Latest Updates
-
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
Chandra Grahan 2025: గ్రహణ సమయం,పాటించాల్సిన నియమాలు, తినకూడనివి,పరిహారాలు
చంద్రగ్రహణం పేరు వినగానే చాలామందిలో చాలా రకాల సందేహాలు ఉంటాయి. చంద్రగ్రహణం రోజు ఆహార నియమాలు ఎలా ఉండాలి, ఆ రోజున ఏం తినాలి, ఏం తినకూడదు, స్నానం ఎప్పుడు చేయాలి, శాస్త్రాలు ఏం చెబుతున్నాయి వంటి అనేక ప్రశ్నలు మనసులో తలెత్తుతుంటాయి. వాస్తవానికి ఖగోళంలో జరిగే అద్భుతాలలో ఒకటైన చంద్ర గ్రహణానికి మన సనాతన ధర్మంలో ఎంతో ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రాముఖ్యత ఉంది.
2025 సెప్టెంబర్ 7వ తేదీన సంభవించబోయే సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా, మన ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక శ్రేయస్సును కాపాడుకోవడానికి పండితులు కొన్ని నియమాలను సూచించారు.

చంద్రగ్రహణం అంటే ఏంటీ
చంద్రగ్రహణం అనేది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో వచ్చినప్పుడు సంభవించే ఒక ఖగోళ సంఘటన. ఈ అమరికలో భూమి సూర్యుడికి, చంద్రుడికి మధ్య వస్తుంది, సూర్యకాంతి చంద్రుడిపై పడకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల చంద్రుడు చీకటిగా కనబడతాడు. చంద్రగ్రహణాలు ప్రధానంగా మూడు రకాలు. సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణంలో చంద్రుడు పూర్తిగా భూమి చీకటి నీడలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు లేదా నారింజ రంగులో కనబడతాడు, దీనిని బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఇది భూమి వాతావరణం ద్వారా సూర్యకాంతి వక్రీకరించబడి చంద్రుడిపై పడటం వల్ల జరుగుతుంది.
గ్రహణం సమయాలు
మనదేశంలో గ్రహణం ప్రారంభం: సెప్టెంబర్ 7 రాత్రి 8:58 గంటలకు.
బ్లడ్ మూన్ (పూర్తి ఎరుపు రంగు): రాత్రి 11:00 నుండి 12:22 వరకు.
గ్రహణం ముగింపు: సెప్టెంబర్ 8, తెల్లవారుజామున 1:25 గంటలకు.
చంద్ర గ్రహణం రోజు తినకూడని ఆహారాలు
శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తులు ప్రబలంగా ఉంటాయి. ఈ సమయంలో భూమిపైకి వచ్చే కిరణాలు ఆహారాన్ని కలుషితం చేస్తాయని నమ్మకం. అందుకే గ్రహణానికి రెండు గంటల ముందు నుంచే భోజనం చేయడం ఆపేయాలి.
-గ్రహణ సమయంలో వండిన ఆహారంపై హానికరమైన సూక్ష్మక్రిములు త్వరగా ప్రభావం చూపుతాయి. కాబట్టి అన్నం, కూరలు వంటి పదార్థాలను తినకూడదు.
-మాంసాహారం, నూనె పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. గ్రహణ సమయంలో జీర్ణశక్తి మందగిస్తుంది కాబట్టి ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.
పాలు, పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిపై కూడా గ్రహణ ప్రభావం ఉంటుందని భావిస్తారు. వీటిని గ్రహణ సమయంలో తీసుకోకపోవడం మంచిది.
పరిష్కారం: ఆహార పదార్థాలపై గ్రహణ ప్రభావం పడకుండా ఉండటానికి వండిన ఆహారం, పాలు, పెరుగు, నీళ్లలో దర్భ గడ్డి లేదా తులసి ఆకులను వేస్తారు. వీటికి ప్రతికూల శక్తులను నిరోధించే శక్తి ఉందని నమ్మకం.

గ్రహణం రోజు పాటించాల్సిన జాగ్రత్తలు
-గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకూడదు. గ్రహణ కిరణాలు గర్భంలో ఉన్న శిశువుపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు. వారు ఈ సమయంలో ఎలాంటి వస్తువులను కత్తిరించడం, కుట్టడం వంటి పనులు చేయకూడదు.
-గ్రహణ సమయం మంత్ర జపానికి, ధ్యానానికి అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో మహా మృత్యుంజయ మంత్రం లేదా మీకు ఇష్టమైన దైవ నామాన్ని జపించడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
- గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారు. ఈ సమయంలో పూజలు, ఇతర శుభకార్యాలు నిషిద్ధం.
గ్రహణం తర్వాత చేయాల్సిన పరిహారాలు
గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతికూల ప్రభావాలను తొలగించుకోవడానికి పండితులు కొన్ని పరిహారాలు సూచించారు.
-గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేయడం తప్పనిసరి. ఇది గ్రహణ సమయంలో మన శరీరంపై చేరిన దోషాలను తొలగిస్తుంది.

-స్నానం చేసిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి, పూజా మందిరంలో దీపం వెలిగించి, దేవుడికి నైవేద్యం సమర్పించాలి.
-గ్రహణం తర్వాత పేదలకు లేదా బ్రాహ్మణులకు బియ్యం, పప్పులు, వస్త్రాలు వంటివి దానం చేయడం వల్ల గ్రహణ దోషాలు పరిహారమవుతాయి.
ఉపవాసం ఎందుకు?
గ్రహణ సమయంలో ఉపవాసం ఉండటం మంచిదని పండితులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మందగించడం వల్ల ఈ సమయంలో ఆహారం తీసుకుంటే అది సరిగ్గా జీర్ణం కాక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు మాత్రం పండ్లు లేదా పాలు వంటి తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications











