Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
తోకతో పుట్టిన బాలుడు.. శస్త్ర చికిత్స చేసి తొలగించిన బీబీనగర్ ఏయిమ్స్ వైద్యులు..!
తోకతో పుట్టిన బాలుడి సంఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుందాం. గత సంవత్సరం అక్టోబర్‌లో ఒక మహిళకు తోకతో బాలుడు జన్మించాడు. మూడు నెలలకు ఆ తోక 15 సెంటిమీటర్లు పెరిగింది. దీంతో తల్లిదండ్రుడు ఆందోళనకు గురయ్యి బాలుడిని బీబీనగర్‌లోని ఏయిమ్స్‌కు తీసుకొని వచ్చారు. బాలుడికి వున్న తోక వెన్నుపూసకు అనుసంధానమై వుండడం వల్ల శస్త్ర చికిత్స చేసి ఆ తోకను కట్ చేశారు. ఆరు నెలల మందు ఈ ఆపరేషన్ జరిగింది. ఇలాంటి ఆపరేషన్ జరిగిన తరువాత కూడా బాలుడు ఆరోగ్యంగా వుండడం సంతోషించదగ్గ విషయమని వైద్యులు అంటున్నారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో అనారోగ్యానికి గురౌతారని, అలాంటివి ఈ బాలుడిలో ఏవీ కనబడలేదని వైద్యులు చెప్పుకొచ్చారు.

ప్రపంచంలో ఇలా తోకతో జన్మించిన కేసులు కేవలం 40 మాత్రమే చోటుచేసుకున్నాయని ఏయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. కాగా దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు, వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంత మంది హనుమంతుడి రూపంగా భావిస్తున్నారు. మరికొందరు చాలా వింతగా ఈ సంఘటనను చూస్తున్నారు.
అయితే ఇలా జన్మించిన పిల్లలను సాధారణ పిల్లలుగా చూడకుండా వారిని ప్రత్యేకంగా చూస్తారు. ఇలా కాకుండా అందరి పిల్లల్లాగే వారిని చూడాలని చెబుతున్నారు. పిల్లకు వున్న ఈ తోకల్లో ఎముకలు వుండవు, చెవులకు వున్నట్లుగా సాఫ్ట్ ఎముక కూడా వుండదు.
మానవ పరిణామ క్రమానికి సంబంధించి చార్ల్స్ డార్విన్ మనకు ఒక సిద్ధాంతాన్ని అందించారు. అందులో ఆయన చెబుతూ.. మనుషులకు తోక వుండేదని అయితే అది పరిణామ క్రమంలో మాయమైందని అంటాడు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు డార్విన్ సిద్ధాంతం గుర్తుకు వస్తుంది. అయితే పరిణామక్రమంలో మాయమైన తోకలు మళ్లీ వచ్చే అవకాశముందని కొందరు శాస్త్రవేత్తలు 1980లో వాదించారు.
2008లో జరిగిన ఒక పరిశోధనలో.. తోకలతో జన్మించిన శిశువులు మానసికానికి సంబంధించిన సమస్యలతో బాధపడాతారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలా తోకతో పుట్టిన పిల్లలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కేవలం 40 వరకు మాత్రమే చోటుచేసుకున్నాయ్. మన పురాణాల్లో తోకలు వుండే మనుషులంటే కేవలం వానరసేన, హనుమంతుడు మాత్రమే. అయితే వారు మనుషులు కాదు కోతిజాతికి చెందిన వారని అంటారు. మరికొందరు వాదిస్తూ మానవపరిణామ క్రమంలో మనం చెప్పబడిన ఆదిమానవులే వానరసేన అని కూడా కొందరు సూత్రీకరిస్తున్నారు. ఈ చర్చ ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతూనే వుంది.
ఏదిఏమైనా బీబీనగర్ ఏయిమ్స్‌లో బాలుడికి తోకను తొలగించిన తరువాత ఆరునెళ్ల అనంతరం కూడా బాలుడు ఆరోగ్యంగా వున్నాడని, ఎలాంటి భయం అవసరం లేదని వైద్యులు చెప్పడం సంతోషించదగ్గ విషయం.



Click it and Unblock the Notifications