Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ధనత్రయోదశి 2025: పూజకు సరైన సమయం? బంగారం,వెండి కొనుగోళ్లకు శుభ ఘడియలు ఎప్పుడు? పఠించాల్సిన మంత్రం
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ధనత్రయోదశి(ధన్ తేరాస్), దీపావళి ముఖ్యమైనవి. 5 రోజుల దీపావళి పండుగ సెలబ్రేషన్స్ ధనత్రయోదశితో అధికారికంగా ప్రారంభమవుతాయి. ధన్ అంటే ధనం, తేరస్ అనేది కార్తీక మాసంలో కృష్ణ పక్షంలో పదమూడవ రోజు(త్రయోదశి తిథి)ని సూచిస్తుంది. ధన్ తేరాస్ రోజున లక్ష్మీదేవి,కుబేరుడిని, ధన్వంతరిని పూజించడంతో పాటు బంగారం, వెండి, కొత్త వస్తువులు, స్థిర చరాస్థులు వంటివి కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఈ పవిత్రరోజున ఏది కొనుగోలు చేసిన 13 రెట్లు ఎక్కువ లాభం వస్తుంటదని, ఇంట్లోకి ఐశ్వర్యం, శ్రేయస్సు వస్తాయని పండితులు చెబుతుంటారు.
ధనత్రయోదశి పూజ సమయాలు
త్రయోదశి తిథి ప్రారంభం: అక్టోబర్ 18, 2025 మధ్యాహ్నం 12:18 గంటలకు.
త్రయోదశి తిథి ముగింపు: అక్టోబర్ 19, 2025 మధ్యాహ్నం 01:51 గంటలకు.
ప్రదోష కాలం: అక్టోబర్ 18, 2025 - సాయంత్రం 05:48 నుండి రాత్రి 08:19 వరకు.
వృషభ కాలం: అక్టోబర్ 18, 2025 - రాత్రి 07:15 నుండి రాత్రి 09:11 వరకు.
ధనత్రయోదశి పూజకు ఉత్తమ ముహూర్తం: అక్టోబర్ 18, 2025 రాత్రి 07:15 నుండి 08:19 గంటల మధ్య.

బంగారం, వెండి కొనడానికి శుభ సమయాలు
అక్టోబర్ 18 మధ్యాహ్నం 12:18 నుండి అక్టోబర్ 19 ఉదయం 06:24 వరకు కొనుగోళ్లకు అనుకూల సమయం. ఇందులో అత్యంత శుభప్రదమైన సమయాలు ఏవో ఇక్కడ చూడండి.
మధ్యాహ్న ముహూర్తం (చర, లాభ, అమృత): మధ్యాహ్నం 12:18 నుండి సాయంత్రం 04:23 వరకు
సాయంత్ర ముహూర్తం (లాభ): సాయంత్రం 05:48 నుండి రాత్రి 07:23 వరకు
రాత్రి ముహూర్తం (శుభ, అమృత, చర): రాత్రి 08:57 నుండి అర్ధరాత్రి 01:41 వరకు (అక్టోబర్ 19)
అక్టోబర్ 19, 2025 (ఆదివారం)
ఆదివారం(అక్టోబర్ 19) ఉదయం 06:24 నుండి మధ్యాహ్నం 01:51 వరకు (త్రయోదశి తిథి ముగిసే వరకు) కొనుగోళ్లకు అనుకూలం.
ఉదయం ముహూర్తం (చర, లాభ, అమృత): ఉదయం 07:50 నుండి మధ్యాహ్నం 12:06 వరకు.
మధ్యాహ్న ముహూర్తం (శుభ): మధ్యాహ్నం 01:31 నుండి 01:51 వరకు.

ధన్ తేరాస్ పూజా విధానం
పూజకు ముందు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. గంగాజలం లేదా పసుపు నీళ్లు చల్లి ఇంటిని పవిత్రం చేయాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు, బంతి పువ్వుల మాలలు కట్టాలి. ముంగిట అందమైన రంగవల్లులు తీర్చిదిద్దాలి. పూజ గదిలో లేదా ఇంటికి ఈశాన్య మూలలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలి. దానిపై ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి. పీఠం మీద బియ్యం పోసి, దానిపై కలశాన్ని ఉంచాలి. పసుపుతో చిన్న గణపతిని చేసి, పీఠంపై ఉంచి, అక్షతలు, పువ్వులతో పూజించి నమస్కరించాలి.
పీఠంపై లక్ష్మీదేవి, ధన్వంతరి, కుబేరుని విగ్రహాలను లేదా ఫోటోలను ఉంచాలి. లక్ష్మీదేవికి కుడివైపున గణపతిని, ఎడమవైపున కుబేరుడు, ధన్వంతరిని ఉంచాలి. దేవతలను మనస్సులో స్మరించుకోవాలి. విగ్రహాలకు పువ్వులను ఆసనంగా సమర్పించాలి. విగ్రహాలకు పంచామృతాలతో లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడవాలి. పత్తితో చేసిన వస్త్రాలను లేదా అక్షతలను సమర్పించాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పువ్వులతో దేవతలను అలంకరించాలి.అగరబత్తీలు లేదా ధూపం వెలిగించి చూపించాలి. నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించి చూపించాలి. సిద్ధం చేసుకున్న నైవేద్యాన్ని సమర్పించాలి.
తాంబూలం: తమలపాకులు, వక్కలు, పండు సమర్పించాలి.
మంత్ర పఠనం
పూజ సమయంలో ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః, ఓం కుబేరాయ నమః, ఓం ధన్వంతరయే నమః వంటి మంత్రాలను జపించాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, ధన్వంతరి స్తోత్రం పఠించడం చాలా శ్రేయస్కరం.
కొత్త వస్తువుల పూజ
ఈ రోజు కొన్న బంగారం, వెండి, లేదా కొత్త పాత్రలను పీఠం వద్ద ఉంచి వాటికి కూడా పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులతో పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ వస్తువులు వృద్ధి చెందుతాయని నమ్మకం.



Click it and Unblock the Notifications
