Latest Updates
-
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే.. -
మీ జన్మ నక్షత్రానికి ఏ దేవత అధిపతి తెలుసా? ఏ దేవతను పూజించాలి మీ స్టార్ ఏది? -
జూన్ 7 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి హెచ్చరిక.. నేటి గ్రహాల ప్రభావం ఇదే! -
మిథునం, సింహం, ధనస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 07 నుండి 13 జూన్ 2026 వరకు -
సింహం, ధనుస్సు, మీన రాశుల వారికి అదృష్ట యోగం.. ఆదివారం మీ జాతకం ఎలా ఉంది? - ఆదివారం, 07 జూన్ 2026 -
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి
మీరు ఉపయోగించే పసుపు స్వచ్ఛమైనదేనా? ఓసారి ఇలా చెక్ చేసుకోండి!
ప్రస్తుతం కల్తీ అనే పదం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చిన్న పిల్లలు తినే ఆహారం నుంచి అన్ని వస్తువుల్లో కల్తీ కలి ప్రపంచాన్ని సవాలు విసురుతుంది. ఇవి మాత్రమే కాదు, వంటింట్లో వినియోగించే మసాలా, కారం, నూనె, ఉప్పు, పప్పు అన్నీ కల్తీ అవుతూ.. ప్రజలకు పెను సవాలుగా మారింది.
అయితే ఇటీవల కల్తీ పసుపు కూడా ప్రజలకు పెను సవాలుగా మారింది. ఈ కల్తీ పసుపును ఆహారంలో వినియోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మీ ఇంట్లో ఉన్న పసుపు నకిలీదా లేదా అసలైనదా అనేది తెలుసుకోవడానికి ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి. సులువుగా నకిలీ పసుపును గుర్తించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

నీటిలో పసుపు వేసి గుర్తించొచ్చు..
మార్కెట్‌లో నకిలీ పసుపు విస్తరించడాన్ని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఓ ప్రయోగాన్ని రూపొందించారు. దానితో సులువుగా పసుపు నకిలీదా లేదా అసలైనదా అనేది తెలుసుకోవచ్చు. అదేంటంటే..
రెండు గ్లాసుల నీటిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. అలా పసుపు వేసినప్పుడు ఆ పసుపు.. నీరు లేత పసుపు రంగులోకి మారిపోయి.. మిగిలిన పసుపు గ్లాస్ అడుగు భాగాన చేరుకుంటుంది. ఇలా లేత పసుపు రంగులోకి మారిపోయి అడుగుభాగాన చేరితే అది అసలైన పసుపు అని నిర్ధారించాలని నిపుణులు చెబుతున్నారు.
అదే నకిలీ పసుపు అయితే.. గ్లాసులోని నీటిని పూర్తిగా, చిక్కగా మార్చేస్తుందని, పసుపు కూడా అడుగు భాగాన చేరదని చెబుతున్నారు. ఒకవేళ మీ పసుపు కూడా ఇలా చిక్కగా మారిపోతే అది నకిలీదని గుర్తించాలని, ఆ పసుపును వినియోగించకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు.
పసుపు కొమ్ములు కూడా..
మార్కెట్‌లో లభించే పసుపు కల్తీదని గ్రహించిన కొందరు పసుపు కొమ్ములు కొంటున్నారు. ప్యాకెట్‌లో స్వచ్ఛమైన పసుపు లభించడం లేదని, అందుకే కొమ్ములు కొని వాటిని పొడి చేసుకొని వాడుతున్నారు. అయితే ఈ పసుపు కొమ్ములను సైతం కల్తీ చేస్తున్నట్లు తాజాగా కొన్ని నివేదికల్లో వెల్లడైంది.
పాడైపోయిన పసుపు కొమ్ములను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని తేలింది. అందుకోసం.. పాడైపోయిన పసుపు కొమ్ము, తాజాగా కనిపించేందుకు వాటిని కలర్లు కలిపి మార్కెట్లో అమ్మేస్తున్నారని చెబుతున్నారు. అందుకే పసుపు కొమ్ములు కొనే వారు సైతం నకిలీ కొమ్ములు కొని మోసపోవద్దని, వాటిని గుర్తించి జాగ్రత్త పాడాలంటున్నారు.
అందుకోసం ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రయోగాన్ని రూపొందించారు. ఇందుకోసం రెండు గ్లాసుల నీరు తీసుకోవాలి. పసుపు కొమ్ములను ఆ నీటిలో ముంచినప్పుడు నీరు రంగు మారకపోతే అది అసలైన పసుపు కొమ్ము అని గుర్తించాలని చెబుతున్నారు. ఒకవేళ గ్లాసులోని నీరు రంగు మారితే.. నకిలీదని అర్ధం చేసుకోవాలని చెబుతున్నారు.
గమనిక: ఈ కథానాంశంలో మేము పొందుపరిచిన విషయాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications