Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
Chanakya Neeti : చాణక్యుడి ప్రకారం రాజుకన్నా శక్తిమంతులు ఎవరో తెలుసా..?
నిన్ను నువ్వు అదుపులో పెట్టుకుంటే ప్రపంచాన్ని కూడా అదుపులో పెట్టుకున్నట్టే. ప్రపంచంపైన పట్టు వుండి నీపైన నీకు పట్టులేకపోయినా ప్రపంచంతో గెలవలేరు. చాణక్యుడు ఈ విషయాన్ని బలంగా నమ్మాడు. ఇదే విషయాన్ని తన శిష్యులకు చెప్పాడు. దాన్నే ఇంద్రియ జయ అని అంటారు. ఇంద్రియాల మీద అదుపు వుండాలని చాణక్యుడు చెబుతారు.
ఆ ఇంద్రియాలేంటంటే.. కామం, క్రోదం, మదం, మనం, హర్షం.కామం అంటే బలమైన కోరిక అధిక వ్యామోహం. కొంతమంది నాయకులకు అధికారం అధిక వ్యామోహాన్ని కలిగిస్తుంది. వారిలో వున్న ఈ లక్షణం వారిలోని మంచితనాన్ని చంపివేస్తుంది. ఇది వారిని ఒక వలలోకి నెట్టివేస్తుంది. దీని పట్ల జాగ్రత్తగా వుండాలని చాణక్యుడు చెబుతాడు.
అదే మంచి నాయకుడిని ఎదగనీయకుండా ఆపేది క్రోదం. ఈ క్రోదం వారి అదుపులో కూడా వుండదు. తరువాత వచ్చేది లోభం, అంటే అత్యాశ. ఈ అత్యాశ వెంట పరిగెత్తితే కూడా తీవ్రనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇలా వుంటే తన స్వార్ధం కోసమే ఆలోచిస్తాడు.

తరువాత గర్వం. మనిషికి ఆత్మగౌరవం వుండాలి కానీ గర్వం వుండకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. అందరికంటే తానే గొప్ప అనుకున్నవారు జీవితంలో పైకి రాలేరు, మంచి నాయకుడిగా అయ్యేందుకు ఆస్కారం లేదని చాణక్యుడు అంటాడు.
ఇక మదం. ఈ మద లక్షణం ఎవ్వరి మాట వినకుండా చేస్తుంది. తమకు మాత్రమే అన్ని తెలుసు అనే భావనను వారిలో కలిగిస్తుంది. మదంతో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా నష్టపోతారు. ఒక వేల నష్టపోయినా కూడా తాము చేసిందే రైట్ అనే నిర్ణయానికి వస్తారు.
హర్షం లక్షణంతో కూడా జాగ్రత్తగా వుండాలి. ఎక్కువ కోసం, ఎక్కువ సంతోషం, ఈ లక్షణాలున్న సమయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటాడు.
ఒక రాజే అన్నీ చేయగలుతాడని మనమనుకుంటాం గానీ చాణక్యుడు దీనికి వ్యతిరేకం. రాజను నడిపించే రాజు వెనక నుండి శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునేవారు కూడా వుంటారని చాణక్యుడు చెబుతాడు. ఒక రాజుకు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో గురువులు ఆదుకుంటారు. కాబట్టి రాజుకు గురువు చాలా అవసరం. తరువాత సలహాదారులు.. ఒక నాయకుడు ఎదగాలంటే సలహాదారులు చాలా అవసరం. ఆ తరువాత వచ్చేది స్నేహితులు.. ఎదగాలంటే మంచి సలహాలు ఇచ్చే స్నేహితులు కూడా చాలా ముఖ్యం.
ఒక రాజు శక్తివంతంగా వుంటే ఆ రాజ్యంలోని మంత్రులు ప్రజలు శక్తివంతంగా వుంటారు. అదే సోమరిగా వుంటే రాజ్యంలోని పనులు కూడా అలాగే వుంటాయని చాణక్యుడు చెబుతున్నారు.
చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. మౌర్య రాజ్యంలో సలహాదారుడిగా వున్న చాణక్యుడు యుద్ధంలో ఎలా గెలవాలో రాజులకు సలహా ఇచ్చాడు. అలా అనేక రాజ్యాలు గెలవడానికి చాణక్యుడు పరోక్షంగా కారణమయ్యాడు. చాణక్యుడి ప్రకారం ఎంత పెద్ద శత్రువుకైనా ఒక బలహీనత వుంటుంది. ఆ బలహీనతపై ఆచీ తూచీ సమయం తీసుకొని దెబ్బ కొడితే ఖచ్ఛితంగా విజయం సాధిస్తారు.
మన పోటాదారులను ఎట్టి పరిస్థితుల్లో అలాగే వదిలివేయొద్దని చాణక్యుడు చెబుతున్నాడు. అలా వదిలివేయడం వల్ల మనమే నష్టపోతామని చెబుతాడు. సమయం కోసం వేచి చూడాలని అంటాడు.



Click it and Unblock the Notifications