Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఎంత తెలివైన వారైనా తెలియకుండానే చేసే 4 తప్పులు..
వందల ఏళ్ల క్రితం ఆచార్య చాణక్యడు చెప్పిన మాటలు నేటికీ ఆచరణీయమైనవి. ఆయన మాటలను అమృత వాక్యాలుగా భావించి పాటించేటోళ్లు నేటికీ లక్షల మంది ఉంటారు. చాణక్యుడు రచించిన చాణక్య నీతి శాస్త్రం నేటికీ మానవాళికి ఒక దిక్సూచిలా పనిచేస్తోంది.
అయితే చాణక్యుడి ప్రకారం.. కేవలం తెలివితేటలు ఉంటే సరిపోదు, వాటిని ఎలా ఉపయోగించాలో కూడా తెలియాలి. అత్యంత జ్ఞానవంతులు, తెలివైన వారు సైతం తమ జీవితంలో కొన్ని పొరపాట్లు చేస్తారని, వాటిని సకాలంలో గుర్తించి సరిదిద్దుకోకపోతే జీవితం అంధకారమవుతుందని చాణక్యుడు హెచ్చరించారు. ఆ నాలుగు ప్రధాన తప్పులు ఏమిటో ఇక్కడ చూడండి.

సమయాన్ని తేలికగా తీసుకోవడం
చాణక్యుడి దృష్టిలో ఈ ప్రపంచంలో కాలం కంటే విలువైన సంపద మరొకటి లేదు. ఇది తెలివైన వారికి తెలిసినా, తమకున్న ఆత్మవిశ్వాసంతో తరచుగా పనులను వాయిదా వేస్తుంటారు. నాకు సామర్థ్యం ఉంది కదా.. రేపు చేయవచ్చులే అనే నిర్లక్ష్యం వారిని దెబ్బతీస్తుంది.
ఈ వాయిదా వేసే అలవాటు మెల్లగా ఒక వ్యసనంగా మారి చేతిదాకా వచ్చిన అద్భుతమైన అవకాశాలను దూరం చేస్తుంది. పనిని చివరి నిమిషం వరకు నెట్టడం వల్ల ఒత్తిడి పెరిగి, ఫలితం నాసిరకంగా మారుతుంది. గడిచిన కాలం తిరిగి రాదు అన్న సత్యాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే, విజయానికి అంత దగ్గరవుతారు.
తప్పుడు వ్యక్తులను గుడ్డిగా నమ్మడం
తెలివైన వారిని కూడా సులభంగా బోల్తా కొట్టించేవి రెండే రెండు.. ఒకటి పొగడ్త, రెండు మాయమాటలు. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి చేసే అతిపెద్ద తప్పు భావోద్వేగాలకు లొంగి అర్హత లేని వారిని నమ్మడం. ఎదుటివారి స్వభావం, నడవడిక పూర్తిగా తెలియకుండానే వారి తీపి మాటలకు పడిపోయి గుడ్డిగా నమ్మేస్తారు.
పాముకు పాలు పోసి పెంచితే అది కాటు వేయక మానదు. అలాగే తప్పుడు వ్యక్తులను నమ్మడం అంటే మన చేతులతో మనమే నిప్పును తాకడం లాంటిది. ఇది భవిష్యత్తులో తీవ్రమైన మోసానికి, అవమానానికి దారితీస్తుంది.
భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం
కోపం, మితిమీరిన ఆనందం, దురాశ లేదా విచారం.. ఇవి మనిషి ఆలోచనా శక్తిని, విచక్షణను నాశనం చేస్తాయి. తెలివైన వారు సైతం భావోద్వేగాల ఉధృతిలో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.
చాణక్యుడు చెప్పినట్లు భావోద్వేగాలు నీటి బుడగ లాంటివి, అవి తాత్కాలికం. కానీ ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు మాత్రం జీవితకాలం వెంటాడుతాయి. అందుకే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మనసును, మెదడును ప్రశాంతంగా ఉంచుకోవాలి. స్థితప్రజ్ఞతతో తీసుకున్న నిర్ణయాలే సత్ఫలితాలను ఇస్తాయి.
అహంకారంతో లోపాలను కప్పిపుచ్చుకోవడం
నేను తెలివైన వాడిని, నాలో లోపాలు ఉండవు అనే అపోహ చాలామందిలో ఉంటుంది. తమ బలహీనతలను బయటపెడితే ఇతరులు చులకన చేస్తారేమోనన్న భయంతో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు.
చాణక్యుడి ప్రకారం నిజమైన తెలివైన వాడు తన లోపాలను అంగీకరించి, వాటిని సరిదిద్దుకుంటాడు. తప్పులను దాచడం ఆత్మవంచనతో సమానం.



Click it and Unblock the Notifications