Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
మృత్యుంజయుడు: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ బ్రిటీష్ పౌరుడు..ఏం చెప్పాడంటే..
అహ్మాదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఇవాళ ఎయిరిండియా విమానం కూలిపోయిన ఘటనలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలోని 11వ నంబర్ సీటులోని 40 ఏళ్ల బ్రిటీష్ పౌరుడు స్వల్ప బయటపడినట్లు అహ్మదాబాద్ సీపీ జీఎస్ మాలిక్ చెప్పారు. విమానం కూలిపోయిన సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ప్రయాణికులుడు బయటికొచ్చినట్లు సమాచారం. గాయాలతో ప్రయాణికుడు రోడ్డుమీద నడుస్తూ అంబులెన్స్ వెపుకి వెళ్తున్నట్లున్న వీడియోలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.
కాగా ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్. భారత సంతతికి చెందిన ఈ వ్యక్తి లండన్ లో స్థిరపడ్డారు. గత 20 ఏళ్లుగా విశ్వాస్ కుమార్ అక్కడే భార్యా,పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కుటుంబసభ్యులను కలిసేందుకు భారత్ వచ్చిన విశ్వాస్ కుమార్..తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ తో కలిసి తిరిగి లడన్ వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నాం ఎయిరిండియాకి చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ఎక్కారు.

విమానం కూలిపోయిన సమయంలో అందులో మొత్తం 242 మంది ఉన్నారు. విశ్వాస్ ఒక్కరే బతికి బయటపడ్డారు. అదృష్టవశాత్తూ హోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ అహ్మదాబాద్ లోని ఓ ట్రీట్మెంట్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అతని కళ్లు,ఛాతీ, పాదాలకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన విశ్వాస్ కుమార్.. టేకాఫ్ అయిన 30 సెకన్లకే పెద్ద శబ్దం వినబడింది. వెంటనే విమానం కూలిపోయింది. నేను సృహలోకి వచ్చిచూసేసరికి నా చుట్టూ అన్ని మృతదేహాలునక్నాయి. వెంటనే లేచి పరిగెత్తాను. విమానశకలాలు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడున్నాయి..ఎవరో నన్ను అంబులెన్స్ లోకి వెక్కించారని" ఆయన చెప్పారు.
విమానం మధ్యాహ్నాం 1: 39 గంటల సమయంలో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన నిమిషాల్లోపే ఎయిర్ పోర్ట్ సమీపంలోనే కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. అంతేకాకుండా విమానం ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ లోకి దూసుకెళ్లడంతో ఆ హాస్టల్ మెస్ లో మధ్యాహ్నా భోజనం చేస్తున్న పలువురు మెడికల్ విద్యార్థులు మరణించినట్లు సమాచారం. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. మరోవైపు, కూలిపోయిన ఈ విమానం ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా చనిపోయారు. 2016 నుంచి 2021 వరకు గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ పనిచేశారు.
ఇప్పటివరకు 200కి పైగా మృతదేహాలు లభ్యమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాల కోసం ఎయిరిండియా ఢిల్లీ,ముంబై నుంచి అహ్మదాబాద్ కు 2 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. కాగా,అహ్మదాబాద్ లోని సివిల్ హాస్పిటల్ లో దగ్గర విషాద వాతావరణం నెలకొంది. తమ ఆత్మీయుల కోసం బంధువులు,ఫ్రెండ్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.



Click it and Unblock the Notifications
