Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
కలియుగం తరువాత సత్యయుగం ఎలా వుండబోతోందో తెలుసా..?
ద్వాపర యుగం, సత్యయుగం, త్రేతాయుగం, కలియుగం ఈ నాలుగు యుగాల గురించి కొంత మనకు తెలిసిందే. ప్రస్తుతం మనమంతా జీవిస్తున్నది కలియుగం. అయితే ఈ కలియుగం ఎలా అంతమవుతుందనేది అందరికీ ఆసక్తిగా మారింది. హిందూ శాస్త్రం ప్రకారం కాలఖండంలో మొత్తం నాలుగు యుగాలుంటాయ్. ఈ నాలుగు యుగాలు చివర్లో ఒక ప్రళయం వచ్చి మొత్తం నాశనమైపోతుంది. 12 వేల సంవత్సరాల తరువాత యుగాలు మళ్లీ ప్రారంభమౌతాయ్. కలియుగం అంతమయ్యే సమయంలో చివరి దశ వుంటుంది, దాన్నే ఘోర కలియుగం అంటారు. ఈ ఘోరకలియుగంలో వాతావరణంలో స్థిరత్వముండదు. కరువుకాటకాలతో భూమిపై ఏదో ఒక సమస్య ఎప్పుడూ వుంటుంది. భోజనం దొరక్క ప్రజలంతా ఆకలితో అలమటిస్తూ వుంటారు. రకరకాల రోగాలు విస్తరిస్తూ వుంటాయ్.

మనిషి, కపటత్వం, హింస వైపు ప్రయాణిస్తూ వుంటాడు. అప్పుడు డబ్బు మాత్రమే ప్రధానమౌతుంది. దీంతో మానవత్వం మటుమాయమైపోయ్, చట్టం, న్యాయం, ధర్మం కూడా డబ్బున్న వాళ్లకు దాసోహంగా మారుతుంది. డబ్బు మాత్రమే మనిషి పుట్టుకను, గుణగణాలను నిర్ణయిస్తుంది. కలియుగం చివర్లో మనిషి ఘ్నానం, సంస్కారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా డబ్బును హోదాను మాత్రమే చూస్తారు.
సమాజంలో సంపాదించని వ్యక్తికి ఎటువంటి గుర్తింపు వుండదు. మోసాలు చేయగల లక్షణాన్ని గొప్పతనంగా భావిస్తారు. ప్రేమాభిమానాలు, స్వచ్ఛమైన బంధాలు ఏవీ వుండవు, కపటం, కల్మషంతో నిండిన బంధాలు మాత్రమే వుంటాయ్. స్త్రీ, పురుషుల మధ్య కేవలం ఆకర్శన మాత్రమే వుంటుంది. సత్యయుగంలో మనిషి 32 అడుగుల ఎత్తు, లక్ష సంవత్సరాలు ఆయుష్షును కలిగి వుండేవాడు. త్రేతాయుగంలో 21 అడుగుల ఎత్తు, వెయ్యి సంవత్సరాలు ఆయువును కలిగి వున్నాడు. ద్వాపరయుగంలో పది అడుగుల ఎత్తు, వెయ్యి సంవత్సరాల ఆయువు వుండేది. కలియుగంలో 6 అడుగుల ఎత్తు కలిగి వంద సంవత్సరాలకు పడిపోయింది. కలియుగం పూర్తయ్యే సరికి మనిషి ఆకారం మరింత చిన్నగా మారిపోతుంది.

ప్రస్తుతం వున్న అలవాట్లకు మనిషి వందేళ్ల బ్రతకలేకపోతున్నాడు. కలియుగం చివరిదశలో మనిషి 50 ఏళ్లకంటే ఎక్కువ బ్రతకలేడు. కలియుగం చివర్లో వేదాలు, దేవుళ్ల గురించి మరిచిపోయి నాస్తికులుగా జీవించడం మొదలుపెడతారు. చిన్న చిన్న గొడవలకు ఒకరిని ఒకరు చంపుకునే వరకు వెళ్తారు. పచ్చదనం తగ్గిపోతుంది. చెట్ల ఎత్తు కూడా తగ్గిపోతుంది. దైవ భక్తి పూర్తిగా నశించిన సమయంలో విష్ణు మూర్తి కల్కీ అవతారంలో వస్తాడు. కలియుగంలో కల్కీ చాలా శక్తివంతుడిగా వుంటాడుు. కేవలం ఆలోచనతోనే తన ఆయుధాలను తన స్వాధీనంలోకి తెచ్చుకోగలుగుతాడు. దుర్మార్గులందరినీ ఒకరి తరువాత ఒకరిని అంతం చేసుకుంటూ వస్తాడు. ఇలా అందరినీ అంతం చేసినప్పుడు మళ్లీ సత్యయుగం ప్రారంభమౌతుంది.
కల్కీ భగవానుడు శంబలా నగరంలో విష్ణు ఆశా, సుమతీ దేవి దంపతులకు ఐదవ సంతానంగా జన్మిస్తాడు. కల్కీ దైవసంబంధమైన గుణాలను కలిగి వుంటాడు. సత్యయుగంలో మనుషులు ఎలాంటి సామర్ధ్యాన్ని కలిగి వుండరు. ఒకరికి ఒకరు సహాయాన్ని చేసుకుంటారు. వారి మనసులో ఎలాంటి దురాశ, అసూయ లాంటివి వుండవు. సత్య యుగంలో వున్న మనుషులు ఇంద్రియాలను అదుపులో వుంచుకోగలుగుతారు. సత్య యుగంలో మనుషులకు దు:ఖాలు వుండవు. వీరిలో అహంకారం ఏమూలన కూడా కనబడదు. ఇతరుల వినాశనాన్ని కోరుకునే దురాశ కూడా వీరిలో వుండదు. ఎలాంటి గొడవలు లేకుండా అందరూ ప్రేమానురాగాలతో వుంటారు. ఏ ఒక్కరు కూడా తాము బలమైన వ్యక్తులమని చెప్పుకోరు. ఈ యుగంలో మనుషులు తమ అధిక సమయాన్ని ధర్మ, కర్మ ఫలాల కోసమే వినియోగిస్తారు. ఈ యుగంలో స్త్రీ పురుషుల మధ్య ఎక్కువ వ్యత్యాసమనేది వుండదు. అందరికీ సమాన విద్యావకాశాలు లభిస్తాయ్. స్త్రీలు తమ భర్తలకు సేవలందిస్తూ వుంటారు. పిల్లలకు కూడా తల్లిదండ్రులు చెప్పినట్టు వింటారు.



Click it and Unblock the Notifications