Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి షాక్.. ఇకపై డబ్బులు పంపిస్తే కట్! నిజమేనా?
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత డిజిటల్ పేమెంట్స్‌ను భారీగా ప్రోత్సహించింది. మరీ ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తరువాత ఈ డిజిటల్ పేమెంట్స్ వినియోగం భారీగా పెరిగింది. ఎంతలా అంటే కూరగాయలు అమ్మేవారు కొన్ని కొన్ని సందర్భాల్లో భిక్షగాడు కూడా డిజిటల్ పేమెంట్స్ స్వీకరించేంత స్థాయికి వెళ్ళిపోయింది. అయితే UPI ద్వారా చెల్లింపులు చేస్తే ఇకపై ఛార్జీలు వసూలు చేస్తారని, 1.1% ఛార్జీలు కట్ అవుతాయని ఓ వార్త వైరల్ అవుతోంది. అందులో నిజమెంత ఉంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు వార్త ఏటంటే?
రెండు రోజులుగా సోషల్ మీడియాలో UPI పేమెంట్స్ గురించి ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. అదేటంటే 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎవరైతే UPI పేమెంట్స్ చేస్తారో వారి నుంచి చార్జీలు వసూలు చేస్తారని, వారు చేసే పేమెంట్‌లో 1.1% ఛార్జీలు వసూలు అవుతాయని చెబుతున్నారు. అది కూడా 2000 రూపాయలకు పైగా ఎవరైతే పేమెంట్స్ చేస్తారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని ఆ వార్త సారాంశం. అంటే 10000 రూపాయల పేమెంట్స్ చేస్తే మీకు 110 రూపాయల ఛార్జీలు అదనంగా కట్ అవుతాయన్నమాట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి.

ఇందులో నిజమెంత?
ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన PBI ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని స్పష్టం చేసింది. UPI పేమెంట్లకు కేంద్రం ఎలాంటి పన్ను లేదా చార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడించింది. ఉచితంగానే UPI పేమెంట్స్ చేసుకోవచ్చని, అది కూడా NCPI నిబంధనలకు లోబడి పేమెంట్స్ చేసుకోవచ్చని పేర్కొంది. దీని ప్రకారం 2000 రూపాయల కంటే అదనంగా ఎవరైతే పేమెంట్స్ చేస్తున్నారో వారికి ఎలాంటి చార్జీలు ఉండవని పేర్కొంది.
కానీ కేంద్రం PPI పేమెంట్లకు చార్జీలు వసూలు చేస్తోందని, ఈ విధానం 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచే అందుబాటులో ఉందని పేర్కొంది. ఈ PPI పేమెంట్ చేస్తేనే 1.1% ఛార్జీలు కట్ అవుతాయని, సాధారణ UPI పేమెంట్లకు కాదని మరోసారి స్పష్టం చేసింది. వినియోగదారులు UPI, PPI పేమెంట్ల మధ్య తేడాను అర్ధం చేసుకోకపోవడం వల్లే ఈ గందరగోళం తలెత్తిందని వెల్లడించింది.
UPI పేమెంట్లు చేసుకోవచ్చా?
సోషల్ మీడియాలో ఈ ప్రచారం తరువాత కొందరిలో UPI పేమెంట్లపై కొంత గందరగోళం ఏర్పడింది. తాము UPI చేయకూడదా అనే అనుమానం కలుగుతోంది. అలాంటి వారు నిర్భయంగా UPI పేమెంట్స్ చేసుకోవచ్చు. UPI పేమెంట్స్‌కు కేంద్రం కానీ NPCI కానీ ఎలాంటి ఎలాంటి చార్జీలను వసూలు చేయడం లేదు.



Click it and Unblock the Notifications