Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Chanakya Niti: ప్రతి వ్యక్తి వీటిని ఎప్పుడూ వెంటే తీసుకెళ్లాలన్న చాణక్యుడు
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు. కొన్నింటిని ఎప్పుడూ వెంటే ఉంచుకోవాలని, ఎక్కడికి వెళ్లినా వాటిని తీసుకెళ్లాలని చాణక్యుడు చెప్పాడు.
గాయత్రీ మంత్రం:
ఆచార్య చాణక్యుడు గాయత్రీ మంత్రాన్ని అత్యంత శక్తివంతమైన మంత్రంగా పేర్కొన్నాడు. గాయత్రీ మాతను ఆరాధిస్తూ ఆ మంత్రాన్ని జపిస్తే అంతా మంచే జరుగుతుందని సూచించాడు చాణక్యుడు. గాయత్రీ దేవిని వేదమాతగా పేర్కొన్నాడు.
ఆ శక్తిస్వరూపిణి నుండే వేదాలు ఉద్భవించాయని చెప్పాడు. గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల సానుకూల శక్తి చుట్టూ చేరుతుందని, దీని వల్ల తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తామని సూచించాడు ఆచార్య చాణక్యుడు
నీరు, ఆహారం:
మనిషి జీవించడానికి నీరు, ఆహారం చాలా ముఖ్యం. అందులో ఏ ఒక్కటి లేకపోయినా జీవించడం సాధ్యం కాదు. వజ్రవైడుర్యాలు, బంగారంతో పోలిస్తే నీటికి, ఆహారానికే విలువ ఎక్కువ. ఈ రెండింటి ముందు బంగారం, వజ్రాలు, రత్నాలు, ముత్యాలు అన్నీ రాళ్లలాంటివని చెప్పాడు చాణక్యుడు. నీరు లేకుండా మానవ మనుగడ సాధ్యం కాదని, పోషణ కోసం ఆహారం కావాల్సిందేనని చెప్పాడు చాణక్యుడు.
మధురమైన మాటలు:
నీరు, ఆహారం వ్యక్తి జీవితాన్ని కాపాడతాయి. ఇవి శరీరానికి పోషణ అందిస్తాయి. శక్తిని, తెలివిని ఇస్తాయి. అదే విధంగా, ఒక వ్యక్తి తన శత్రువులను మధురమైన మాటలతో గెలవాలనుకుంటే, అతను వారిని తన స్నేహితులుగా చేసుకోవాలని చాణక్యుడు చెప్పాడు.
మాట రత్నం కంటే విలువైనదని చాణక్యుడు చెప్పాడు. మధురమైన మాటలతో శత్రువును కూడా గెలవవచ్చని చెప్పాడు ఆచార్యుడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications