Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్‌లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
2024లో మరణించిన భారతీయ ప్రముఖులు వీరే.. ఎవరెవరు ఉన్నారంటే?
2024వ సంవత్సరం ఇండియాకు ఎంత కలిసి వచ్చిందో అంతే నష్టాలను తీసుకొచ్చింది. ఈ సంవత్సరంలో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు, ప్రముఖులు మృతి చెందారు. వ్యాపారులు, సంగీత విధ్వాంసులు, కళా రంగానికి చెందిన ప్రముఖులు చనిపోయారు. ఇంతకీ 2024లో చనిపోయిన ప్రముఖులు ఎవరు? వారి మృతికి కారణం ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
2024లో మరణించిన భారతీయ ప్రముఖులు
జాకీర్ హుస్సేన్
ప్రముఖ భారతీయ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ డిసెంబర్ 15, 2024న 73 సంవత్సరాల వయస్సులో శాన్ ఫ్రాన్సిస్కోలో మరణించారు. అతని మరణానికి కారణం ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (IPF), ఇది తీవ్రమైన శ్వాస సమస్యలకు దారితీసే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. హుస్సేన్ తన కెరీర్‌లో నాలుగు గ్రామీ అవార్డులను గెలుచుకున్నాడు.

రతన్ టాటా
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా అక్టోబర్ 9, 2024న 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయస్సు సంబంధిత సమస్యలు, రక్తపోటు నియంత్రణ కోసం అతను అక్టోబర్ 7, 2024న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేరాడు. అయితే రక్తపోటు అదుపులోకి రాకపోవడంతో పాటు దాని కారణంగా గుండెపోటు రావడంతో రతన్ టాటా మరణించాల్సి వచ్చింది. ఒక గొప్ప భారత పారిశ్రామిక వేత్తను కోల్పోవాల్సి వచ్చింది.
వికాస్ సేథి
ప్రముఖ టెలివిజన్ నటుడు వికాస్ సేథీ సెప్టెంబర్ 2024లో 48 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక ధూమపానం, ఒత్తిడి, మద్యపానం, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల గుండెపోటు వస్తుందని చెబుతారు.
రితురాజ్ సింగ్
బాలీవుడ్ ప్రముఖ టీవీ నటుడు రితురాజ్ సింగ్ ఫిబ్రవరి 20, 2024న మరణించారు. అతని వయస్సు 59. అతను కూడా గుండెపోటుతోనే మరణించడం జరిగింది. సింగ్ పనేగీ అబ్నీ బాద్, దియా ఔర్ బడి హమ్ వంటి భారతీయ టీవీ షోలలో ఆయన నటించి మెప్పించారు. వాటి ద్వారా ఆయన భారీగా ప్రాచుర్యం పొందారు.
పంకజ్ ఉదాస్
ప్రఖ్యాత గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కూడా 2024లో మరణించాడు. ఈయన 'చిట్టి ఆయీ హై' అనే పాటకు బాగా ప్రసిద్ధి చెందారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య కారణంగా ఫిబ్రవరి 2024లో మరణించారు. అతని వయస్సు 72. 2006లో, పంకజ్ ఉదాస్‌కు భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ లభించింది.
ఉస్తాద్ రషీద్ ఖాన్
సంగీత మాస్ట్రో ఉస్తాద్ రషీద్ ఖాన్ జనవరి 9, 2024 ప్రారంభంలో మరణించారు. అతను మరణించినప్పుడు అతని వయస్సు 55. కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ మరణించారు.
సుహాని భట్నాగర్
ప్రపంచ ప్రసిద్ధ చిత్రం దంగల్‌లో ప్రధాన పాత్ర పోషించిన యువ నటి సుహాని భట్నాగర్. ఈమె 16 ఫిబ్రవరి 2024న మరణించింది. అతని వయస్సు కేవలం 19 సంవత్సరాలే. నివేదికల ప్రకారం, ఆమె డెమటోమయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో మరణించారు.



Click it and Unblock the Notifications