Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఫస్ట్ నైట్ రోజు పెళ్లికొడుకుకి షాక్..!!
మాంగల్యం తంతునానేనాతో వివాహ క్రతువు జరిగింది. ఆ తరువాత మొదటి రాత్రి కోసం కొత్త పెళ్లికొడుకు ఎదురుచూశాడు. ఈ కార్యక్రమానికి మూడు రోజుల తర్వాత ముహూర్తం పెట్టారు. ఇక ఆ రోజు రూమ్ లో కూర్చొని భార్య రాక కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఎంతసేపటికీ అతని భార్య రాలేదు. నిమిషాలు కాస్త గంటలయ్యాయ్, ఆయినా భార్య రాలేదు. చివరకు బయటకు వచ్చి ఏం జరిగిందని చూసాడు. తన భార్య కోసం వెతికాడు, ఎక్కడా కనిపించలేదు. ఇక లాభం లేదని ఇంట్లో వాళ్లకు చెప్పాడు. వారంతా కూడా కలిసి వెతికారు అయినా ఫలితం లేకుండా పోయింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇంకాసేపటికి వరుడి కుటుంబసభ్యులు, బంధువులు మరో విషయాన్ని గమనించారు.

అమ్మాయి మాత్రమే మిస్ కాలేదని ఇంట్లో ఉండాల్సిన బంగారు నగలు డబ్బులు సైతం అయ్యాయని తెలుసుకున్నారు. అమ్మాయి జంప్ అని ఫిక్స్ అయ్యారు. వరుడు, అతని కుటుంబ సభ్యులు నేరుగా వధువు తల్లితండ్రుల గ్రామానికి వెళ్లారు. ఇంట్లో వారిని నిలదీసి అడిగారు. తమకు ఏమీ తెలియదని తమ కూతురు ఇంటికి రాలేదని చెప్పారు. చివరకు ఆమె గురించి పూర్తిగా ఆరా తీశాడు వరుడు ఈ క్రమంలోనే కొత్త పెళ్లికొడుక్కి ఊహించని షాక్ తగిలింది.
తన భార్య మొదటి రాత్రి రోజే ప్రియుడితో వెళ్లిపోయిందని తెలుసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ అమేథిలో జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఈ గ్రామానికి చెందిన యువకుడికి పొరుగు గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. పెళ్లయ్యాక మూడు రోజులు బాగానే ఉంది. పంతులుని అడిగి కుటుంబ సభ్యులు జూలై 24 వ తేదీన మొదటి రాత్రికి ముహూర్తం పెట్టించారు. అదే రోజు రాత్రి అమ్మాయి తన ప్రియుడితో పారిపోయింది. అంతేకాదు వరుడు ఇంట్లో ఉన్న నగలు, డబ్బును కూడా ఎత్తుకెళ్లాడు. సంచలనంగా మారింది. చివరకు అమ్మాయి ప్రియుడి ఇంటికి కూడా వెళ్లాడు. కానీ వారు అక్కడ లేరు ఎటో పారిపోయారని నిర్ధారించుకున్నారు. చివరకు వరుడు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. తన భార్యతో పాటు ఆమె ప్రియుడిపై కేసు పెట్టాడు. ఆమెకు ప్రియుడు ఉన్నాడని ముందే చెప్తే పెళ్లి చేసుకునేవాడిని కాదని తనను మోసం చేసి డబ్బు, బంగారం, నగలు ఎత్తుకెళ్లారని ఆరోపించాడు.



Click it and Unblock the Notifications