Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
భారత దేశంలోని టాప్ టెన్ రొమాంటిక్ హనిమూన్ ప్రదేశాలు..!
హనీమూన్ లేక హనిమూన్ (Honeymoon)అనేది ఇంగ్లీషు పదం. దీనిని తెలుగులో తియ్యని వెన్నెల అని అంటారు. చంద్రుడు నెల రోజులకు సంకేతం, తేనె ఎంతో తీయగా మధురంగా ఉంటుంది వీటి రెండిటి కలయికే హనీమూన్. అలాగే నూతన వధూవరులు మధురమైన క్షణాలను అనుభవించడానికి, ఉల్లాసంగా గడపడానికి నెల రోజుల పాటు లేదా కొన్ని రోజులపాటు అందమైన, ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్ళి వస్తుంటారు. ఈ విధంగా నూతన వధూవరులు శారీరకంగా మరియు మానసికంగా ఒకటైయెందుకు జరుపుకునే మొదటి ఉల్లాస యాత్రని హనీమూన్ అంటారు.
హనీమూన్... జీవితాంతం గుర్తుండిపోయే తీపి అనుభవాల సుమహారం. ఇలాంటి సుమాల మాల మరొక్కటి ఉంటే... ప్రతి ఒక్కరినీ ఈ కల ఏదో ఒక మూల మదిని తొలుస్తూనే ఉంటుంది. మరి రెండవ హనీమూన్ ఎలా ఉండాలి? మొదటి హనీమూన్‌ను తలపించేదిగా ఉండకూడదు... మరిపించేదిగా ఉండాలి. కొత్తగా పెళ్ళైన జంటలకు హనీమూన్ అనేది మధురానుభూతులు మిగిల్చే ఘట్టం. ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు, ఏకాంతంగా సమయం గడిపేందుకు, ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకునేందుకు ఇలా ఎన్నో జ్ఞాపకాల సమ్మేళనమే హనీమూన్.
పెళ్ళైన కొత్తలో కొత్త ప్రదేశాల్లో గడపడం అన్న, వెళ్ళిరావడం అన్న మహా సరదాగా ఉంటుంది. ఈ ముచ్చటను పెళ్ళైన నెలలోని ఎక్కువగా తీర్చుకొంటుంటారు. రోజులు గడిచే కొద్ది, ఇన్ట్రెస్ట్ తగ్గుతుంది. తర్వాత సంసార బాధ్యతలు, పిల్లలు హీనిమూన్ కు వెళ్ళే పరిస్థితే ఉండదు. కాబట్టి, మీ పెళ్ళవ్వగానే సాద్యమైనంత తర్వగా హానీమూన్ ప్లాన్ చేసుకోవాలంటే. ..ఇలాంటి వారు ఎక్కువగా పర్వత ప్రాంతాలు, లగ్జరీ హోటళ్ళు, అందమైన ప్రదేశాలకు వెళుతుంటారు. ఇవన్నీ కూడా ఇతర దేశాలకు వెళ్ళాలన్నా ఖర్చుతో కూడుకున్న పని. అంతటి అద్బుత ప్రదేశాలు మన భారతదేశంలోనే చాలా ఉన్నాయి. మరి ఆ ప్రదేశాలేంటో ఒక సారి చూద్దాం...

మనాలి/కులు మనాలి: భారతదేశంలో అత్యంత అద్భుతమైన విరామ ప్రదేశం. ఎక్కువగా ఈ ప్రదేశాన్ని చాలా మంది ఇష్టపడుతారు. ఇక్కడ నేచర్ చాలా అద్భుతంగా ఉండి అక్కడికి వెళ్ళే వారిని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఇటువంటి రొమాంటిక్ ప్రదేశం మన భారత్ లో హిమాచల్ ప్రదేశ్ యొక్క పర్వతాల్లో ఉంది.

కోవలం బీచ్: ప్రశాంతతకు మారు పేరు కోవలం బీచ్. ఇది చాలా సుందర ప్రదేశం జీవితాంతం మనసులో చెరగని ముద్రవేస్తుంది. కోవలం కేరళలో ఉంది. కేరళలో మూడు బీచ్ లున్నాయి. లైట్ హౌస్ బీచ్, హవా బీచ్, మరియు సముద్ర బీచ్. అక్కడికి హానీ మూన్ ట్రిప్ వెళితే అక్కడి నాణ్యమైన సమయాన్ని గడిపి రావచ్చు. ఇంకా అక్కడ అందమైన సూర్యోదయం, మరియు సూర్యాస్తమయం చూడవచ్చు.

జైసల్మేర్: ఒకనాటి భారతీయ కళాకారుల నిర్మాణ చాతుర్యానికి నిలువెత్తు ప్రతీకగా రాజస్థాన్‌లోని జైసల్మేర్ దేశంలోని ప్రధాన పర్యాటక కేంధ్రాలలో ఒకటైంది. నగరం నడిబొడ్డున వుండే జైసల్మేర్ కోట ను జైసల్మేర్ కు గర్వ కారణంగా భావిస్తారు. పసుపు రంగు ఇసుకరాయి తో నిర్మించిన ఈ కోట సూర్యాస్తమయం లో బంగారంలా మెరిసిపోవడంతో దీన్ని సోనార్ ఖిల్లా లేదా బంగారు కోట అని కూడా అంటారు. త్రికురా కొండ మీద 1156లో భాటి రాజపుత్ర రాజు జైసల్ దీన్ని నిర్మించాడు. జైసల్మేర్ కోటలో చాల అందమైన భవంతులు, దేవాలయాలు, సైనికులు, వ్యాపారుల నివాస భవనాల సముదాయాలు వున్నాయి. ఈ కోట చుట్టూ 30అడుగుల ఎత్తైన గోడ వుంది. 99 బురుజులు వున్న పెద్ద కోట ఇది.

వెగటోర్ బీచ్: మన దేశంలో సముద్ర తీరాలంటే మనకు బాగా గుర్తుకు వచ్చేది గోవా బీచే. అవును మరి చెప్పలేనంత అందాన్ని దాచుకుని మనను ఊరిస్తుంటాయి గోవా తీరాల అందాలు. అంతే కాకుండా వేసవిలో మనసుకు టానిక్‌లా శక్తినిస్తాయి ఈ తీరాలు. అలసిన మనసులు కాసేపు షికారు కొట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. గోవా నార్త్ సైడ్ లో ఉండే ఈ వెగటోర్ బీచ్ ను ఒక సారి సందర్భిస్తే జీవితంలో మర్చిపోలేరు. మీ పాట్నర్ రిలాక్స్ అవ్వడానికి మరియు రొమాంటిక్ ప్రదేశం.

జమ్మూ & కాశ్మీర్: జమ్మూ & కాశ్మీర్ భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న రాష్ట్రం. దీనికి ఉత్తరాన, తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. దక్షిణాన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమున్నది. కాశ్మీరు లోయ: కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల స్వర్గంగా పేరు పొందింది. ఇక్కడి శ్రీనగర్ ముఖ్య నగరం, వేసవికాలపు రాజధాని. అంతే కాదు కొత్తగా పెళ్ళైన వారికి ఓ మంచి రొమాంటిక్ ప్రదేశం కూడా.

గోకర్ణ బీచ్, గోకర్ణం: ఈ బీచ్ బాగా పేరొందినది. గోకర్ణ పట్టణానికి దగ్గరలో ఉంది. పర్యాటకులు ఇక్కడినుండి ఒకవైపు అరేబియా మహా సముద్రాన్ని మరో వైపు పడమటి కనుమలను చూడవచ్చు. స్ధానికంగా హోటళ్ళు, వాటర్ స్పోర్ట్స్, సన్ బేతింగ్ వంటివి ఆనందించవచ్చు. ఇక్కడ వ్యాపార పర అంశాలు, కాలుష్యం, శబ్దాలు వంటివి లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పర్యాటకులు, డ్రమ్ములు, గిటార్లు వంటి వాయిద్యాలతో ఎంతో ఆనందిస్తారు. సంవత్సరంలో ఏ సమయంలో అయినా సరే ఈ బీచ్ లో ఆనందించవచ్చు.

షిల్లాంగ్: ఆకాశాన్ని తాకే శిఖరాలు, పాతాళాన్ని మరిపించే లోయలు, చుట్టూ పచ్చని అడవులు, పర్వతాలు, కొండచరియల నుండి జాలువారే సెలయేటి గలగలను చూడాలంటే... ఈశాన్య సుందరాంగి అయిన షిల్లాంగ్‌ను దర్శించాల్సిందే. భారతదేశపు ఈశాన్యప్రాంతంలో ఒక చిన్న రాష్ట్రమైన మేఘాలయ రాజధానియే ఈ షిల్లాంగ్. ఈశాన్య భారతావనిలో అతి సుందర ప్రదేశాలలో షిల్లాంగ్ ప్రముఖమైనది.షిల్లాంగ్ ప్రకృతి అందాలను చూసి, మోహించి, చుంబించేందుకేనా మేఘరాజు పర్వతాలమీదికి దిగివచ్చాడా అని అనిపిస్తుంది. ఇక్కడి వాతావరణాన్ని గమనిస్తే, కొండల మీద పాము మెలికలను తలపించే కాలిబాటలు, దట్టమైన అడవులను చుట్టుకుని వస్తుంటాయి. మరి ఇటువంటి ప్రదేశాన్ని చూడకుండా ఎలా ఉంటారు.

సిమ్లా: అందమైన ఘాట్ రోడ్లు, కొండకోనలు, చుట్టూ పరుచుకున్న ప్రకృతి, హిమ శిఖరాల సౌందర్యం, పొడవైన వంతెనలు, పాతాళాల లోకాన్ని తలపించే సొరంగమార్గాలు... ఇలా ఒకటేమిటి ఇక్కడ కనిపించే ప్రతి ప్రకృతి దృశ్యం పర్యాటకుని మదిని నిలువెల్లా దోచేస్తుంది. స్థానికులు కొలుచుకునే దేవతం ‘శ్యామలాదేవి' పేరుతో ప్రసిద్ధమైన, భారత్‌లో అత్యంత విశిష్టమైన పర్యాటక కేంద్రం సిమ్లా.

తాజ్ మహాల్: ప్రపంచంలోని ఎనిమిది వింతలలో ఒకటి, తాజ్ మహల్ అనే ఒక అద్భుతమైన సమాధి, భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. తాజ్ మహల్ (ఇంకా "తాజ్") మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది, ఇది పర్షియా, భారతీయ మరియు ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది.

తెక్కడి: అదో దట్టమైన అడవి... ఆ అడవిలో పచ్చటి పచ్చికబయళ్లు... అడుగడుగునా పలుకరించే సెలయేళ్లు... ఆ సెలయేళ్లలో దాహం తీర్చుకోడానికి విచ్చేసే అడవి జంతువులు... చదువుతుంటేనే అక్కడికెళ్లి చూడాలనిపించేంత ఉత్సుకత కలుగుతుందిమరి. ఇంతకీ ఈ సుందర దృశ్యం ఎక్కడిది?! అనంటే ఇడుక్కి జిల్లాలోని తెక్కడి అటవీప్రాంతంలోనిది. ఇంకా సూటిగా చెప్పుకోవాలంటే అడవి జంతువులకు ఆవాసంగా వెలుగొందుతోన్న 'పెరియార్ వన్యమృగ సంరక్షణ కేంద్రం' లోనిది.



Click it and Unblock the Notifications











