Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
లైఫ్ లో ఒక్కసారైనా చూడాలి, రంగరంగ వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకల స్పెషల్
దక్షిణాయనంలో శ్రావణమాసం కృష్ణపక్షం అర్థరాత్రి అష్టమి తిథి రోహణి నక్షత్రంలో శ్రీ కృష్ణుడు జన్మించాడు.శ్రీ కృష్ణుడు జన్మభూమి మధుర, బృందావనంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు రంరంగ వైభవంగా నిర్వహిస్తారు. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లోనూ శ్రీ కృష్ణుడికి అద్భుతమైన, చాలా పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. భారతదేశంలోని అనేక ఆలయాలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
గురువాయూర్
దేశంలోనే ఎక్కువగా శ్రీ కృష్ణుడి ఆలయాలు కేరళలో ఉన్నాయి. కేరళలో అన్నిటికన్నా ప్రసిద్ధమైన దేవాలయం గురువాయర్. గురువాయర్ ను దక్షిణ ద్వారక అంటారు. గురువాయర్ లోని విగ్రహాన్ని దేవగురు బృహస్పతి..వాయుదేవుడి సహాయంతో ప్రతిష్టించాడని స్థలపురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని గురువాయూర్ అని పిలుస్తారు. దీన్నిభూలోక వైకుంఠంగా భక్తులు అభివర్ణిస్తారు. గురువాయర్ ఆలయంలో కృష్ణుడు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. ఇక్కడ జన్మాష్టమి, డోలాపూర్ణిమ, విషు, కుచేల దినోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. చిన్నారులకు ఇక్కడ అన్నప్రాసన చేస్తే అలాంటి అనారోగ్య సమస్యలు రావని భక్తుల విశ్వాసం, నమ్మకం.

ఉడిపి శ్రీకృష్ణ మఠం
మధ్వాచార్యులు 13వ శతాబ్దంలో కర్ణాటకలోని ఉడిపిలో శ్రీకృష్ణ మఠం ఆలయాన్ని ప్రారంభించారు. సముద్రం మధ్యలో మునిగిపోతున్న ఓపడవను ఒడ్డుకు చేర్చిన మధ్వాచార్యులు అందుకు ప్రతిగా అందులో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అడిగి తీసుకున్నాడు. ఆ విగ్రహం ఇంకేదో కాదు, దేవకి కోరిక మేరకు దేవశిల్పితో రుక్మిణి చెక్కించిన విగ్రహం అని భక్తులు నమ్ముతుంటారు. అలా ఆ విగ్రహం సముద్రం ద్వారా కర్ణాటకలోని ఉడిపికి వచ్చి చేరింది. ఉడిపిలో బాలకృష్ణుడిని కిటికీ నుంచి దర్శించుకోవాలి. ఈ ఉడిపి పుణ్యక్షేత్రంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. కృష్ణుడి జన్మతిథి సందర్భంగా విట్టల్ పిండి పేరుతో కృష్ణుని మట్టివిగ్రహాన్ని రూపొందించి ఊరేగించి ఆ తర్వాత ఆలయంలో ఉన్న సరోవరంలో నిమజ్జనం చేస్తారు.
ద్వారక -గుజరాత్
శ్రీ కృష్ణుడి మహిమాన్విత పుణ్యక్షేత్రాల్లో ద్వారక ఒకటి. చాళుక్య శైలి నిర్మాణానికి నిదర్శనంగా ఈ ఆలయం నిలుస్తుంది. ఏటా జన్మాష్టమికి ఇక్కడ నిర్వహించే వేడుకలు చూసేందుకు లక్షలాది భక్తులు పోటెత్తుతారు. ద్వారక సమీపంలో దర్శించుకునేందుకు చాలా ప్రదేశాలున్నాయి. భారతదేశంలోని శ్రీ కృష్ణుడి అన్ని ఆలయాల్లో ద్వారకకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీ కృష్ణుడిని ఇంటి దేవుడిగా కొలిచే ప్రజలు జీవితంలో ఒక్కసారైనా ద్వారకలోని శ్రీ కృష్ణుడిని దర్శించుకోవాలని ఆశపడుతుంటారు.
బృందావనం
ఉత్తరప్రదేశ్ లోని బృందావనం ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. శ్రీ కృష్ణ జన్మించిన ప్రదేశం మధుర బాలగోపాలుడిని ఆరాధించే పుణ్యక్షేత్రాల్లో ఒకటి. సుమారు 50 అడుగుల ఎత్తైన ద్వాదశాదిత్య శిలపై ఉన్న శ్రీ రాధా మదన్ మోహన్ మందిరాన్ని బృందావనంలో నిర్మించిన మొదటి ఆలయం అని పెద్దలు చెబుతారు. జన్మాష్టమి తో పాటూ చప్పన్ భోగ్, హోలీ వేడుకలు బాగా జరుపుతారు. మధుర నుంచి బృందావనం సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గోవిందదేవ్, మీరాబాయి దేవాలయాలున్నాయి. బృందావనానికి సమీపంలో గోవర్ధన పర్వతం...అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో రాధా కుండ్/ శ్యామ్ కుండ్ ఉంది. గోపికలు శ్రీ కృష్ణుడి రాకకోసం ఎదురుచూసిన ప్రదేశం ఇది అని చెబుతారు.
పూరీ
శ్రీ కృష్ణుడు ఆయన సోదరి సుభద్ర, సోదరుడు బలరాముడితో కలసి కొలువైన క్షేత్రంగా పూరీ ప్రసిద్ది చెందింది. సప్త మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటైన పూరీలో అడుగడుగునా మిస్టరీలే. ఏటా ఆషాఢమాసంలో జరిగే రథయాత్ర అత్యత ప్రత్యేకం. పూరీ రథయాత్రకు దేశం నలుమూలలోని శ్రీ కృష్ణుడి భక్తులు లక్షల సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకుంటారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో శ్రీ కృష్ణుడికి ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. దేశంలోని ప్రతి శ్రీ కృష్ణుడి ఆలయానికి ఏదో ఒక ప్రత్యేకత, ప్రాధాన్యతలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి.
పార్థసారథి ఆలయం
తమిళనాడు రాజధాని చెన్నై సిటీలో పార్థసారథి ఆలయం ఉంది. ఈ ఆలయంలో కృష్ణుడు, రాముడు, వరాహాస్వామి, నరసింహుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శతాబ్ధాల క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. చెన్నైలోని పార్థసారథి ఆలయానికి తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి శ్రీ కృష్ణుడి భక్తులు వేల సంఖ్యలో వచ్చి వెలుతుంటారు.



Click it and Unblock the Notifications











