Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Gandhi Jayanti 2022: గాంధీజీ సైన్యంలో పనిచేశారని మీకు తెలుసా? ఎవరికీ తెలియని విషయాలు..
గాంధీజీ సైన్యంలో పనిచేశారని మీకు తెలుసా? బోస్ కు డైట్ ప్లాన్ తయారు చేసిచ్చారా? చాలా కొద్ది మందికే తెలిసిన విషయాలు
Gandhi Jayanti 2022: గాంధీ జయంతిని ప్రతి ఏటా అక్టోబర్ 2న జరుపుకుంటారు. గాంధీజీ తన అహింసాయుత ఉద్యమం ద్వారా దేశ ప్రజలను ఏకం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారు. ఆయన అహింసా సిద్ధాంతాలను గుర్తుంచుకునేందుకు అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత 1948 జనవరి 30న మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. గాంధీ హత్య జరిగిన రోజును దేశంలో జాతీయ అమరవీరుల దినోత్సవంగా పాటిస్తారు.

మహాత్మా గాంధీ గురించి కొంతమందికే తెలిసిన వాస్తవాలు:
1. మహాత్మా గాంధీ నోబెల్ శాంతి బహుమతికి ఐదుసార్లు నామినేట్ చేయబడ్డారు. 1937, 1938, 1939, 1947 మరియు 1948 సంవత్సరాల్లో ఆయన హత్యకు కొన్ని రోజుల ముందు వరకు నామినేట్ చేయబడ్డారు. కానీ ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు.
2. గాంధీజీకి మహాత్మా బిరుదును కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు. గాంధీ గుడిసెల గుమ్మాల దగ్గర ఆగి ప్రజలతో వారి భాషలోనే మాట్లాడేవారని ఠాగూర్ చెప్పారు. గాంధీజీ భారతీయులంతా తన రక్తమాంసాలుగా భావించారని, అందుకే ఆయనకు 'మహాత్మా' అని పేరు పెట్టారని ఠాగూర్ పేర్కొన్నారు.
3. మదురైలోని గాంధీ మెమోరియల్ మ్యూజియంలో మహాత్మా గాంధీ అవశేషాలు భద్రపరచబడ్డాయి.
4. గాంధీ ఒక ఫుట్‌బాల్ అభిమాని. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో హెన్రీ థోరో, లియో టాల్‌స్టాయ్‌ల రచనల నుండి ప్రేరణ పొంది రెండు ఫుట్‌బాల్ క్లబ్‌లను స్థాపించారు. వాటికి పాసివ్ రెసిస్టర్స్ అనే పేరు పెట్టారు.
5. బాపు తన రాజకీయ ప్రత్యర్థులలో ఒకరైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసం డైట్ ప్లాన్ తయారు చేసి, బోస్ ఆకు కూరలు తినాలని మరియు పిండి పదార్ధాలకు దూరంగా ఉండాలని సూచించారు. గాంధీకి ఆహారం మరియు ఆహారపదార్థాలపై ప్రయోగాలు చేయడంలో భాగంగా ఈ ప్రణాళిక రూపొందించబడింది.
6. వల్లభాయ్ పటేల్ అహ్మదాబాద్‌లోని ఒక క్లబ్‌లో బ్రిడ్జ్ ఆడుతున్నప్పుడు గాంధీ ప్రసంగాన్ని మొదటిసారి విని వెంటనే ఆయన నుండి ప్రేరణ పొందాడు. పటేల్ తన న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి సత్యాగ్రహం కోసం తనను తాను అంకితం చేసుకున్నారు. బాపు వ్యక్తిత్వం అలాంటిది. ఆయన ప్రజలపై తక్షణ మరియు శాశ్వతమైన ముద్ర వేశారు.
7. గాంధీ మొదటి ఉపాధ్యాయులలో ఒకరు ఒక ఐరిష్ వ్యక్తి. అందుకే ఇంగ్లీషులో మాట్లాడేటప్పుడు గాంధీకి ఐరిష్ యాస ఉండేది.
8. మహాత్మా గాంధీ యొక్క అంత్యక్రియల ర్యాలీ 8 కిలోమీటర్ల వరకు సాగింది. ఆయన భారతదేశ ప్రజల నుండి పొందిన ప్రేమకు చిహ్నంగా నిలిచింది ఆ ర్యాలీ.
9. బోయర్ యుద్ధ సమయంలో, మహాత్మా గాంధీ సైన్యంలో పనిచేశారు.
10. గాంధీ తన 13 ఏళ్ల వయసులో తన 14 ఏళ్ల వధువు కస్తూర్భా గాంధీని వివాహం చేసుకున్నాడు.
11. టైమ్ మ్యాగజైన్ యొక్క 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్' లేదా 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' ఎంత ప్రతిష్టాత్మకమైనదో మనకు తెలుసు. అయితే 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం లేదా దండి మార్చ్ ఉద్యమాలకు 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' సాధించిన ఏకైక భారతీయుడు మహాత్మా గాంధీ మాత్రమే.
12. 1999లో టైమ్ మ్యాగజైన్ యొక్క 'పర్సన్ ఆఫ్ ది సెంచరీ' టైటిల్‌కు మహాత్మా గాంధీ రెండవ రన్నరప్‌గా ఎంపికయ్యారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 20వ శతాబ్దంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధిపత్యం చెలాయిస్తున్నందున టైటిల్‌కు ఎంపికయ్యారు.
13. సుభాష్ చంద్రబోస్ 1944లో సింగపూర్ రేడియోలో గాంధీని 'జాతిపిత' అని పిలిచారు. ఆ తర్వాత, 1947 సమావేశంలో సరోజినీ నాయుడు కూడా అదే బిరుదును ప్రస్తావించారు. భారత ప్రభుత్వం గాంధీకి అధికారికంగా అటువంటి బిరుదులేవీ ఇవ్వనప్పటికీ.. ఆ బిరుదు దేశవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందింది.
14. 1948లో గాంధీ అంత్యక్రియలకు ఉపయోగించిన కైసన్(మృతదేహాన్ని తీసుకువెళ్లి బండి)ను మళ్లీ 1997లో మదర్ థెరిసా అంత్యక్రియలకు ఉపయోగించారు.
15. కరెన్సీపై నవ్వుతున్న గాంధీ చిత్రం తెలిసే ఉంటుంది కదా. అయితే ఆ చిత్రాన్ని ఎవరో చిత్రకారుడు గీశాడనో అనుకుంటారు. కానీ, రాష్ట్రపతి భవన్ లో 1946లో ఓ ఫోటోగ్రాఫర్ తీసిన అసలైన ఫోటో అది.



Click it and Unblock the Notifications











