Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
తాజ్ మహల్ అసలు పేరేంటో తెలుసా!..ఎవ్వరికీ తెలియని నిజం ఇదే
ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ను ప్రేమకు చిహ్నంగా చెబుతుంటారు. మొఘల్ చక్రవర్తి షాజహన్ తన భార్య ముంతాజ్ జ్ణాపకార్థం దీనిని పాలరాయితో నిర్మించారు. ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు తాజ్ మహల్ ని సందర్శిస్తుంటారు. బెస్ట్ టూరిస్ట్ ప్రేస్‌గా తాజ్‌మహల్ ప్రపంచ ఖ్యాతి గడించింది. అయితే తాజ్ మహల్ నిర్మించిన ప్లేస్ పై కూడా అనేక వివాదాలు ఉన్నాయి.
తాజ్ మహల్ ఉన్న ప్లేస్ లో ఒకప్పుడు శివాలయం ఉందని, శివాలయాన్ని కూలగొట్టి తాజ్ మహల్ నిర్మించారంటూ మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజ్ మహల్ కూల్చితే దానికి కింద ఖచ్చితంగా శివలింగం ఉంటుందంటూ కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయి. దీంతో గతకొద్ది రోజులుగా తరచూ తాజ్ మహల్ వార్తల్లో నిలుస్తోంది. పర్షియన్, ఒట్టోమన్, ఇండియన్, ఇస్లామిక్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ లో 1632లో తాజ్ మహల్ నిర్మాణం ప్రారంభమవగా..1648లో పూర్తయింది. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో తాజ్ మహల్ ని గుర్తించింది.
తాజ్ మహల్ కి మరో పేరు
వందలాది కూలీలు రాత్రింబవళ్ళు కష్టపడి నిర్మించిన ఈ కట్టడం అందం వెనుక చరిత్ర స్మృతుల్లో బయటపడని నిజాలు కూడా ఉన్నాయి. షాజహాన్ మూడో భార్య ముంతాజ్ మహాల్ 14వ సంతానానికి జన్మనిచ్చే సమయంలో మరణించింది. ఆమె మరణం షాజహాన్‌ను ఎంతో కృంగదీసింది. ఆమె మరణాంతరం షాజహాన్ ఈ కట్టడాన్ని నిర్మించాడు.

అయితే దీనిని నిర్మించే సమయంలో దీనికి పెట్టిన పేరు వేరొకటి ఉంది. వాస్తవానికి తాజ్ మహల్ ని నిర్మించినప్పుడు ప్రారంభంలో దానికి పెట్టిన పేరు 'రోజా ఈ మున్నావర(Roza -e-Munavvara)'..అంటే పర్షియాలో దీనర్థం అసమానమైన బిల్డింగ్ అని.



Click it and Unblock the Notifications