Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Chanakya Niti: జీవితంలో వీటికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆచార్య చాణక్యుడు
జీవితంలో కొన్ని విషయాలకు, అంశాలకు ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చాణక్యుడు చెప్పాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, పండితుడు, వ్యూహకర్త, మార్గదర్శకుడు. రాజనీతి, ఆర్థిక శాస్త్రం, నీతి శాస్త్రం, ఆధ్యాత్మికత సహా అనేక అంశాలపై ఎన్నో సూచనలు చేశాడు. ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథంలో శాంతియుతంగా జీవించడానికి ఎన్నో విధానాలను పేర్కొన్నాడు.
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్ర గ్రంథంలో జీవితానికి సంబంధించిన అనేక అంశాలను వివరంగా చెప్పాడు. నీతి శాస్త్రంలో వివరించిన విధానాలు నేటికీ ఆచరణీయమే. ఈ వ్యూహాలను అనుసరించడం ద్వారా, ప్రజలు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు పురోగతిని సాధించవచ్చు. చాణక్యుడి విధానాలు పాటించడం ద్వారా ఉత్తమంగా జీవించవచ్చు.

జీవితంలో కొన్ని విషయాలకు, అంశాలకు ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చాణక్యుడు చెప్పాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృద్ధాప్యం వరకు వేచిచూడొద్దు:
మని,ి తన మంచి కోసమే కాకుండా సమాజ ప్రయోజనాల కోసం కూడా కొన్ని పనులు చేయాలని చాణక్యుడు సూచించాడు. ఈ పనులు చేయడానికి వృద్ధాప్యం వరకు వేచి ఉండొద్దని ఆచార్యుడు సలహా ఇచ్చాడు. ఎవరి మరణం ఎప్పుడు రాసి ఉందో తెలియదు కాబట్టి, జీవించి ఉన్నప్పుడు, సమయం చేతిలో ఉన్నప్పుడే సకార్యాలు చేయాలని ఆచార్య చాణక్యుడు చెప్పుకొచ్చాడు. దీని వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని కౌటిల్యుడు సూచించాడు.
ఆధ్యాత్మిక కార్యకలాపాలు:
దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక కార్యకలాపాలు, తీర్థయాత్రలు చేయడానికి వయస్సుతో సంబంధం లేదని చాణక్యుడు చెప్పాడు. డబ్బు, సమయం చేతిలో ఉన్నప్పుడు ఈ పనులు చేయాలని, వాటి కోసం వృద్ధాప్యం వరకు వేచి ఉండొద్దని చాణక్యుడు సూచించాడు.
విరాళాలు, దానధర్మాలు, సత్యార్యాలు చేయడానికి వేచి ఉండొదన్నాడు. వీటి వల్ల పుణ్యం దక్కడంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదాలు లభిస్తాయని చెప్పాడు కౌటిల్యుడు.
సామాజిక సేవ:
మనిషి సమాజ జీవి. సమాజంలో బతికే వ్యక్తులు ఆ సమాజానికి ఏదైనా పనికొచ్చే పని చేయాలని చెప్పాడు చాణక్యుడు. సమాజ హితం కోసం, శ్రేయస్సు కోసం మంచి పనులు చేయడానికి సిగ్గు ఎప్పుడూ భావించకూడదని ఆచార్యుడు సూచించాడు. సామాజిక సేవా కార్యకలాపాల్లో పాలు పంచుకోవడానికి వయస్సుఎప్పుడూ అడ్డు కాదని చాణక్యుడు చెప్పాడు.
వర్తమానం మాత్రమే మనది:
ఏ పనిని రేపటికి వాయిదా వేయకూడదని చాణక్యుడు సూచించాడు. రేపు అనేది మన చేతిలో ఉండదు. వర్తమానం ఒక్కటే మన చెప్పుచేతుల్లో ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుతం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాణక్యుడు చెప్పాడు.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు ఉన్న ప్రశాంతంత మరు నిమిషంలో మాయమైపోవచ్చు. అందుకే ప్రస్తుతం క్షణాలను ఆస్వాదించాలని చెప్పాడు చాణక్యుడు.



Click it and Unblock the Notifications