Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దీపావళి 2025 తేదీ,పూజా విధానం, శుభ ముహూర్తాలు, నియమాలు
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ రోజున దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తారు,బాణాసంచా కాలుస్తారు. అయితే ఈ సంవత్సరం దీపావళి తేదీపై ప్రజల్లో కాస్త గందరగోళం నెలకొంది. పండుగను అక్టోబర్ 20న జరుపుకోవాలా లేక 21న జరుపుకోవాలా అనే సందేహం చాలామందిలో ఉంది. శాస్త్రాల ప్రకారం దీపావళి పూజను కార్తీక మాసంలోని అమావాస్య తిథి నాడు, సూర్యాస్తమయం తర్వాత వచ్చే ప్రదోష కాలంలో నిర్వహించాలి. ఈ సంవత్సరం కార్తీక అమావాస్య తిథి రెండు రోజుల పాటు ఉంది.
అక్టోబర్ 20,2025 మధ్యాహ్నం 03:44 గంటలకు అమావాస్య ప్రారంభమై..అక్టోబర్ 21 సాయంత్రం 05:54 గంటలకు అమావాస్య ముగుస్తుంది. అక్టోబర్ 20న సూర్యాస్తమయం తర్వాత ప్రదోష కాలం మొత్తం అమావాస్య తిథి వ్యాపించి ఉంటుంది. కానీ అక్టోబర్ 21న ప్రదోష కాలంలో కేవలం 9 నిమిషాలు మాత్రమే అమావాస్య ఉండి ఆ తర్వాత కార్తీక శుక్ల ప్రతిపాద తిథి ప్రారంభమవుతుంది. ప్రదోష కాలంలో లక్ష్మీ పూజ చేయడం అత్యంత ముఖ్యం కాబట్టి పండితులు, జ్యోతిష్యులు అక్టోబర్ 20 సోమవారం నాడే దీపావళి జరుపుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

లక్ష్మీ పూజకు శుభ ముహూర్తాలు
ప్రదోష కాలం: సాయంత్రం 05:46 నుండి రాత్రి 08:18 వరకు.
లక్ష్మీ పూజకు శుభ సమయం: సాయంత్రం 07:08 నుండి రాత్రి 08:18 వరకు.
వృషభ కాలం (స్థిర లగ్నం): సాయంత్రం 07:08 నుండి రాత్రి 09:03 వరకు.
నిశిత ముహూర్తం: రాత్రి 11:41 నుండి అర్ధరాత్రి 12:31 వరకు.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా పూజించండి
వృషభ లగ్నంలో పూజ: స్థిర లగ్నమైన వృషభ లగ్నంలో లక్ష్మీదేవిని పూజిస్తే, ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుందని నమ్మకం.
ఇష్టమైన పుష్పం: అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది తామర పువ్వు. పూజలో దీనిని తప్పకుండా సమర్పించాలి.
ప్రియమైన నైవేద్యం: లక్ష్మీదేవికి కుంకుమపువ్వు కలిపిన పాయసం (ఖీర్) అంటే చాలా ఇష్టం. ఈ నైవేద్యం సమర్పించడం వల్ల అమ్మవారు త్వరగా ప్రసన్నురాలవుతారు.
తామర గింజల మాల: దీపావళి రాత్రి తామర గింజల మాల (కమల గట్ట మాల)తో కనకధారా స్తోత్రం పఠిస్తే, ఆర్థికంగా అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి.
ముత్తయిదువ సామాగ్రి: పూజలో పసుపు, కుంకుమ, గంధం, అక్షతలతో పాటు అమ్మవారికి అలంకరణ వస్తువులు సమర్పించడం శుభప్రదం.
ముఖ్య నియమాలు
దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజ తర్వాత ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వకూడదని నమ్ముతారు. రాహుకాలం (ఉదయం 7:50 - 9:15), యమగండం (ఉదయం 10:40 - మధ్యాహ్నం 12:06) సమయాల్లో శుభకార్యాలు ప్రారంభించవద్దు.



Click it and Unblock the Notifications