Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
Artificial Womb: యంత్రాల్లో బిడ్డల జననం, ఇంటర్నెట్‌లో షాకింగ్ వీడియో
యంత్రాల ద్వారా బిడ్డకు జన్మనివ్వడం అనేది మాటలకు అందనిది. అయితే ఎక్టో లైఫ్ అనే సంస్థ ఆర్టిఫిషియల్ యుటెరస్ ఫెసిలిటీని తీసుకువచ్చింది. ఇది ప్రపంచంలోనే తొలి కృత్రిమ పిండంలా పని చేస్తుందని సంస్థ చెబుతోంది.
Artificial Womb: తల్లి కావడం అనేది మహిళకు గొప్ప వరం. నవమాసాలు బిడ్డను మోసి కనడం మహిళలకు మాత్రమే చెందిన అతి గొప్ప అనుభూతి. గర్భంలో పిండాన్ని 9 నెలల పాటు మోసి, ఎంతో నొప్పిని పంటి బిగువన భరించి బిడ్డకు జన్మనివ్వడం మాటలకు అందనిది.

అయితే బిడ్డకు జన్మనివ్వడం అనేది ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్య కారణాల వల్ల బిడ్డకు జన్మనివ్వడం కష్టం కావొచ్చు. మరికొందరు అందం పోతుందని గర్భం దాల్చడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం సరోగసి అనేది తెరపైకి వచ్చింది. సరోగసి కోసం వేరొక మహిళ గర్భం కావాల్సి ఉంటుంది. అయితే అసలు గర్భం అవసరం లేకుండా బిడ్డలకు జన్మనిచ్చే కొత్త టెక్నాలజీ రాబోతోందని ఇంటర్నెట్‌లో ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది.
యంత్రాల ద్వారా బిడ్డకు జన్మనివ్వడం అనేది మాటలకు అందనిది. అయితే ఎక్టో లైఫ్ అనే సంస్థ ఆర్టిఫిషియల్ యుటెరస్ ఫెసిలిటీని తీసుకువచ్చింది. ఇది ప్రపంచంలోనే తొలి కృత్రిమ పిండంలా పని చేస్తుందని సంస్థ చెబుతోంది. ఈ యంత్రాల్లోనే పిండాన్ని పెంచుతారు. పిండం దశ నుండి 9 నెలలు అయ్యాక శిశువు బయటకు వచ్చేంత వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యంత్రాలే పూర్తిగా సంరక్షణ బాధ్యతను నిర్వర్తిస్తాయి.

యెమెన్ మాలిక్యులర్ బయోటెక్నాలజిస్టు హషేమ్ అల్-ఘైలీ రూపొందించిన 8.39 నిమిషాల యానిమేషన్ వీడియోలో ఎక్టోలైఫ్ కృత్రిమ గర్భాశయం గురించి చూపించారు. పెద్ద ప్రయోగశాలలో భారీ సంఖ్యలో యంత్ర గర్భాలు ఉన్నాయి. అందుల్లో శిశువు వృద్ధి చెందుతుంది. గ్రోత్ పాడ్‌లో తల్లి గర్భంలో ఉన్నటువంటి వాతావరణం అందులో ఉంటుంది. వెచ్చదనం, హృదయ స్పందన, రక్తపోటు, శ్వాస రేటు, ఆక్సిజన్ సంతృప్తత వంటి శిశువు యొక్క ముఖ్యమైన సంకేతాలను పర్యవేక్షించగల సెన్సార్లు ఉంటాయి.

శిశువు ఎలా జన్మిస్తుంది?
ఎక్టోలైఫ్ వీడియో ప్రకారం యంత్రం చాలా సులభంగా బిడ్డకు జన్మనిస్తుంది. దీని ద్వారా బేబీ ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేకుండా జన్మిస్తుంది. యంత్ర గర్భంలో తల్లి గర్భంలో ఉన్న మాదిరిగానే అన్ని సమకూర్చుతారు. వెచ్చని వాతావరణంతో పాటు హృదయ స్పందన, రక్తపోటు, శ్వాస రేటు, ఆక్సిజన్ సంతృప్తత వంటి శిశువు యొక్క ముఖ్యమైన సంకేతాలను పర్యవేక్షించగల సెన్సార్లు ఉంటాయి.



Click it and Unblock the Notifications
