Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్..జులై 1 నుంచి ఛార్జీల పెంపు..ఎంతో చూడండి
మనదేశంలో అతిపెద్ద ప్రజారవాణా నెట్ వర్క్ ఇండియన్ రైల్వేస్. నిత్యం వేలాది రైళ్లు పట్టాలపై తిరుగుతుండగా..ఆ రైళ్లల్లో లక్షలాదిమంది తమ గమ్యస్థానాలకు ప్రయాణిస్తుంటారు. అత్యంత సురక్షితమైన ప్రజా రవాణా వ్యవస్థగా కూడా భారతీయ రైల్వేకు పేరుంది. అయితే రైల్వే ప్రయాణికులకు జులై నెల నుంచి బిగ్ షాక్ తగలనుంది. భారతీయ రైల్వే 2025 జూలై 1 నుండి తన ఛార్జీల విధానాన్ని సవరిస్తోంది.
చాలా కాలం తర్వాత రైల్వే శాఖ ఈ ఛార్జీలను సవరిస్తోంది. రోజువారీ ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా నిర్వహణ ఖర్చులను సమతుల్యం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి 2025 జూలై 1వ తేదీ లేదా ఆ తర్వాత ప్రయాణం కోసం టిక్కెట్లు బుక్ చేసుకునేవారు ఈ కొత్త ఛార్జీలను గమనించి ప్లాన్ చేసుకోవడం మంచిది. పెరిగిన ఛార్జీల వివరాలను ఇక్కడ చూడండి.

పెరగనున్న ఛార్జీల వివరాలు
వాస్తవానికి పెరగనున్న ఛార్జీలు అందరికీ వర్తించవు. సుదూర ప్రయాణాలు చేసే వారికి మాత్రమే ఛార్జీలు స్వల్పంగా పెరగనుండగా, లక్షలాది మంది రోజువారీ ప్రయాణికులకు ఎలాంటి మార్పు ఉండదు. జనరల్ సెకండ్ క్లాస్ లో మీరు 500 కిలోమీటర్ల లోపు ప్రయాణిస్తే, మీ ఛార్జీలో ఎలాంటి మార్పు ఉండదు. అంతకు మించి ప్రయాణించే వారికి ప్రతి కిలోమీటర్ కు కేవలం అర పైసా మాత్రమే పెరుగుతుంది. అంటే 1,000 కిలోమీటర్ల ప్రయాణానికి మీరు అదనంగా రూ. 2.50 చెల్లించాలి. మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ (నాన్-ఏసీ) రైళ్లలో ప్రయాణించే వారికి ప్రతి కిలోమీటర్ కు 1 పైసా పెరుగుతుంది. అంటే 1000 కిలోమీటర్ల ప్రయాణానికి ఇప్పుడు రూ. 10 అదనంగా ఖర్చవుతుంది.
ఏసీ చైర్ కార్, 3-టైర్, 2-టైర్ లేదా ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే వారికి ప్రతి కిలోమీటర్ కు 2 పైసల చొప్పున ఛార్జీ పెరుగుతుంది. దీని ప్రకారం 1,000 కిలోమీటర్ల ఏసీ ప్రయాణానికి రూ. 20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరికి ఊరట?
రైల్వే శాఖ రోజువారీ ప్రయాణికులపై ఎలాంటి భారం వేయడం లేదు. అంటే ముంబై లోకల్, హైదరాబాద్ లోకల్, కోల్‌కతా సబర్బన్ వంటి నగరాల్లో తిరిగే సబర్బన్ రైళ్ల ఛార్జీలలో ఎటువంటి మార్పు లేదు. ఉద్యోగ, వ్యాపార, విద్యా అవసరాల కోసం నెలవారీ పాస్‌లపై ఆధారపడే లక్షలాది మంది ప్రయాణికులపై కూడా ఎలాంటి భారం ఉండదు. వారి ఛార్జీలు యథాతథంగా కొనసాగుతాయి.



Click it and Unblock the Notifications
