Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
2032 డిసెంబర్ 22న భూమి బద్దలవడం ఖాయమా? నాసా బయటపెట్టిన సంచలన నిజాలు,అందరిలో ఆందోళన!
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవల బయటపెట్టిన ఓ విషయం ఇప్పుడు అందరి గుండెల్లో టెన్షన్ పెంచుతోంది. ఓ భారీ గ్రహశకలం అత్యంత వేగంగా అంతరిక్షం నుంచి భూమివైపు దూసుకొస్తున్నట్లు నాసా సైంటిస్టులు తెలిపారు. ఆస్టరాయిడ్ 2024 YR4 అని ఈ గ్రహ శకలానికి పేరు పెట్టారు. 2024 YR4 గ్రహశకలాన్ని 2 నెలల కిందట చిలీలోని ఒక ఎడారిలో టెలిస్కోప్ ద్వారా ఆకాశాన్ని పరిశీలిస్తుండగా గుర్తించారు. ఈ గ్రహశకలం 100 మీటర్ల వెడల్పు వరకు ఉంటుందని అంచనా వేశారు.
ఈ ఆస్టరాయిడ్ గంటలకు 61,200 కిలోమీటర్ల వేగంతో భూమివైపు కదులుతోందని, ప్రతి సెకనుకు 17 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తోందని సైంటిస్టులు తెలిపారు. ఇది డిసెంబర్ 22, 2032లో భూమికి చాలా దగ్గరగా వెళుతుందని, అది భూమిని ఢీకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.

భయాందోళనలు
భూమి నాశనానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా అనేక మంది అనేక రకాల అంచనాలను వెల్లడించారు. కొన్నిసార్లు అయితే ఆ సంవత్సరంలోనే యుగాంతం ఉంటుందంటూ కూడా అంచనాలు వెలువడ్డాయి. 2012లో యుగాంతం జరగబోతుందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది..చాలామంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు..యుగాంతం జరిగితే ఎలా ఉంటుందనే దానిమీద సినిమాలు కూడా అప్పట్లో వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లు మాత్రమే అని తేలగా..ఈసారి స్వయంగా నాసా సైంటిస్టులే భూమి మీద 2032 డిసెంబర్ లో భారీ వినాశనం ఉండే అవకాశముందని గతవారం చెప్పడంతో ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది.
చందమామపై
అయితే తాజాగా సైంటిస్టులు మరో కీలక ప్రకటన చేశారు. 2032లో ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం 0.28 శాతంగానే ఉన్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ ఆస్టరాయిడ్ భూమిని తాకే అవకాశం 3.1 శాతమని ఈ మొదట్లో వాళ్లు అంచనాకు వచ్చారు. తర్వాత అది 0.28 శాతానికి తగ్గింది. ఈ గ్రహశకలం చంద్రుడిని తాకే అవకాశం 1 శాతం మేర ఉన్నట్లు నాసా అంచనా వేస్తోంది.
హిరోషిమా,నాగసాకిపై వేసిన అణు బాంబుల కంటే 500 రెట్లు ఎక్కువ
ఇలాంటి గ్రహశకలాలు భూమిపై అతిపెద్ద బిలాన్ని సృష్టించగలవు. అది తాకిన సమీప ప్రాంతాల్లోని నిర్మాణాలు ధ్వంసమవుతాయి. 2024 YR4 ఆస్టరాయిడ్ పొరపాటున భూమి వాతావరణాన్ని తాకినా లేదా దానిలోని ఏదైనా భాగంపై పడినా భయంకరమైన పేలుడు సంభవిస్తుందని సైంటిస్టులు తెలిపారు. దీనివల్ల దాదాపు 8 మిలియన్ టన్నుల TNT శక్తి విడుదల అవుతుంది, ఇది హిరోషిమా,నాగసాకిపై వేసిన అణు బాంబుల కంటే 500 రెట్లు ఎక్కువ విధ్వంసం కలిగిస్తుందని తెలిపారు. 50 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ప్రతిదీ నాశనం అవుతుంది. కాగా,ఒక గ్రహశకలం 1908లో సైబీరియా మీదుగా వెళుతూ పేలిపోయింది. దీంతో 500 చ.కి.మీ భూభాగంలో భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు గాయపడ్డారు.



Click it and Unblock the Notifications