Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
ఈ వ్యాధి సోకితే కళ్ళ నుంచి రక్తం కక్కి చచ్చిపోతారు.. ఇప్పటికే 15 మంది చనిపోయారు కూడా..!
ప్రపంచ దేశాలను మరో కొత్త వైరస్ వణికిస్తోంది. మార్గ్‌బర్గ్ అని పిలవబడే ఈ వైరస్ ప్రపంచ దేశాలను కునుకు లేకుండా చేస్తోంది. బ్లీడింగ్ ఐ వైరస్‌గా పెరుగున్న ఈ వ్యాధి కారణంగా సుమారు 17 దేశాలు తమ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఈ వ్యాధి సోకి సుమారు 15 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఈ వైరస్ ఏంటి? దీని లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ వైరస్ సోకితే చనిపోతామా అనే విషయాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మార్‌బర్గ్ వైరస్ అంటే ఏమిటి?
మార్‌బర్గ్ లేదా బ్లీడింగ్ ఐ అనే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. ఎబోలా ఫ్యామిలీకి చెందిన ఈ వైరస్ వైరల్ హిమారేజిక్ అనే జ్వరానికి దారి తీస్తుంది. దీని కారణంగా తీవమైన రక్తస్రావం, రక్తకణాలు దెబ్బతినడం జరుగుతుంది. దీంతో మనిషి ప్రాణాలు పోతాయి. ఈ వైరస్ జొనోటిక్ స్వభావం కలిగి ఉంటుంది. ఇది గబ్బిలాల నుంచి పుట్టుకొస్తుంది. మనిషి యొక్క లాలాజలం, రక్తం, మూత్రం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.

ఈ వైరస్ లక్షణాలు
ఈ వైరస్ లక్షణాలు ఎబోలా వైరస్ లక్షణాలను పోలి ఉంటాయి. ఈ వైరస్ సోకిన వారిలో విపరీతమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతునొప్పి, విరేచనాలు, దద్దుర్లు వంటి ఆరోగ్య సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి. కొన్ని కొన్ని సందర్భంగా ఈ వైరస్ తీవ్రమైన రక్తస్రావం, అవయవాల వైకల్యానికి దారి తీస్తుంది. దీని కారణంగా మనుషులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అనుకోకుండా బరువు తగ్గడం, కంటిలో నుంచి, ముక్కులో నుంచి, యోనిలో నుంచి రక్తం కారడం కూడా ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.
అలాగే కళ్ళు లోపలి వెళ్లినట్లు కనిపించడం, ముఖంలో కళ లేకపోవడం, ముఖం గుంజుకుపోవడం తీవ్రమైన బద్దం కూడా ఈ వ్యాధి లక్షణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంపాదించాలని సూచిస్తోంది.
చికిత్స ఉందా?
ఈ మార్‌బర్గ్ లేదా బ్లీడింగ్ ఐ వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి యాంటీ వైరల్ చికిత్స అందుబాటులో లేదు. రోగి పరిస్థితి, వైద్య అందించే తీరును బట్టి ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు నిర్ణయించబడుతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి మరణాల రేటు 24% నుంచి 88% వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. రీహైడ్రేషన్ వంటి కొన్ని టెక్నిక్స్ ఈ వ్యాధి సోకిన రోగులను కాపాడేందుకు ఉపయోగపడుతున్నాయి.
ఈ వైరస్‌కు చికిత్స, ఇంజక్షన్స్ కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి సోకిన వారిలో రక్తం ఉత్పత్తి అయ్యేందుకు, రోగ నిరోధక శక్తి పెంచేందుకు, వ్యాధిని నయం చేసేందుకు వివిధ రకాల కంపెనీలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. ఆలోపు ఈ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిందే.



Click it and Unblock the Notifications