ప్రపంచంలో ఈమెను మించిన తల్లి లేదు.. భర్త చనిపోయినా, ఇల్లు కబ్జా అయినా, లక్షల సామ్రాజ్యాన్ని స్థాపించింది!

ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవరూ ఉండరు. తండ్రి కష్టాల్లో వదిలేసినా.. తన పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ, వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఎంతగానో కష్టపడుతుంది. భర్త చనిపోయినా కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూ.. సక్సస్ అవుతున్నారు. ఇప్పటికీ గొప్ప గొప్ప వాళ్ళ పేరు చరిత్రలో వినిపిస్తాయి కానీ, తల్లిని ఎవరూ గుర్తించరు. అలాంటి తల్లి గురించే ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. ఆ తల్లి నిజంగా గొప్ప యోధురాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఎందుకంటే ఆమె అతిచిన్న వయసులోనే భర్త చనిపోయినా కుటుంబ బాధ్యతను తన భుజాలపైన వేసుకొని కుటుంబాన్ని నడిపించి గొప్ప స్థాయిలో పెట్టిన కథ.

ఆమె ఎవరంటే?

ఆ తల్లి పేరు రాజేశ్వరి దేవి. ఆమెది హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లోని ఓ చిన్న కాలనీ. పెళ్లి చేసుకుంది మంచి భర్తనే. ఆస్తి పాస్తులు కూడా బాగానే ఉండేవి. కానీ మనం ఒకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది అని అంటారు కదా. అలానే ఆమె జీవితంలో ఒక పెను విషాదం వచ్చింది. అదే ఆమె భర్త పెళ్లి తరువాత కొన్ని రోజులకే కాలం చెల్లారు. అప్పటికే ఆమె కడుపులో ఓ నలుసు ఉన్నాడు. భర్త మరణం వైపు, కుటుంబ బాధ్యత ఓ వైపు రెండూ ఒకేసారి మీద పడ్డాయి.

Exclusive interview with great mother rajeshwari Who made lakhs worth business with zero rupees

అప్పటి వరకు సాఫీగా సాగుతున్న జీవితంలోకి రాకాసి అలలు తమ బతుకు నావను ముంచేశాయి. ఆ దుఖంలోనే రాజేశ్వరికి డెలివరీ అయ్యింది. కొడుకు పుట్టాడు. అయితే ఆ సంతోషం ఒక్క క్షణం కూడా నిలవలేకపోయింది. ఎందుకంటే ఆ బిడ్డకు చూపు లేదు. రెండు కళ్ళు అతుక్కొని ఆ బిడ్డ జన్మించాడు. అప్పటికీ తీవ్రమైన దుఃఖంలో ఉన్న ఆమెకు చూపులేని బిడ్డ పుట్టడం అదనపు బరువైంది. ఇంతలోనే రాకాసి రాబందుల చూపు తమ కుటుంబంపై పడింది.

కబ్జా..

రాజేశ్వరి ఇప్పుడు ఉంటున్న బిల్డింగ్ విలువ కోట్లలో ఉంటుంది. ఒకప్పుడు ఆ బిల్డింగ్ మొత్తం ఆమె భర్త పేరుమీదే ఉండేది. కానీ భర్త చనిపోవడం, డెలివరీ వెళ్లడం వంటి విషయాలు వారికి కలిసి రాలేదు. ఈ క్రమంలోనే తమ ఇంటిని డెవలప్ చేయిద్దామని డెవలపర్స్‌కి ఇస్తే వాళ్ళు బిల్డింగ్ మొత్తాన్ని కబ్జా చేసి.. వీరికి ఒక అపార్ట్మెంట్ మాత్రమే ఇచ్చారు. ఆ బిల్డింగ్ కబ్జాకు గురవడం కూడా వారిని తీవ్రంగా కలిచివేసింది. కోట్ల విలువగల భర్త లేరు. పుట్టిన బిడ్డకు చూపు లేదు. ఉన్న ఆస్తి కబ్జాకు గురైంది. ఇవన్నీ ఆమెను తీవ్రంగా కూగజేశాయి. జీవితంలో మళ్ళీ కోలుకోలేనేమో అని సూసైడ్ చేసుకుందామని కూడా ప్రయత్నించింది. కానీ చూపు లేని బిడ్డ పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఆ ఆలోచనను విరమించుకుంది. ఈ పరిస్థితులను ఆమె ఎలా గట్టెచింది? ఆమె ఎలా మళ్ళీ నిలదొక్కుకుంది? అనేది ఆమె మాటల్లో విందాం.

ఎలా జీవితంలో ఎదిగానంటే?

"అప్పటి వరకు అన్నీ సజావుగానే ఉండేది. కానీ ఒక్కసారిగా మేము కష్టాల కడలిలో చిక్కుకున్నాం. ఏం చేయాలో తోచేది కాదు. ప్రతిరోజూ చిన్న చిన్న పనులకు వెళ్తుండేదాన్ని. అయినా అవి నా కుటుంబ పోషణకు సరిపోయేవి కాదు. అందుకే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నాను. కానీ ఏం వ్యాపారం అనేది నాకు అస్సలు తోచడం లేదు. నా కుటుంబ సభ్యులతో దీనిపై మాట్లాడా. మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాను. అదే మా కుల వృత్తి అయిన కుండలు తయారు చేసి అమ్మడం.

నా సొంతంగానే కుండల వ్యాపారం మొదలుపెట్టాను. మొదట్లో ఆ వ్యాపారం అంతగా సక్సెస్ కాలేదు. కానీ నా ప్రయత్నాన్ని మానలేదు. కొత్తలో ఇల్లు గడిచేంత ఆదాయం మాత్రమే వచ్చేవి. కానీ క్రమంగా నా వ్యాపారం బలపడింది. నా కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది. ఆదాయం రావడం మొదలయ్యింది. ఆ డబ్బులతో ముందుగా నా బిడ్డకు చూపు తెప్పించాలనే ప్రయత్నాన్ని ప్రారంభించాను. అతడి చూపుకోసం తిరగని ఆసుపత్రి లేదు, మొక్కని దేవుడు లేడు. కానీ ఎవరూ కూడా అది సాధ్యం కాదు అని చెప్పేశారు. దీంతో చేసేది ఏమీ లేక.. నా బిడ్డను అంధుల పాఠశాలలో చేర్పించి చదివించాను. ఓవైపు బిడ్డను చదివిస్తునే ఇంకోవైపు ఇంటిని చక్కదిద్దుకున్నాను.

ఇంటిని ఆధునికంగా రేనోవేట్ చేసుకొని.. బిడ్డ భవిష్యత్తు కోసం నిధులు సేవింగ్ చేయడం మొదలు పెట్టాను. బిడ్డ పెరుగుతున్నా కొద్దీ, ఆదాయం పెరుగుతూ వచ్చింది. నా కుటుంబ పరిస్థితి కూడా మెరుగయ్యింది. ఇప్పుడు నేను ప్రతిరోజూ కొన్ని వేలల్లో వ్యాపారం చేస్తాను. నా కుటుంబాన్ని నా సొంత వ్యాపారంతోనే చూసుకుంటున్నాను. అలాగే చూపులేకపోయినా నా బిడ్డకు పెళ్లి సంబంధాన్ని చూసి పెళ్లి చేయిస్తున్నాను. నా జీవితానికి ఇది నేను సాధించిన గొప్ప విజయాల్ని నేను అనుభవిస్తున్నాను. ఇది కేవలం నా సొంతం లక్ష్యంతో, నా స్వశక్తితో సాధించుకుంది. స్త్రీ తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదంటూ నేను నిరూపించిన సత్యం.

Story first published: Saturday, March 8, 2025, 22:36 [IST]
Desktop Bottom Promotion