Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం వివాహేతర సంబంధానికి దారి తీసే కారణాలేంటో తెలుసా?
వివాహంలో బంధంలో ఉన్నప్పుడు వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధం ఎందుకు పెట్టుకుంటారో చాణక్యుడు కొన్ని కారణాలు చెప్పారు. భర్త మరో మహిళతో, భార్య మరో పురుషుడితో ఎందుకు సంబంధం పెట్టుకుంటారో చెప్పారు చాణక్యుడు.
చాణక్యుడు గొప్ప జ్ఞాని. గొప్ప పండితుడు. నీతి శాస్త్రంలో, అర్థశాస్త్రంలో ఆయన చేసిన రచనలు ఇప్పటికీ అనుసరణీయమే. చాణక్య నీతి శాస్త్రంలో కౌటిల్యుడు మతం, పని, మోక్షం, కుటుంబం, సంబంధాలు, గౌరవం, సమాజం, దేశం, ప్రపంచం ఇలా ఎన్నో అంశాల గురించి అనేక ఇతర విషయాల గురించి వివరించారు. ఆయన ఆకాలంలో చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికీ పాటించదగినవే కావడం విశేషం.

చాణక్యుడు భార్యాభర్తల మధ్య సంబంధం గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పారు. దంపతుల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి, ఎలాంటి అన్యోన్యత ఉంటే ఆ బంధం కలకాలం ఉంటుందో చాణక్యుడు వివరంగా చెప్పారు. ఆడ, మగ అనే తేడా లేకుండా మరొకరి పట్ల ఆకర్షితులవ్వడం సాధారణ విషయమే. అది ఏమాత్రం తప్పు కాదు. ఆకర్షణ అనేది ఒక అంతర్గత మానవ లక్షణమని చాణక్యుడు చెప్పారు.
వివాహంలో బంధంలో ఉన్నప్పుడు వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధం ఎందుకు పెట్టుకుంటారో చాణక్యుడు కొన్ని కారణాలు చెప్పారు. భర్త మరో మహిళతో, భార్య మరో పురుషుడితో ఎందుకు సంబంధం పెట్టుకుంటారో చెప్పారు చాణక్యుడు.

బాల్య వివాహం:
వివాహేతర సంబంధాలకు దారితీసే కారణాలలో ఒకటి బాల్య వివాహమని చాణక్యుడు చెప్పాడు. మొదటిది వివాహం అంటే ఏంటో కూడా తెలియని వయస్సులో వివాహం జరుగుతుంది. సంబంధం అంటే ఏంటో అర్థం తెలియని వయస్సులోనే వివాహ బంధంలోకి అడుగుపెడతారు.
కెరీర్‌లో కాలక్రమేణా పురోగమిస్తున్నప్పుడు భార్య, భర్త ఒకరికి ఒకరు సరిపోలడం లేదని అనిపిస్తుంది. దీని వల్ల ఇతర వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతారు. ఆ ఆకర్షణ కాస్త వివాహేతర సంబంధానికి దారి తీస్తుందని చాణక్య నీతి.

శృంగారంలో అసంతృప్తి:
దాంపత్య బంధంలో అత్యంత కీలకమైనది శృంగారం. భార్యభర్తల మధ్య మంచి సాన్నిహిత్య ఉంటే ఆ బంధం కలకాలం సాగుతుంది. పడక గదిలో ఎంత సంతృప్తిగా ఉంటారన్నదానిపై బంధం ఆధారపడి ఉంటుంది.
శృంగారంలో అసంతృప్తి ఆ బంధంలో బీటలు రావడానికి కారణం అవుతుంది. దంపతుల మధ్య ఒకరికొకరికి ఆకర్షణ ఉండాలి. శృంగారం అంటే ఆసక్తి ఉండాలి. అది లేకపోతే సంబంధంలో సమస్యలు వస్తాయి. భార్యకు భర్తపై, భర్తకు భార్యపై ఆకర్షణ లేకపోతే వారు ఇతర వ్యక్తుల్లో ఆ ఆకర్షణ కోసం వెతుకుతారు. అలా వివాహేతర సంబంధం మొదలవుతుంది.
శృంగార సంతృప్తి అంటే కేవలం శారీరక సంబంధమైనదే కాదు మానసికమైనది కూడా. మాటలతో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలని చాణక్యుడు సూచించాడు.

పరస్పర విశ్వాసం లేకపోవడం:
సంబంధంలో విశ్వాసం చాలా ముఖ్యం. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నమ్మకమున్న బంధం కలకాలం నిలబడగలుగుతుంది. విశ్వాసం లేని సంబంధం ఎప్పుడు తెగిపోతుందో చెప్పలేం. దంపతుల మధ్య నమ్మకం లేకపోవడం వివాహేతర సంబంధానికి దారి తీస్తుందని చాణక్యుడు చెప్పాడు.

నిరాశ:
జీవిత భాగస్వామితో బంధం గురించి ప్రతి ఒక్కరో ఎంతో ఆశిస్తారు. ఎన్నో కలలు కంటారు. కానీ వారి నుండి, ఆ సంబంధం నుండి ఆశించినవి దక్కకపోతే నిరాశకు గురవుతారు. వారి కోరికలను వేరొక వ్యక్తి నుండి పొందాలనుకుంటారు. అలా వివాహేతర సంబంధం కొనసాగిస్తారని చాణక్యుడు చెప్పాడు. భాగస్వామిలో నెలకొన్ని నిరాశను గుర్తించి దానిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తే కొన్ని రోజుల్లో నిరాశ నుండి బయటపడవచ్చని సూచించాడు చాణక్యుడు.



Click it and Unblock the Notifications
