Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఇలా స్నానం చేస్తే కంటిచూపు పోతుంది.. మీరు కూడా ఇలానే చేస్తున్నారా? వెంటనే తెలుసుకోండి!
బీచ్‌కి వెళ్ళినప్పుడు సాధారణంగా సముద్రంలో వెళ్లి స్నానం చేయాలని అనుకుంటాం. అలానే వెళ్లి సముద్రంలో స్నానం చేస్తూ ఆ క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అయితే ఇలానే సముద్ర స్నానానికి వెళ్లిన అమెరికాకు ఓ మహిళకు అత్యంత దారుణమైన ఘటన ఎదురైంది. తన జీవితంలో ఏది జరగకూడదు అదే జరిగిపోయింది. కేవలం స్నానం చేయడం వల్లే ఆమె తన జీవితాన్ని కోల్పోయింది. ఇంతకూ ఆ మహిళకు ఏం జరిగింది? స్నానం చేస్తే ఏమయ్యింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు మహిళకు ఏమయ్యిందంటే?
అమెరికాకు చెందిన బ్రూక్లిన్ మెక్‌కాస్లాండ్ అనే 23 ఏళ్ల మహిళ తన స్నేహితులతో కలిసి అలబామాకు వెళ్ళింది. ఆమెకు దృష్టిలోపం ఉండడంతో ముందు నుంచే లెన్సెన్స్ వినియోగిస్తుంది. అయితే ఆ లెన్స్‌తోనే ఆమె స్నేహితులతో సరదాగా స్నానం చేసేందుకు సముద్రంలోకి వెళ్ళింది. అంతా సరదాగా గడిపి ఇంటికి వచ్చేశారు. అయితే కొద్దీ రోజుల తరువాత బ్రూక్లిన్ మెక్‌కాస్లాండ్ జీవితం మొత్తం అంధకారమయమైంది.

ఆమె సముద్రంలో స్నానం చేసే సమయంలో లెన్సెస్ వినియోగించడంతో పాటు.. ఆమె కార్నియాను దెబ్బతీసే అరుదైన పరాన్నజీవి అకాంతమీబా కెరాటిటిస్ ఇన్ఫెక్షన్ సోకింది. ఈ ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరమైనది అలాగే అరుదైనది కూడా. దీని కారణంగా ఆమె తన కుడి కన్ను మొత్తాన్ని కోల్పోయినట్లు పేర్కొంది.
తనకు అంతకుముందే ద్రుష్టి లోపం ఉండడం, అలాగే ఇన్ఫెక్షన్ సోకిన తరువాత కూడా లక్షణాలు మిగతా వాటిలాగానే ఉండడంతో ఆమె కొన్ని స్టెరాయిడ్‌లు, చుక్కల మందులు వేసుకుంది. కానీ ఫలితం ఏమాత్రం దక్కలేదు. దీంతో వైద్యులను సంప్రదించగా.. ఆమెకు సోకింది ఇన్ఫెక్షన్ అని తేలింది. ఆమెకు సోకింది చాలా అరుదైన ఇన్ఫెక్షన్ అని, దానికి సంబంధించిన మందులు కేవలం లండన్‌లోనే దొరుకుతాయట. పైగా ఆ వైద్యానికి అధికమొత్తంలో అవుతుండడంతో ఆమె నిధులు సేకరిస్తున్నారు.
అయితే ఈ చికిత్స కూడా చాలా నెమ్మదిగా పని చేస్తుందట. సమస్యను గుర్తించినప్పటికీ అప్పటికే తాను కుడి కంటిని కోల్పోయానని, దీని కారణంగా తీవ్రమైన నరకాన్ని చూశానని ఆమె చెబుతోంది. తనలా ఇంకెవ్వరూ ఎప్పుడూ కాంటాక్ట్ లెన్స్‌తో సముద్రంలోకి స్నానానికి వెళ్లోద్దని, వెళ్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
ఇండియాలో కూడా..
అమెరికాలో మాత్రమే కాదు.. ఇండియాలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. చెరువులో, బావిలో ఈతకు వెళ్లిన యువకులకు అరుదైన అమీబా వ్యాధి సోకి, అది మెదడుకు పాకి చివరకు ప్రాణం పోయే వరకు వెళ్ళింది. సముద్రంలో వెళ్లిన యువకులు సైతం ఇలాంటి ఘటనలే ఎదురుకావడం, చివరికి మరణించడం వంటి ఘటనలు ఇండియాలో చోటు చేసుకున్నాయి. అందుకే సముద్రంలో, బావిలో, చెరువులో ఈతలకు, స్నానాలకు వెళ్లేముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాపాయమే.



Click it and Unblock the Notifications