Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
భయానకంగా మారిని కేరళ వాయ్‌నాడ్.. అర్థరాత్రి విరిగిపడిన కొండచరియలు..!!
కేరళలోని వాయ్‌నాడ్ జిల్లాల్లో అర్థరాత్రి వరదలు ముంచుకొచ్చాయ్. ప్రజలంతా ఘాడ నిద్రలో ఉండగా ఒక్కసారిగా వరదలు వచ్చి కొండచరియలు విరిగి పడ్డాయ్. ఒకవైపు ప్రజల ఆర్థనాదాలు, మరోవైపు కొండచెరియలు విరిగి పడ్డంతో వాయ్‌నాడ్‌లో భయానక పరిస్థితి నెలకొంది. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయ్. కొండచరియల కింది, ఇళ్ల శిధిలాల కింది వంలాది మంది చిక్కకొని ఉన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, కెఎస్‌డీఎమ్‌లో దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయ్. భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురౌతున్నాయ్.

వాయ్‌నాడ్‌లో ఇప్పటికి 44 మంది మృతి చెందగా, 70 మందికి తీవ్ర గాయాలయ్యాయ్. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వెలుగులోకి రాని మరణాలు చాలా ఉన్నాయని అంటున్నారు. కొన్ని కొండచరియలు ఊళ్లకు ఊళ్లను ఊడ్చేశాయ్. కేరళ సీఎంతో ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఫోన్‌లో సంభాషించి పరిస్థితిని తెలుసుకున్నారు.
వాయ్‌నాడ్‌లో వచ్చిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని పార్లమెంటులో కూడా డిమాండ్ చేస్తున్నారు. 5వేల కోట్ల రూపాయలను తక్షణ సాయం కింద అందించాలని కోరుతున్నారు. అయితే వాయ్‌నాడ్‌లో 225 మంది ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. రేపు వాయ్‌నాడ్‌కు, రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ చేరుకుంటున్నారు.
ఈ భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురవనున్నాయ్. 100 మంది వరకు గల్లంతయ్యారని తెలుస్తోంది. ఇళ్లు కూలిపోతున్నాయ్, చెట్లు కొట్టుకుపోతున్నాయ్, కొండచరియలు విరిగిపడుతున్నాయ్, వాయ్‌నాడ్‌లో భయానక పరిస్థితి నెలకొని ఉంది. మృతి చెందిన వారికి 2 లక్షల ఎక్స్‌గ్రేషియాలను ప్రధాని ప్రకటించారు. కొండచరియలే పరిస్తితిని చాలా భయానకంగా మార్చి వేశాయ్.
గతంలో కూడా కేరళలో ఇలాంటి వరదలు చాలా వచ్చాయ్. వర్షాకాలం వచ్చిందంటే కేరళలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. పచ్చదనం, కొండలు, లోయలు ఉన్నా అవే ఇప్పుడు ప్రమాదకరంగా మారాయ్. ఎన్ని సహాయక చర్యలు తీసుకున్నా పరిస్థితి దారుణంగా మారుతుంది. వర్షాకాలం రాగానే కేరళీయులలో భయం నెలకొని ఉంటుంది. వాయ్‌నాడ్‌లో ప్రస్తుతం దారుణ పరిస్థితి నెలకొని ఉంది. వాయ్‌నాడ్ నుంచి గతంలో రాహుల్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇది ఆయన నియోజకవర్గమే కావడంతో రాహుల్ గాంధీ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రేపు, ప్రియాంకా గాంధీతో కలిసి రాహుల్ గాంధీ వాయ్‌నాడ్ రానున్నారు.



Click it and Unblock the Notifications