Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
10, 20, 50 నోట్లపై ఉన్న చారిత్రక కట్టడాల గురించి తెలుసా?
భారతదేశ కరెన్సీ నోట్లపై నవ్వుతున్న మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. అలాగే మరో వైపు చారిత్రక కట్టడాలు, స్మారక నిర్మాణాలు ఉంటాయి. వీటిని చాలా మంది గుర్తించే ఉంటారు. దేశంలోని చారిత్రక, పురాతన, స్మారక నిర్మాణాల వైవిధ్యాన్ని, వైభవాన్ని తెలియజెప్పేందుకు ఇలా కరెన్సీ నోట్లపై వీటిని ముద్రిస్తుంది ఆర్‌బీఐ.

రూ.1 నోట్ పై మొదటి ప్రపంచ యుద్ధం చరిత్రకు సంబంధించిన చిత్రం ఉండేది. అయితే ఆ నోటు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అలాగే రూ.10 నోటుపై కోణార్క్ దేవాలయం ఉంటుంది. మరి మిగతా నోట్లపై ఉండే ఆ నిర్మాణాలు ఏంటి వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.10 నోటు - కోణార్క్ సూర్య దేవాలయం:
రూ.10 నోటు కొత్త సిరీస్ ను ఆర్‌బీఐ 2018 జనవరి 5వ తేదీన తీసుకువచ్చింది. ముందు మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. వెనక వైపు ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం ఉంటుంది. ఈ సూర్య దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. నరసింహదేవ-1 ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఇక్కడ శిల్ప వైభవం అబ్బురపరుస్తుంది. ఒడిశాలోని గోల్డెన్ ట్రయాంగిల్ లో కూడా ఈ సూర్య దేవాలయం ఒకటి. సూర్య దేవాలయం రథంలా ఉంటుంది. ఏడు గుర్రాలు ఏడు రోజులను సూచిస్తాయి. రథానికి 12 జతల చక్రాలు ఉంటాయి. ఇవి 12 నెలలను సూచిస్తాయి. మొత్తం 24 చక్రాలు 24 గంటలను సూచిస్తాయి. ఈ దేవాలయం 1984లో యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

రూ.20 నోటు - ఎల్లోరా గుహలు, ఔరంగాబాద్:
రూ. 20 కొత్త సిరీస్ నోటుపై ఔరంగాబాద్ లోని ఎల్లోరా గుహలు ఉంటాయి. ఈ అద్భుతమైన నిర్మాణం 600-1000 CE మధ్య నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ స్మారక నిర్మాణంలో బౌద్ధ, హిందూ, జైన కళాకృతులను భాగం చేశారు. ఎల్లోరా గుహలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

రూ.50 నోటు - హంపి రాతి రథం, కర్ణాటక:
రూ. 50 కొత్త సిరీస్ నోటు ఫ్లోరోసెంట్ బ్లూ షేడ్ లో ఉంటుంది. రూ.10 నోటుపై ఉన్నట్టుగానే రూ.50 నోటుపై కూడా రథం లాంటి నిర్మాణ చిత్రం ఉంటుంది. ఇది కర్ణాటక హంపీలోని రథం చిత్రం. విఠల ఆలయ సముదాయంలో గరుడి కోసం ఈ ఆలయాన్ని నిర్మించారు. విజయనగర సామ్రాజ్య పాలనలో 14-16వ శతాబ్దం మధ్య ఈ ఆలయాలను నిర్మించారు. 1986లో యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తించింది.

రూ.100 నోటు - రాణి కి వావ్, గుజరాత్:
రూ.100 కొత్త సిరీస్ నోటుపై గుజరాత్ లోని రాణి కి వావ్ చిత్రం ఉంటుంది. గుజరాత్ పఠాన్ లో ఉన్న మెట్ల బావి ఇది. దీనిని 11వ శతాబ్దంలో సోలంకి రాణి ఉదయమతి నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ మెట్ల బావిలో అనేక శిల్పాలు కనువిందు చేస్తాయి. రాణి కి వావ్ కట్టడాన్ని యునెస్కో 2014లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

రూ.200 నోటు - సాంచి స్తూపం, మధ్యప్రదేశ్:
మధ్యప్రదేశ్ లోని ఆ సాంచి స్తూపం బౌద్ధ స్మారక చిహ్నం. దీని చిత్రాన్నే రూ.200 నోటుపై ముద్రించింది ఆర్‌బీఐ. ఈ స్తూపాన్ని క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. దీనిని అశోక చక్రవర్తి నిర్మించారని చరిత్ర చెబుతోంది. 12వ శతాబ్దం వరకు ఈ ప్రదేశం భారత్‌లోని ప్రధాన బౌద్ధ కేంద్రంగా ఉండేది. సాంచి స్తూపాన్ని 1989లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

రూ.500 నోటు - ఎర్రకోట, ఢిల్లీ:
రూ.500 నోటుపై కనిపించే ఢిల్లీలోని ఎర్రకోటను 17వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దాదాపు 200 సంవత్సరాలు, మొఘల్ చక్రవర్తి దీనిని పాలించారు. ఎర్రకోటను మొదట 'ఖిలా-ఇ-ముబారక్' లేదా బ్లెస్డ్ ఫోర్ట్ అని పిలిచేవారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపైనే ప్రధానమంత్రి జెండా ఎగురవేస్తారు. ఎర్రకోటను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

రూ.2000 నోటు- మంగళయాన్:
రూ.2000 నోటుపై మంగళయాన్ ఉంటుంది. మంగళయాన్ భారత దేశ మొదటి ఇంటర్ ప్లానెటరీ స్పేస్ మిషన్. 2013 సంవత్సరంలో ఇస్రో దీనిని రోదసిలోకి పంపించింది.(All Images: Twitter)



Click it and Unblock the Notifications