Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
Exclusive: లైఫ్ లో ఒక్కసారైనా ఈ ఫ్లవర్ షో చూడాలి, లక్షల్లో రకరకాల పూలు, స్పెషల్ స్టోరీ
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశభక్తిని తలపించే కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సిలికాన్ సిటీ బెంగళూరులోని లాల్ బాగ్ లో ఫల, పుష్ప ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటుంది. బెంగళూరు నగరంలోని లాల్ బాగ్ లో ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా సెలవు కావడంతో లాల్ బాగ్ కు ప్రజలు పోటెత్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం లాల్ భాగ్ లో ప్రత్యేక థీమ్ లతో ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ థీమ్, పార్లమెంట్ థీమ్ తో ప్రత్యేకంగా ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. సుమారు 32 లక్షల పూలు ఉపయోగించి ప్రత్యేకంగా ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు.

మామూలుగానే లాల్ బాగ్ లో పర్యాటకుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు లాల్ బాగ్ లో ప్రత్యేకంగా ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయడంతో పర్యాటకుల సంఖ్య మూడింతలు పెరిగింది. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ప్రజలు లాల్ బాగ్ వచ్చి వెళ్తుంటారు. ఇప్పుడు ఫల, పుష్ప ప్రదర్శన సందర్భంగా పలు ప్రాంతాల ప్రజలు లాల్ బాగ్ కు భారీగా తరలివస్తున్నారు.

లాల్ బాగ్ కు నాలుగు వైపుల ఉన్న నాలుగు గేట్ల దగ్గర టిక్కెట్ కౌంటర్లలో ఫల, పుష్ప ప్రదర్శన వీక్షించడానికి టిక్కెట్లు విక్రయిస్తున్నారు. ఫల, పుష్ప ప్రదర్శన చూడాలనుకున్న వారికోసం ప్రత్యేకంగా టికెట్ల ధరలు నిర్ణయించారు. పెద్దలకు 80 రూపాయలు, పిల్లలకు 30 రూపాయలు ధర నిర్ణయించారు. ఇక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఫల, పుష్ప ప్రదర్శన వీక్షించడానికి అవకాశం కల్పించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు లాల్ బాగ్ లో ఫల, పుష్ప ప్రదర్శన చూడడానికి అవకాశం ఉంది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా లాల్ బాగ్ లో సుమారు రూ. 2. 80 కోట్లు ఖర్చు చేసి ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. లాల్ బాగ్ లో ఫల, పుష్ప ప్రదర్శన చిన్నా,పెద్ద అని తేడా లేకుండా అందరినీ కట్టిపడేస్తుంది. ఫల, పుష్ప ప్రదర్శన సందర్భంగా లాల్ బాగ్ లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడు, కేరళ, అసోం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా పూలు తెప్పించి లాల్ బాగ్ లో ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు.

సుమారు ఏడు లక్షల నుండి ఎనిమిది లక్షల పూలు ఉపయోగించి అంబేద్కర్ థీమ్ చక్కగా ఏర్పాటు చేశారు. లక్షలాది పూలు ఉపయోగించి పార్లమెంట్ భవనం తయారు చేశారు. లక్షలాదిమంది ప్రజలు లాల్ బాగ్ చేరుకుని ఫల, పుష్ప ప్రదర్శన వీక్షించారు. ఆగస్టు 15వ తేదీ ప్రభుత్వ సెలవు కావడం, తరువాత వరుసగా వరమహాలక్ష్మి పండుగతో పాటు వీకెండ్ రావడంతో శని, ఆదివారం రోజుల్లో ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉందని కర్ణాటక తోటల పెంపకం శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.




Click it and Unblock the Notifications
