Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బాబా వంగా అంచనా..2026లో బంగారం ధర ఎంత ఉంటుందో తెలుసా?
మనదేశంలో బంగారాన్ని కేవలం ఒక లోహంగానే చూడరు. బంగారం అంటే భారతీయలకు ఒక ఎమోషన్. ఆడపిల్ల పెళ్లికైనా, కష్టకాలంలో ఆదుకోవడానికైనా పసిడినే నమ్ముకుంటారు. అయితే, గత కొద్ది రోజులుగా బంగారం ధరలు కనీవినీ ఎరుగని రీతిలో ఊగిసలాడుతున్నాయి.
రికార్డు స్థాయిలో రూ. 1,33,300 (10 గ్రాములకు) తాకిన ధరలు..ఉన్నట్లుండి రూ. 1,24,970కి, ఆపై రూ. 1,20,000 స్థాయికి పడిపోవడంతో సామాన్యులు, పెట్టుబడిదారులు అయోమయంలో పడ్డారు. ఈ తరుణంలో ప్రముఖ భవిష్యవాణి కర్త బాబా వంగా అంచనాలు ఇప్పుడు మార్కెట్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

2026 నాటికి ఏం జరగబోతోంది?
ప్రపంచవ్యాప్తంగా తన జోస్యాలతో ప్రసిద్ధి చెందిన బల్గేరియన్ అంధురాలైన బాబా వంగా అంచనాల ప్రకారం.. 2026 బంగారం మార్కెట్ కు అత్యంత కీలకమైన సంవత్సరం కాబోతోంది. బాబా వంగా నేరుగా బంగారం ధర గురించి చెప్పకపోయినప్పటికీ ఆమె అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక మాంద్యం పసిడి ధరలకు రెక్కలు తొడగనుంది.
ఆమె అంచనా నిజమైతే 2026లో ప్రపంచవ్యాప్తంగా నగదు కొరత తీవ్రమవుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. ఆయిల్, ఎనర్జీ సంక్షోభాలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం సురక్షితమైన పెట్టుబడిగా భావించేది బంగారాన్నే. ఎప్పుడైతే కరెన్సీ విలువ పడిపోతుందో అప్పుడు బంగారం డిమాండ్ అమాంతం పెరుగుతుంది.
ఈ లెక్కన 2026 నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 150,000 నుంచి ఏకంగా రూ. 200,000 వరకు చేరుకుని ఆల్ టైమ్ రికార్డు సృష్టించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గతంలో బాబా వంగా అంచనాలు నిజమయ్యాయా?
బాబా వంగా చెప్పిన మాటలను అంత తేలిగ్గా తీసిపారేయలేం. గతంలో అమెరికాలోని ట్విన్ టవర్లపై ఉగ్రదాడి, ప్రిన్సెస్ డయానా మరణం, మయన్మార్ భూకంపం,జపాన్ సునామీ వంటి అనేక సంఘటనలను ఆమె ముందే సూచించారు. అవి అక్షరాలా నిజమయ్యాయి.
ఇప్పుడు ఆర్థిక మాంద్యం గురించి ఆమె చేసిన హెచ్చరిక కూడా నిజమైతే బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
పెట్టుబడిదారులకు సూచన
ప్రస్తుతం మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు కనిపిస్తున్నా, అంతర్జాతీయ పరిణామాలు ఏ క్షణాన ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేం. బాబా వంగా అంచనాలు, రాబోయే ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు మార్కెట్ కదలికలను నిశితంగా గమనించడం మంచిది. ధర తగ్గినప్పుడే కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం కావచ్చు.



Click it and Unblock the Notifications