Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త, పెద్ద మనసు చాటుకున్న బీహార్ వ్యక్తి
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న వారిని అంతమొందిస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరితో లైంగిక సంబంధం పెట్టుకోవడం, ఆ విషయం తెలుసుకున్న జీవిత భాగస్వామిని అడ్డుగా ఉన్నారని వారిని చంపుతున్నట్ల ఘటనలు వార్తల్లో వస్తూనే ఉన్నాయి. వివాహేతర సంబంధాలు ఇద్దరు వ్యక్తులతో పాటు ఇరు కుటుంబాలను విషాదంలో పడేస్తున్నాయి. ఒకరి ఒకరు చంపడం, తర్వాత జైలు పాలవ్వడంతో పుట్టిన పిల్లలు అనాథలుగా మారుతున్నారు.

అయితే బీహార్ లో తాజాగా ఓ వివాహేతర సంబంధం వెలుగు చూసింది. కానీ మిగతా కేసుల్లో జరిగినట్లుగా అక్కడ ఒకరిని ఒకరు చంపుకోవడం, నరుక్కోవడం, జైలుపాలవ్వడం లాంటివి ఏమీ లేవు. అందుకే ఆ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అందరు భర్తల్లా కాకుండా ఆ వ్యక్తి పూర్తి భిన్నంగా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఆ ఘటన గురించి పూర్తి వివరాలు ఏంటంటే..
బీహార్ లోని నవాడ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళకు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వివాహం జరిగింది. కొన్నాళ్లు దంపతుల మధ్య సాన్నిహిత్యం బాగానే ఉంది. ఆ తర్వాత ఆ మహిళకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. వారి పరిచయం కాస్త పెరిగి పెద్దదై వివాహేతర సంబంధానికి దారి తీసింది. భార్య తీరులో క్రమంగా మార్పు రావడం మొదలైంది. భర్తను మొత్తానికే దూరం పెడుతూ వచ్చింది. ఈ మార్పును గమనించిన భర్త తన పనుల బిజీ వల్ల పట్టించుకోలేదు. ఓ రోజు ఎప్పట్లాగే ఆమె భర్త పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. వెంటనే ఆమె తన ప్రియుడి వద్దకు వెళ్లింది. ఆమె మరొకరి ఇంటికి వెళ్లడం చూసిన స్థానికులు, బంధువులు.. వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు వారిద్దరి కట్టేసి తీవ్రంగా కొట్టారు.
అనంతరం ఊరు ఊరంతా వారిని కట్టేసిన ప్రాంతం వద్ద జమయ్యారు. గ్రామ పెద్దలు కూడా వచ్చారు. ఆ మహిళ, తన ప్రియుడి మధ్య ఉన్న వివాహేతర సంబంధం వల్ల గ్రామంలో ఇతర వ్యక్తులు పాడవుతారని అంతా ఓ తీర్మానానికి వచ్చారు. దానికి పరిష్కారంగా వారిద్దరినీ ఊరి నుంచి బహిష్కరిస్తేనే మంచిదని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా నడుస్తుండగానే.. అంతలోనే ఆ మహిళ భర్త పని నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు.
స్థానికులు, ఇరుగుపొరుగు వారు, బంధువులు తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయాన్ని అతడికి చెప్పారు. అదంతా విన్న ఆ వ్యక్తి ఏమాత్రం కోపగించుకోలేదు, ఆవేశానికి గురికాలేదు, అతని ఎప్పట్లాగే ఏమీ జరగనట్లుగానే చాలా ప్రశాంతంగా ఉన్నాడు. తన భార్య తనను మోసం చేసిందని కూడా తనపై కోపగించుకోలేదు. గ్రామస్థులు, పెద్దలు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని విన్న ఆ వ్యక్తి.. తను ఓ నిర్ణయం తీసుకున్నాడు.
వారిద్దరకీ దగ్గరుండి పెళ్లి జరిపించాడు. స్థానికంగా ఉన్న ఓ గుడి వద్దకు వారిద్దరినీ తీసుకెళ్లాడు. గుడి బయటే నిలబడి వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. ఆ వ్యక్తి చేసిన పనికి అక్కడ ఉన్న వారంతా ఖంగు తిన్నారు. ఇదెక్కడి చోద్యం అంటూ గుసగుసలాడుకున్నారు.



Click it and Unblock the Notifications