Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
Viral Videos : అమెజాన్ పార్సెల్‌లో తాచు పాము..చాక్లెట్ సిరప్‌లో చచ్చిన ఎలుక.. ఏ పార్సెల్‌లొ ఏమి వుందో..!
ఈ మధ్య డెలివరీ పార్సెల్‌లో వస్తున్న వాటిని చూసి చాలా మంది భయాందోళనకు గురౌతున్నారు. కొన్ని రోజుల క్రితం ముంబైలోని ఓ వ్యక్తి ఐస్‌క్రీంను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే ఆ ఐస్‌క్రీంలో తెగిన మనిషి వేలు కనిపించడం దేశంలో సంచలనం సృష్టించింది. ఈ వీడియో దేశంలోనే కాదు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అప్పుడు వైరల్‌గా మారింది. ఆ ఐస్‌క్రీంను చెందిన ఐస్‌క్రీం సంస్థ లైసెన్స్‌ను కూడా రద్దు చేసారు.

ఇప్పుడు ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే వున్నాయ్. ఈ సారి పార్సెల్ బాక్స్‌లో ఏకంగా తాచు పాము రావడం మరింత భయాన్ని సృష్టించింది. బెంగళూరులోని ఓ వ్యక్తి అమెజాన్ నుంచి ఎక్స్ బాక్స్ కంట్రోలర్‌ను ఆర్డర్ పెట్టాడు. వచ్చిన పార్సెల్ బాక్స్‌లో చిన్న తాచు పాము వుండడం చూసి ఒక్కసారిగా కస్టమర్ భయాందోనకు గురయ్యాడు. ఆ పాము గనుక కాటేసి వుంటే మరణించేవారు. బెంగళూరులోని సర్జాపూర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఆ చిన్న తాచు పాము టేప్‌కు అంటుకొని వుండడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఆ పాము బాక్స్ బయటకు వచ్చేసి ఇంట్లో వున్న ఎవరినైనా కాటేసి వుంటే పరిస్థితి దారుణంగా వుండేది.
ఈ ఘటనపై నెటిజెన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆన్‌లైన్ డెలివరీల్లో తమకు నమ్మకం పోతోందని కామెంటే చేస్తున్నారు. డెలివరీ బాయ్ కూడా సరిగ్గా స్పందించడం లేదని, డెలివరీకి ఇల్లు దూరంగా వుండడం వల్ల కస్టమర్లనే వచ్చి పికప్ చేసుకోమని కోరడం పరిస్థతి దారుణ స్థితిని తెలియజేస్తోందని అంటున్నారు. పాము రావడం వల్ల అమెజాన్ నుంచి కాదు అమెజాన్ ఫారెస్ట్ నుంచి ఆర్డర్ చేసుకొని వుంటాడని మరో యూజర్ చలోక్తి విసిరాడు.
పాము రావడంతో అమెజాన్ సంస్థ వెంటనే స్పందించింది. కస్టమర్ల డబ్బును తిరిగి ఇచ్చేసింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని దారుణాలు చూడవలసి వస్తోందోనని నెటిజెన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చాక్లెట్ సిరప్‌లో చచ్చిపోయిన ఎలుక
ఐస్‌క్రీంలో మనిషి వేలు వచ్చినట్టుగానే మళ్లీ హెర్షీ చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక కనిపించింది. ఒక కుటుంబం హెర్షీ చాక్లెట్ సిరప్‌ను తాగిన తరువాత వాళ్లకు అనుమానం వచ్చి మొత్తం సిరప్‌ను గ్లాసులో పోసి చూస్తే అందులో చనిపోయిన చిన్న ఎలుక బయట పడింది. ఇది చూసి వారు దీన్ని అప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ వారికి కంప్లెయింట్ చేశారు. ఇన్స్‌టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన వీడియోను కూడా అప్‌లోడ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్‌గా మారుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఏంటని నెటిజెన్లు అంటున్నారు.
ఈ చాక్లెట్ సిరప్ తాగిన ఇద్దరికి అనారోగ్యం బారిన పడ్డారు. ఒకరు కళ్లు తిరిగి పడ్డంతో వారిని ఆసుపత్రిలో చేర్చాారు. ప్రస్తుతం కుటుంబం అంతా బాగానే వున్నా, ఈ ఘటనపై వారు మాత్రమే కాకుండా దేశంలోని అందరూ భయాందోళన చెందుతున్నారు. ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేసుకుందామంటే భయమేస్తోందని అంటున్నారు. ఈ వీడియో వైరల్ కాగానే హార్షీ చాక్లెట్ సంస్థ వెంటనే స్పందించింది. ఇలాంటి ఘటనలు మళ్లీ ఎక్కడైనా జరిగితే వెంటనే కంప్లెయింట్ చేయాలని సదరు కన్జూమర్ కేర్ నంబర్ 11082163ను ఇచ్చారు.



Click it and Unblock the Notifications