Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
శాస్త్రవేత్త ప్రకటన.. మానవ జాతి అంతం అయ్యేది అప్పుడే! మన తరువాత భూమిని ఎవరు పాలిస్తారంటే?
శతాబ్దాల క్రితం భూమిని డైనోసార్లు పరిపాలించాయన్న విషయం తెలిసిందే. కాలక్రమేణా భూమి పరిణామం చెందడంతో డైనోసార్లు కూడా అంతమైపోయాయి. ఆ తరువాత భూమిపై వివిధ జాతులు వెలుగులోకి వచ్చినప్పటికీ.. మానవ జాతి భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం మానవజాతి భూమిపై ఆధిపత్య జాతులుగా మారిపోయారు. ఈ మార్పు కూడా శాశ్వతం కాదు. డైనోసార్ల అంతరించిపోయినట్లే, కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత మానవ జాతి అంతం కావచ్చు.
అయితే మనుషుల తరువాత భూమిపై ఆధిపత్యం చెలాయించే జంతువు ఏదైనా ఉద్భవిస్తుందా లేదా ఉన్న మానవ జాతే మళ్ళీ భూమిపై పుట్టుకొస్తుందా? ఇతర జీవాలు ఏవేవి భూమిపై తమ ప్రతాపాన్ని చూపిస్తాయి అనే విషయంపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో ఈ స్టోరీలో వివరించాము, చూడండి.

భూమి భవిషత్తు ఎలా ఉంటుంది?
మానవులతో సహా భూమిపై ఉన్న అన్ని జీవులు పరిణామం చెందాయని మనకు తెలుసు. ఈ పరిణామాల్లో చాలా వరకు భూమి హానికరంగానే మారాయి. కానీ కొన్ని పరిణామాలు మాత్రం భూమిని పరిరక్షించాయి, అలాగే ఉపయోగకరంగా మారాయి. మానవ జాతి అంతరించి పోయే కాలం చాలా దూరంలో ఉంది. మానవ జాతి అంతరించిపోయిన తర్వాత ఏ జాతులు ఆధిపత్యం చెలాయిస్తాయో అనేది ప్రతి ఒక్కరిలో ఉత్సుకతను పెంచుతాయి. ఆ జాతి ఏదంటే?
భూమిని పాలించే తదుపరి జీవి
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మానవుల తర్వాత భూమి కొత్త రకమైన పరిణామానికి దారి తీయొచ్చు. ఆక్టోపస్‌లు మరింత ఆధిపత్య పాత్ర పోషించే అవకాశం ఉంది. వారి తెలివితేటలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు వారిని ఆధిపత్య శక్తిగా మారుస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ విషయంలో ఆక్టోపస్‌లు ఇప్పటికే విశేషమైన సామర్థ్యాలను కనబరిచాయి. ఈ మేరకు అవి టూల్స్ ఉపయోగించి ట్యాంకుల నుండి తప్పించుకునే వీడియో చూశాము కూడా. "అవి నాగరికతను నిర్మించే జాతిగా పరిణామం చెందుతాయి" అని పరిశోధకులు అంటున్నారు. వారి అధునాతన నాడీ వ్యవస్థ ఈ ఆలోచనలకు అనుగుణంగా ఉండడం కూడా విషయం.
అయితే, ఆక్టోపస్‌లు భూమిపై జీవించలేవు. అవి కేవలం సముద్రంలోనే జీవిస్తాయి. కానీ "కాలక్రమేణా పరిణామం చెందడంతో.. వారు నీటి వెలుపల కూడా శ్వాస తీసుకోవడానికి కావాల్సిన మార్గాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది" అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిణామ మార్పులు భవిష్యత్తులో భూసంబంధమైన జంతువులను వేటాడేందుకు ఆక్టోపస్‌లకు తగిన నైపుణ్యం, సామర్థ్యం అందిస్తాయని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications