట్రీట్ ఫుడ్స్ కు చాలా ప్రసిద్ది చెందినది. స్ట్రీట్ ఫుడ్ లో ఒకటైన ఆహారపదార్థమే ఈ లిట్టీ చొక్క. దీన్ని వంకాయలు మరియు బంగాళదుంపలతోటి తయారు చేస్తారు. అలాగే వడ్డించే ముందు ఎక్కువగా నెయ్యిని మిక్స్ చేస్తారు. లేదా నెయ్యితోటి వడ్డిస్తారు.

అహ్మదాబాద్ : డోక్లా

అహ్మదాబాద్ : డోక్లా

ఇది గుజరాత్ స్పెషల్ కుషన్. ఇది బేక్డ్ స్నాక్. ఇది అహ్మాదాబాద్ లో ఏ ప్రదేశంలో నైన దొరుకుతుంది.

కూర్గ్: ఫోర్క్ కర్రీ:

కూర్గ్: ఫోర్క్ కర్రీ:

కర్ణాటకలో కూర్గ్ అనేది ఒక జిల్లా. కూర్గ్ వంటకాలు సౌంత్ ఇండియన్ సిటీలలో చాలా ఫేమస్ .

Story first published: Saturday, June 22, 2013, 18:06 [IST]
Desktop Bottom Promotion