Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Chanakya Niti: కాలం కలిసిరాక సమస్యలు సతమతం చేస్తున్నాయా? ఇలా చేయండి
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు.
సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం ఉన్నట్లుగా.. కష్టనష్టాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటాయని చాణక్యుడు సూచించాడు. కష్టాలను ధైర్యంగా, స్థిరంగా ఎదుర్కొని ముందడుగు వేసినప్పుడే విజయం వరిస్తుందని చెప్పాడు.
కాలం కలిసిరాక సమస్యలు సతమతం చేస్తున్నాయని కుమిలిపోవద్దని, కుంగిపోవద్దని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. రేపు ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదని, నిన్నటి గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదని, వర్తమానంలో మనం ఏం చేయాలన్నదానిపైనే దృష్టి సారించాలని సూచించాడు.
కష్టసమయంలో ఓపికగా ఉండాలని, అలాగే మదిలో కొన్ని విషయాలు ఉంచుకోవాలని, వాటి ద్వారా కష్టాల నుండి బయటపడవచ్చని చాణక్యుడు చెప్పాడు.
విజ్ఞత:
విషమపరిస్థితుల నుండి మనల్ని కాపాడేది విజ్ఞత, విద్య, జ్ఞానం మాత్రమేనని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. జ్ఞానం అభివృద్ధికి దారితీస్తుందన్నాడు. దీని కోసం, విపత్తు వచ్చినప్పుడు తెలివిగా వ్యవహరించడం నేర్చుకోవాలని చెప్పాడు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించాడు. దాని వల్ల చేసిన పని పాడైపోతుందని, ఎప్పుడు ఎలా వ్యవహరించాలో విజ్ఞతతో ఆలోచించాలని చెప్పాడు.
స్నేహం:
స్నేహం చాలా విలువైనదని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. అంతటి విలువైన స్నేహాన్ని ప్రతి ఒక్కరి వద్ద నుండి ఆశించవద్దని చెప్పాడు చాణక్యుడు. స్నేహితులు పదుల సంఖ్యలో లేకపోయినా, ఉన్నది కొందరే అయినా వారిని పూర్తిగా నమ్మేలా ఉండాలని చెప్పాడు. కష్టసమయంలో నిజమైన స్నేహితులు కచ్చితంగా మద్దతుగా నిలుస్తారని చెప్పాడు చాణక్యుడు.
ముక్కు సూటిగా..:
ఈకాలంలో ముక్కు సూటిగా వ్యవహరించే వారికి, మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారికి సమస్యలు తప్పవని చెప్పాడు చాణక్యుడు. నిర్మొహమాటంగా మనసులో ఏది ఉంటే అది మాట్లాడే వారు ఇతరుల పట్ల చెడ్డవారిగా పరిగణించబడతారని సూచించాడు. అందుకే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని బట్టే మనం మాట్లాడాలని చెప్పాడు.
డబ్బు:
ఏ సమస్యకైనా డబ్బే పరిష్కారంగా కనిపిస్తున్న రోజులివి. జీవించడానికి డబ్బు చాలా అవసరం. జీవితంలో అవసరాలు తీరాలన్నా, సౌకర్యాలు కావాలన్నా డబ్బు చాలు ముఖ్యమని చెప్పాడు చాణక్యుడు. డబ్బు సంపాదన కోసం ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రమించాల్సిందేనన్నాడు. డబ్బు కోసం కష్టపడటం తప్పేం కాదని, తప్పుడు మార్గంలో సంపాదించడం తప్పు అని చెప్పాడు ఆచార్యుడు.
సంతృప్తి:
జీవితంలో సంతృప్తి పడటం చాలా అవసరమని చాణక్యుడు బోధించాడు. మోహం, క్రోధము, దురాశల వల్ల మనిషి దుఃఖాన్ని పొందుతాడని.. అందుకే ప్రతి విషయంలో ఆత్మ సంతృప్తిగా ఉండటం అలవాటు చేసుకోవాలని చెప్పాడు చాణక్యుడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications